Grammar
-
ఈ ఒక్క ఫీచర్ చాలు.. గ్రామర్‌లో తప్పులు ఇట్టే పట్టేస్తుంది!
Google Grammar Check Feature: ఈ రోజుకి కూడా ఇంగ్లీషులో గ్రామర్ మిస్టేక్స్ చేసేవారి సంఖ్య భారీగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ దీని కోసం ఓ సరికొత్త ఫీచర్ తీసుకువచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గూగుల్ ఇప్పుడు తన గూగుల్ సెర్చ్‌లో వినియోగదారుల కోసం 'గ్రామర్ చెక్ ఫీచర్' తీసుకువచ్చింది. ఇది ప్రస్తుతం ఇంగ్లిష్ లాంగ్వేజ్‌కి మాత్రమే అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని భాషలకు అందుబాటులో ఉండనుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో వచ్చిన ఈ ఫీచర్ ద్వారా ఒక వాక్యం గ్రామర్ పరంగా సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ ద్వారా నేరుగా గ్రామర్ చెక్ చేసుకోవచ్చు. అంటే వాక్యాలు సరిగ్గా ఉన్నాయా.. లేదా? అని చెక్ చేసుకోవడానికి ప్రత్యేకించి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేదు. ఈ ఫీచర్ ఉపయోగించడం కూడా చాలా సులభం. నిజానికి ప్రతి సారీ గ్రామర్ చెక్ కోసం పేజ్ ఉపయోగించాల్సిన అవసరం లేదు, అయితే దీనిని మీరు ఉపయోగిస్తున్నప్పుడు గ్రామర్ చెక్ అనే టూల్ పాప్ అప్ అవుతుంది. ఇదీ చదవండి: ఇలా చేస్తే ఏడాదికి 60 లక్షల ఆదాయం! 10 ఏళ్ల వరకు గ్యారెంటీ! దీని ద్వారా మీరు ఒక వాక్యం ఎంటర్ చేయగానే అందులో గ్రీన్ చెక్ మార్క్ చూపిస్తుంది, అందులో ఏదైనా తప్పు ఉంటె రెడ్ మార్క్ చూపిస్తుంది. గ్రామర్ మాత్రమే కాకుండా స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా కరెక్ట్ చేస్తుంది. ఈ లేటెస్ట్ ఫీచర్ కంప్యూటర్లలో, స్మార్ట్ఫోన్లలో ఉపయోగించుకోవచ్చు. -
సమస్యే లేదు – వేరే అర్థం ఎందుకు?
పత్రికలలో ‘‘2500 ఏళ్లుగా పాణిని వ్యాకరణాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు’’ అనే వార్త చదివి తెల్లబోయాను. రిషిరాజ్ పోపట్ అనే 27 ఏళ్ల యువకుడు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో పీహెడీ చేస్తున్నారట. అతడు చేసిన ప్రతిపాదన ఇది. సంస్కృత వ్యాకరణం పన్నెండు సంవత్సరాలు చద వాలని ప్రసిద్ధి. పూర్వం అలా చదివేవారు. ఇరవై ఏడేళ్ల యువకుడు ఇంగ్లీషులో చదివి ఇలా చెప్పడం ఒక వింత. తమ జీవితాలను విద్యాతపస్సులకు అంకితం చేసిన మునులు వరరుచి, పతంజలి. వారు వ్యాకరణ శాస్త్ర గ్రంథాలను రచించిన వారు. పతంజలి ముని యోగ శాస్త్రాన్ని రచించిన వారు. ప్రపంచంలో చాలా యోగాలకు ఆయన యోగశాస్త్రం మూలం. ‘మహా భాష్యం వా పాఠయేత్, మహా రాజ్యం వా పాలయేత్’ అని ఆర్యోక్తి. పతంజలి ముని వ్యాకరణ మహా భాష్యాన్ని పాఠం చెప్పడం ఒక పెద్ద రాజ్యాన్ని పాలించడంతో సమానం. మహా భాష్యమైనా పాఠం చెప్పాలి. మహా రాజ్యమైనా ఏలాలని పై సంస్కృత సూక్తికి అర్థం. తరువాత కైయటుడు, భట్టోజి దీక్షితులు, నాగేశ భట్టు మొదలైన వారు బహుశాస్త్ర పండితులు. వీరు వ్రాసిన గ్రంథాలన్నీ అర్థం చేసుకోవడమే గొప్ప విషయం. వీరందరినీ కించపరిచే ఇతడు చెప్పిన విషయాన్ని పరిశీలించాలి. ఒక పదం తయారు చేయడంలో రెండు సూత్రాలు ఒకేసారి ప్రవర్తిస్తూంటే వానిలో ఏ సూత్రం ప్రవర్తింప చేయాలనే విష యంలో పాణిని ముని ‘విప్రతిషేధే పరం కార్యమ్’ అనే సూత్రం చెప్పారు. సమానమైన బలం కలిగిన రెండు సూత్రాలకు వైరుధ్యం కలిగినపుడు వరుస క్రమంలో తరువాత ఉన్న సూత్రం ఎంచు కోవాలి అని పాణిని మునిని అనుసరించిన గ్రంథకర్తలు తెలిపారు. ‘‘ఈ పద్ధతి వ్యాకరణం ద్వారా అనేకమైన తప్పు రూపాలను తయారు చేస్తుంది’’ అని ఇతడి ప్రతిపాదన. కాబట్టి ఇతడు ఈ సూత్రానికి వేరే అర్థం చెబుతున్నారు. ఒక పదం తయారు చేసే క్రమంలో ఒకచోట రెండు సూత్రాలు ప్రవర్తించవలసినపుడు వాటికి వైరుధ్యం వస్తే ఆ పదంలో రెండో భాగంలో ప్రవర్తించ వలసిన సూత్రాన్నే ప్రవర్తింప చేయాలి. ఈ పద్ధతిని అవలంబిస్తే సుమారు అన్ని పదాల తయారీలో సరైన సమాధానం లభిస్తుందని ఇతడి ప్రతిపాదన సారాంశం. ఉదాహరణానికి మంత్ర + భిస్ అని ఉన్నపుడు 7 అ – 3 పా – 103 సంఖ్యగల సూత్రంచే మంత్రంలోని త్ర వర్ణమందు గల అకారానికి ఏ కారం వస్తుంది. దీనివల్ల మంత్రేభిః అనే అసాధు రూపం ఏర్పడుతుంది. 7 అ – 1 పా – 9 సంఖ్యగల సూత్రంచే భిస్ కు ఐస్ వస్తుంది. మంత్ర + ఐస్ = మంత్రైః అని తయారవుతుంది. ఇది సరి అయిన రూపం. కాబట్టి రెండు సూత్రాలకు విప్రతిషేధం వస్తే వరుస క్రమంలో తరువాతి సూత్రం అని చెప్పకూడదు. మంత్ర + భిస్ అనే చోట తరువాత ఉన్న ఐస్ కి భిస్ వస్తోంది. ఇది పదంలో కుడివైపున జరిగే కార్యం. దానిని విధించే సూత్రాన్ని ఎంచుకోవాలని పాణిని అభిప్రాయం. దీనివలన మంత్రైః అనే సరి అయిన రూపం ఏర్పడుతుందని రిషి రాజ్ ప్రతిపాదనం. సూత్ర గ్రంథాలలో అల్పాక్షరాలలో అనల్పమయిన అర్థాన్ని ఇముడ్చుతారు. దానిలో సారం చాలా ఉంటుంది. దోషం ఉండదు. ఇలాంటి సూత్రాలు విద్యను కంఠస్థం చేయడానికి ఉపయోగిస్తాయి. కాని విద్యార్థికి సూత్రంలో భావం ఎలా తెలుస్తుంది? గురువుల వల్ల, సూత్ర గ్రంథాల అధ్యయనం వల్ల, సూత్రాలపై రాసిన వ్యాఖ్యల వల్ల తెలుస్తుంది. సూత్ర గ్రంథాలకు గురుశిష్య పరంపరగా వచ్చిన అర్థమే గ్రంథకర్త అభిప్రాయం అయ్యే అవకాశాలు అధికం. అలాగే గురు శిష్య పరంపరగా ఈ సూత్రాల అధ్యయనం సాగేది. ఒక సూత్రానికి కొత్త అర్థం చెప్పి పూర్వ గ్రంథాలు చెప్పినది తప్పు అనడం సమంజసం కాదు. కాత్యాయనునికి వరరుచి అని మరో పేరు. ఆయన వార్తికాలన్నీ మహా భాష్యంలో ఉన్నాయి. విడిగా లేవు. పతంజలి యోగ శాస్త్రం వ్రాశారు. వీరి వ్యాకరణ భాష్యాన్ని మహా భాష్యం అంటారు. బహువచనే ఝల్యేత్ 7 అ – 3 పా – 103 సూ. ఝలాదౌ బహు వచనే సుపి పరే అతోఙ్గ స్యైకార స్సా్యత్ రామేభ్యః ఇది పతంజలి భాష్యం. పై సూత్రం మంత్ర + భిస్ అన్నచోట త్ర కారానికి ఏత్వం విధించగలదు. ఇది తరువాతి సూత్రం కనుక మంత్రే + భిస్ అని అయ్యే అవకాశం ఉంది. అతో భిస ఐస్ 7 అ – 1 పా – 9 సూ. ‘అకారాన్తా దఙ్గా ద్భి స ఐస్ స్యాత్, రామైః’ ఇది భాష్యంలోనిది. మంత్ర + భిస్ అని ఉన్నపుడు పై సూత్రం చే ఐస్ వచ్చి మంత్రైః అని అవుతుంది. విప్రతిషేధే పరం కార్యమ్ ఈ సూత్రం చేత సమాన బలం కలిగిన రెండు సూత్రాలు ఒక చోట ప్రవర్తించవలసి వస్తే తరువాత ఉన్న సూత్రం ప్రవర్తించాలి. కానీ ఇక్కడ వరుసలో పూర్వం ఉన్న సూత్రం ప్రవర్తించిన రూపమే సరియైనది. కారణ మేమిటి ? అతో భిస ఐస్ 7 అ – 1 పా – 9 సూ. వృక్షైః, ఇహ పరత్వా దేత్వం ప్రాప్నోతి. ... కృతైత్త్వే భూత పూర్వ మకారం భవిష్యతి. ఐస్తు నిత్యమ్. ... కృతే ప్యేత్వే ప్రాప్నోతి అకృతేపి ప్రాప్నోతి. నిత్యత్వా ధైత్వే కృతే విహత నిమిత్తత్వాత్ ఏత్వం న భవిష్యతి. – వ్యాకరణ మహాభాష్యం (244 పు.) 7 అ – 3 పా – 103 వ సూత్రం పర సూత్రం కనుక దాని చేత మంత్ర + భిస్ అనే చోట త్ర కారంలో అకారానికి... ఏత్వం చేస్తే ఆ ఏకార స్థానంలో పూర్వం ఉన్నది అకారం కనుక అపుడు కూడా భిస్‌కు ఐస్ వస్తుంది. కావున ఐస్ నిత్యం. ఐస్ చేస్తే ఝలాది వర్ణం పరంగా లేదు కనుక ఏత్వం రాదు అని భాష్యకారులు చెప్పారు. మంత్రలోని త్ర కారంలో ఉన్న అకారానికి వచ్చిన ఏ కారం అకారం వంటిది ఎలా అవుతుందని ప్రశ్న. సంస్కృత వ్యాక రణంలో ‘యథోత్తరం మునీనాం ప్రామాణ్యమ్’ అని నియమము. పాణిని ముని సూత్రాలకు భాష్యం లేకపోతే అవి అర్థం కావు. పాణిని ముని సూత్రాలకంటే కాత్యాయన ముని వార్తికాలకు, అంతకంటె పతంజలి ముని భాష్యానికి ప్రామాణ్యం ఎక్కువ. వార్తికాలు, భాష్యం లేకపోతే పాణిని సూత్రాలు మొత్తం సంస్కృత పద సముద్రానికి లక్షణం చెప్పలేవు. పతంజలి ముని ఒక శ్లోకం ఉదాహరించారు. శ్లో. ఏత్వం భిసి పరత్వాచ్చే దత ఐస్క భవిష్యతి కృత ఐత్వే భూత పూర్వా్య ధైస్తు నిత్య స్తథాసతి ఇది కాత్యాయన ముని వార్తికం అయి ఉంటుంది. కాబట్టి ఈ కారిక, పతంజలి ముని వచనం ప్రమాణంగా తీసుకుని ఐస్‌ను విధించే సూత్రం నిత్యమని చెప్పడం సముచితమే. ‘త్రిముని వ్యాకరణమ్’ అని ఆర్యోక్తి. ముగ్గురూ వ్యాకరణ విషయంలో ప్రామాణికులే. పరం కంటే నిత్యం బలమయినది. కనుక ఏత్వం రాకుండా ఐస్ వచ్చిందని భావం. పర సూత్రం కంటె నిత్యం బల మయినదని ‘పూర్వ పర నిత్యాన్తరఙ్గానా ముత్తరోత్తరం బలీయః’ అనే పరిభాష తెలుపుతుంది. కావున పర సూత్రమైన ‘బహువచనే ఝల్యేత్’ అనే సూత్రాన్ని నిత్య సూత్రమైన ‘అతో భిస ఐస్’ బాధించింది. మంత్ర + ఐస్ = మంత్రైః అయ్యింది. ‘అతో భిస ఐస్’ నిత్య సూత్రమెలా అవుతుంది? ఏత్వం ఒక వర్ణానికి చెందిన విధి కదా అని ప్రశ్న. ఒక వర్ణానికి చెందిన విధిలో ఆదేశం స్థానివంటిది కాదని నిషేధం ఉంది. అపుడు ఏకారం అకారం వంటిది కాదు. ఇక్కడ భాష్యం వార్తికం ఎలా సరిపడతాయని ఆక్షేపం వస్తుంది. ‘అచః పరస్మిన్ పూర్వవిధౌ’ అనే సూత్రానికి మహాభాష్యంలో ‘అజాదేశః పరనిమిత్తకః పూర్వస్య విధిం ప్రతి స్థానివద్ భవతి. కుతః పూర్వస్య ఆదేశాద్’ అనే వాక్యాలున్నాయి. మంత్ర + భిస్ అనే చోట ‘బహువచనే ఝల్యేత్’ అనే సూత్రంచే త్రకారంలో ఉన్న అకారానికి ఏత్వం వచ్చి మంత్రే + భిస్ అయ్యింది. ఇప్పుడు ‘అతో భిస ఐస్’ అనే సూత్రం చేత ‘భిస్’నకు ఐత్వం వస్తున్నపుడు ఆదేశం అయిన ఐస్ కంటే పూర్వ మందున్న ఏకారానికి స్థానివద్భావం చేస్తే భిస్ నకు ఐస్ ప్రాప్తించి మంత్రైః అవుతుంది. కాబట్టి పైన పతంజలి ముని, కాత్యాయన ముని పేర్కొన్నట్లు ‘అతో భిస ఐస్’ నిత్య సూత్రం అయ్యింది. పరం కంటె నిత్యం ప్రబలం కనుక మంత్రైః అనే రూపం సిద్ధిస్తోంది. కాబట్టి ఇక్కడ ఎటువంటి తప్పు, సమస్య, గందర గోళం లేవు. రిషి రాజ్ పోపట్ పరిశోధన చేసి ఒక సూత్రానికి కొత్త అర్థం చెప్పి సంస్కృత వ్యాకరణ మార్గంలో ఋషి పుంగవులను, ఋషి తుల్యులను కించ పరిచాడు. తాను విప్రతిషేధే అనే సూత్రానికి కొత్త అర్థం చెప్పడం వల్ల కొన్ని రూపాలు కుదరడం లేదు. ఇది అతడి ప్రసంగం చూసి చేసిన విమర్శ. అతడి సిద్ధాంత గ్రంథాన్ని విమర్శిస్తే అదో పెద్ద గ్రంథమవుతుందేమో! (క్లిక్ చేయండి: జ్ఞాపకాలు విప్పి చెప్పిన కథనాలు) - డాక్టర్ చిఱ్ఱావూరి శివరామ కృష్ణ శర్మ వ్యాసకర్త రీడర్ (విశ్రాంత) ఆంధ్ర జాతీయ కళాశాల, మచిలీపట్టణం -
Spoken English: ఇంగ్లిష్.. ఇలా సులువు!
ఇంగ్లిష్.. ఈ పేరు వినగానే తెలుగు మీడియం విద్యార్థులు హడలిపోతుంటారు. ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నా.. తమకు ఇంగ్లిష్ రాదని బాధ పడుతుంటారు. ఇంగ్లిష్‌లో మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే ఆందోళన చెందుతుంటారు. పొరపాట్లు మాట్లాడితే.. అవతలి వాళ్లు అపార్థం చేసుకుంటారని ఊహించుకొని వెనకడుగు వేస్తుంటారు. ముఖ్యంగా ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు ఇంగ్లిష్‌ను తలచుకొని ముందే భయపడిపోతుంటారు. అయితే ఇంగ్లిష్ భాషను మాట్లాడుతూ తేలిగ్గానే నేర్చుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఇంగ్లిష్‌ను నేర్చుకునేందుకు అనేక మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం... విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలంటే.. మన విద్యార్థులు ఐఈఎల్టీఎస్, టోఫెల్ వంటి ఇంగ్లిష్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్టులు రాయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా కోచింగ్ సైతం తీసుకుంటారు. కానీ ఇది పరీక్ష వరకు ఉపయోగపడినా.. నిత్యం దైనందిన జీవితంలో మనగలగాలంటే.. ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడటంతోపాటు చక్కగా రాయడం రావాలి. ఇంగ్లిష్ సినిమాలు భాష ఏదైనా సులభంగా నేర్చుకునే మార్గాల్లో శ్రద్ధగా వినిడానికి మించిన సాధనం లేదు. ఇంగ్లిష్‌ను ఆసక్తిగా వినగలిగితే.. మాట్లాడటం నల్లేరుపై నడకే! ఇందుకు ఇంగ్లిష్ సినిమాలు సరైన మార్గం. సినిమాలంటే.. ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తినే సాధనంగా చేసుకొని.. ఇంగ్లిష్ చిత్రాలు చూడటం ద్వారా ఇంగ్లిష్‌ను మెరుగుపరచుకోవచ్చు. భాషను సహజంగా అర్థం చేసుకోవడానికి.. ఇంగ్లిష్ వ్యవహారిక, సంభాషణ రూపాలకు అలవాటు పడటానికి.. భాషతో అనుభూతి పొందడానికి ఇంగ్లిష్ సినిమాలు దోహదపడతాయని నిపుణులు పేర్కొంటున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్‌లో యూట్యూబ్ చూడటం పరిపాటిగా మారింది. యూట్యూబ్‌లో ఇంగ్లిష్ స్పీకింగ్/లెర్నింగ్ వీడియోలు చూడటం ద్వారా.. భాషా నైపుణ్యాలు మెరుగుపరచుకోవచ్చు. అలాగే, ఇంగ్లిష్ డాక్యుమెంటరీలు కూడా భాషను నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. న్యూస్ పేపర్లు–టీవీలు ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానాన్ని పొందేందుకు నిత్యం ఇంగ్లిష్ పత్రికలు శ్రద్ధగా చదవడం అలవాటు చేసుకోవాలి. అలాగే ప్రామాణిక ఇంగ్లిష్ న్యూస్ ఛానళ్లు ఏకాగ్రతతో చూడటం, వినడం వంటివి చేయాలి. ఇంగ్లిష్ భాషలో వెలువడే వార్తా పత్రికలు, మ్యాగజైన్స్ మంచి భాషను నేర్చుకునేందుకు ఉపయోగపడతాయి. చేయి తిరిగిన జర్నలిస్టులు పత్రికల్లో రాసే వార్తలు, వ్యాసాల ద్వారా ఎక్కడ ఎలాంటి పదాలు వాడాలో తెలుస్తుంది. అది పరీక్షల్లో సమాధానాలు రాయడంతోపాటు..ఇంటర్వ్యూలో మాట్లాడటంలోనూ ఉపయోగపడతుంది. అంతేకాకుండా ఇంగ్లిష్ వొకాబ్యులరీ మెరుగవుతుంది. ఇంగ్లిష్ పత్రికలు చదవడం, టీవీ ఛానళ్లను చూడటం ద్వారా స్పెల్లింగ్స్, ఉచ్ఛరణ, వాక్య నిర్మాణం వంటివి నేర్చుకోవచ్చు. (నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, ఊపందుకున్న ఉద్యోగ నియామకాలు) వొకాబ్యులరీని ఒడిసిపట్టండిలా భాషను చక్కగా, అద్భుతంగా మాట్లాడాలంటే.. ముందు పదజాలం(వొకాబ్యులరీ)పై పట్టు సాధించాలి. అందుకు ఇంగ్లిష్ పత్రికల్లోని పదాలను అర్థాలతో సహా ఒక నోట్స్‌లో రాసుకోవాలి. దీంతోపాటు ప్రతి రోజూ ఉపయోగించే పదాలు, పదబంధాల జాబితాను తయారు చేయడం ప్రారంభించాలి. కొత్త పదం ఎప్పుడు ఎదురైనా.. దానిని ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారో గమనించాలి. ఆయా పదానికి సంబంధించిన పర్యాయపదాలు, వ్యతిరేకార్థాలు, పద బంధాలను సైతం తెలుసుకోవాలి. ఏ సందర్భంలో ఏ పదాన్ని ఎలా వాడాలో రాసుకోవాలి. ఇంగ్లిష్‌లో సంభాషణ వినడం,చదవడంతోపాటు తరచూ మాట్లాడం ద్వారా ఇంగ్లిష్‌ను త్వరగా నేర్చుకోవచ్చు. ప్రతి సందర్భంలోనూ ఇంగ్లిష్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించాలి. సొంతంగా మాట్లాడే నైపుణ్యాలను పెంచుకోవాలి. అందుకోసం ఇంగ్లిష్ నేర్చుకోవాలనే తపన ఉన్న వారితోగాని, ఇంగ్లిష్ అప్పటికే బాగా వచ్చిన వారితోగాని స్నేహం చేయాలి. ఈ రెండూ కుదరకపోతే అద్దం ముందు నిల్చొని.. సొంతంగా మాట్లాడం ప్రాక్టీస్ చేయాలి. లేదా ఏదైనా ఒక టాపిక్‌పై ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ.. దాన్ని రికార్డ్ చేసుకొని వినాలి. దీనిద్వారా భాషపై పట్టు సాధించడంతోపాటు లోటుపాట్లను సరిచేసుకోవచ్చు. ప్రాక్టీస్.. ప్రాక్టీస్ ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానం పెంచుకునేందుకు నిరంతరం ప్రాక్టీస్ చేయాలి. రోజుకు ఒక పదంతో మొదలుపెట్టి.. పదుల సంఖ్యలో పదాలు, అర్థాలు, పదబంధాలు నేర్చుకునే స్థాయికి వెళ్లాలి. కేవలం పదాలను, పదబంధాలను చదివి గుర్తు పెట్టుకుంటే ఉపయోగం ఉండదు. ఆయా పదాలు ఏయే సందర్భాల్లో వినియోగించాలో కూడా తెలుసుకోవాలి. సాధ్యమైనంత తరచుగా ఆయా పదాలను వాడటానికి ప్రయత్నించాలి. సందర్భాలను కల్పించుకొని..అందు కు తగ్గట్టుగా ఇంగ్లిష్‌లో మాట్లాడాలి. ఇది నిత్యం దీర్ఘకాలం పాటు కొనసాగాలి. దీనివల్ల ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడే నైపుణ్యం సొంతమవుతుంది. సరదా.. సరదాగా.. ఇంగ్లిష్‌ను నేర్చుకునేటప్పుడు తొలుత కొంత శ్రమతో కూడుకున్నదిగా, భారంగా అనిపించొచ్చు. దానివల్ల త్వరగా ఆసక్తి కోల్పోయే ఆస్కారముంది. కాబట్టి మిమ్మల్ని మీరు నిరంతరం ప్రేరణనిచ్చుకుంటూ ముందుకు సాగాలి. కొత్త భాషను నేర్చుకోవడాన్ని ఆస్వాదించాలి. మీ ఆలోచనలను గౌరవించే స్నేహితులతో ‘వర్డ్ గేమ్స్’ ఆడటం, ఇంగ్లిష్ పజిల్స్ పూర్తిచేయడం వంటివి చేయాలి. దానివల్ల ఇంగ్లిష్ సరదాగా నేర్చుకున్నట్లు అవుతుంది. భాషను నేర్చుకునే క్రమంలో.. ఇంగ్లిష్‌లో ఆలోచించడం, ఇంగ్లిష్‌లో సంభాషించడం మేలు చేస్తుంది. గ్రామర్ అధ్యయనం కొత్త భాష కావడం వల్ల తొలుత అదో బ్రహ్మ పదార్థంగా కనిపిస్తుంది. ఇంగ్లిష్ గ్రామర్ చదవడం చాలామందికి విసుగు పుట్టిస్తుంది. గ్రామర్‌ను స్కూల్ స్థాయిలో చదివే ఉంటాం. కాబట్టి మరోసారి గ్రామర్ రూల్స్ అధ్యయనం చేస్తే.. పొరపాట్లు లేకుండా ఇంగ్లిష్‌లో రాయడం, మాట్లాడటం అలవడుతుంది. విషయాన్ని చక్కగా కమ్యూనికేట్ చేయాలంటే.. భాష తీరుపై సంపూర్ణ అవగాహన అవసరం. అందుకు గ్రామర్ ఉపయోగపడుతుంది. టోఫెల్ వంటి పరీక్షల్లోనూ, ఉన్నత స్థాయి ఉద్యోగ ఇంటర్వ్యూల్లోనూ.. గ్రామర్ తప్పులు లేకుండా రాయడం, మాట్లాడటం తప్పనిసరి. అందుకు వ్యాకరణ నియమాలు దోహదం చేస్తాయి. వీలైనంతగా మాట్లాడాలి చాలామంది ఎదుటివారు ఏమనుకుంటారోనని భయపడి.. ఇంగ్లిష్‌లో మాట్లాడేందుకు జంకుతుంటారు. తమను తాము కంఫర్ట్ జోన్లో ఉంచేసుకుంటారు. నిజానికి మాట్లాడటం ద్వారానే ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. కాబట్టి ఎంత ఎక్కువగా ఇంగ్లిష్‌లో మాట్లాడితే అంత బాగా మన మనసు, మెదడు ఇంగ్లిష్ పదాలకు అలవాటు పడతాయి. ఇంగ్లిష్ భాషను నేర్చుకోవడం అనేది దీర్ఘకాలిక ప్రక్రియగా భావించాలి. కేవలం వారం, నెల రోజుల్లోనే నేర్చేసుకుందామనుకుంటే.. అది సాధ్యమయ్యే పనికాదని గుర్తించాలి. ఇంగ్లిష్‌లో పట్టు సాధించాలంటే.. భాషకు అంకితం అవ్వాలి. అప్పుడు మాత్రమే అనుకున్న ఫలితాలను సాధించగలం!! -
బుడ్డోడు.. ఓ బడి
చిన్న పిల్లలు బడికి పొమ్మంటేనే తెగ మారాం చేస్తారు. కానీ ఈ ఫొటోలోని 12 ఏళ్ల అబ్బాయికి మాత్రం చదువు అంటే మహా ప్రాణం. తాను చదువుకోవడమే కాదు.. చదువుకు దూరం అవుతున్న పిల్లలు కూడా చదువుకోవాలని ఎప్పుడూ అనుకుంటుండేవాడు. దీనికోసం ఏకంగా ఓ స్కూల్‌నే స్థాపించాడు.. ఈ అబ్బాయి పేరు లియోనార్డో నికనార్. అర్జెంటీనా దేశంలోని పీడ్రిటాస్ అనే చిన్న నగరానికి చెందినవాడు. చదువును పట్టించుకోకుండా ఎక్కువ సమయం ఆటలాడుతూ కాలక్షేపం చేసేవారి కోసం బడిని ప్రారంభించాడు. గతేడాది ఈ విషయాన్ని తన బామ్మకు చెప్పగా ఆమె.. స్కూల్ప్రారంభించేందుకు సాయం చేసింది. ఇప్పటివరకు ఈ స్కూల్లో దాదాపు 40 మంది పిల్లలు చేరారు. లియోనార్డో ఈ స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పడమే కాదు.. ప్రిన్సిపాల్‌గా కూడా బాధ్యతలు చూసుకుంటున్నాడు. పాఠాలు నేర్చుకునేందుకు చిన్న పిల్లలతో పాటు చదువు రాని పెద్దలు కూడా హాజరవుతున్నారు. వారందరికీ ఎంతో ఓపికగా పాఠాలు చెబుతూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఉదయం మొత్తం తాను స్కూల్లో చదువుకుని సాయంత్రం పూట సైకిల్‌పై వచ్చి మరీ పిల్లలకు పాఠాలు చెబుతాడట. ఎంత వాన పడ్డా.. మంచు కురిసినా లెక్క చేయకుండా కచ్చితంగా తన సొంత స్కూల్‌కు వెళతాడట. సాధారణ వేళల్లో పిల్లలు స్కూల్‌కు హాజరు కాకపోతే రాత్రి వేళల్లో ప్రత్యేకంగా క్లాసులు తీసుకుంటాడట. గ్రామర్, గణితం సబ్జెక్టులను పిల్లలకు బోధిస్తాడట మనోడు. -
గ్లామర్ పోస్తే గ్రామర్ రాదు!
ఇంటర్వ్యూ ‘జన్నత్’ సినిమాతో బాలీవుడ్లో, ‘రెయిన్బో’ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది సోనాల్ చౌహాన్. వచ్చిన అవకాశాన్నల్లా అంది పుచ్చుకుంటూ సాగిపోతోంది. కదిపితే బోలెడు కబుర్లు చెబుతుంది. ఏం ఇష్టపడుతుందో, ఎలాంటి వాడిని ప్రేమిస్తుందో, ఎవరంటే పడి చస్తుందో కూడా మొహమాటం లేకుండా చెబుతుంది. స్టార్ అవ్వాలంటే టాలెంట్ ఉండాలి, గ్లామర్ ఉన్నంత మాత్రాన నటనలో గ్రామర్ రాదు అంటూ ఆమె చెబుతోన్న సంగతులు చదవండి! * కెరీర్ ఎలా మొదలైంది? అనుకోకుండా జరిగిన ఓ చిన్న సంఘటన నన్ను ఇంత దూరం నడిపించింది. పదిహేడేళ్ల వయసులో ఓ కాఫీ షాపుకి వెళ్లాను. అక్కడ ఉన్న ఓ ఫొటోగ్రాఫర్ నన్ను ఫొటో తీసి ఓ పేపర్లో వేశాడు. దానికి చాలా రెస్పాన్స వచ్చింది. దాంతో మలేసియాలో జరిగిన మిస్ వరల్డ్ టూరిజం పోటీల్లో పాల్గొన్నాను. టైటిల్ గెలుచుకున్నాను. ఆ పోటీలో గెలిచిన మొదటి భారతీయురాలిని నేనే. ఆ తర్వాత మోడలింగ్ అవకాశాలు వచ్చాయి. పాండ్స్, నోకియా, లేస్, పెప్సీ, హీరో హోండా లాంటి ఫేమస్ కంపెనీల యాడ్స్ చేశాను. మెల్లగా సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. * టాలీవుడ్‌కి ఎలా వచ్చారు? బాలీవుడ్లో ‘జన్నత్’ సినిమా చేశాక దర్శకుడు వీఎన్ ఆదిత్య ఫోన్ చేసి ‘రెయిన్బో’ చిత్రంలో ఆఫర్ ఇచ్చారు. తర్వాత లెజెండ్, పండగ చేస్కో, షేర్, సైజ్ జీరో చిత్రాలు చేశాను. * ‘రెయిన్బో’కి ‘లెజెండ్’కి మధ్య అంత గ్యాప్ ఎందుకు? ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగు తుంది. ఏ అవకాశం ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. అది వచ్చేవరకూ ఎదురు చూడాలి, చూశాను. కాబట్టి ఆ గ్యాప్ గురించి పనిగట్టుకుని చర్చించడానికి ఏమీ లేదు. * నటిగా ఫాలో అయ్యే ఫార్ములా? ఎప్పుడు ఏ సినిమా చేసినా, అదే నాకు ఫస్ట్ సినిమా అని అనుకుం టాను. మొదటిసారి కెమెరా ముందు నిల బడినట్టు ఫీలవుతాను. దాంతో నాకు నేనే ఒకలాంటి ఫ్రెష్‌నెస్ ఫీలవుతాను. బాగా చేయాలి అన్న పట్టుదల కూడా కలుగుతుంది. * డ్రీమ్‌రోల్ ఏదైనా ఉందా? ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ మళ్లీ తీస్తే, కాజోల్ పాత్ర నన్నే వరించాలని కోరుకుంటా. అంత ఇష్టం నాకా రోల్! * మీ డ్రీమ్ హీరో? షారుఖ్. ఆయనంటే పిచ్చి. సినిమాల్లో ఆయన ఏడిస్తే నేనూ ఏడ్చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయనతో నటించే చాన్స్గానీ వచ్చిందంటే నా జీవితం ధన్యమైనట్టే. * మరి రియల్ లైఫ్ హీరో? ఆ విషయంలో కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడప్పుడే ఎవరినీ నా జీవితంలోకి ఆహ్వానించే ఉద్దేశం నాకు లేదు. * పోనీ ఎలాంటివాడు వస్తే ఓకే చెప్తారు? మాట మర్యాదగా ఉండాలి. ఆడదాన్ని గౌరవించే సంస్కారం ఉండాలి. ఫుడ్ లవర్ అయివుండాలి. నాలాగా ఫాస్ట్ ఫుడ్ నుంచి స్ట్రీట్ ఫుడ్ వరకూ ఏదైనా లాగించేయాలి. * గ్లామర్ రోల్స్ చేయడం ఇష్టమేనా? ప్రతి పాత్రలోనూ గ్లామర్ ఉంటుంది. అంతే తప్ప గ్లామర్ కోసమే పాత్రలుండవు. టాలెంటే ఎవరినైనా స్టార్‌ని చేస్తుంది. గ్లామర్ నటనలో గ్రామర్ నేర్పదు. కాబట్టి అందాలు ఒలకబోసినంత మాత్రాన స్టార్డమ్ వచ్చేయదు. వస్తుందనుకుంటే అంతకంటే పిచ్చితనం మరొకటి ఉండదు. * మీ ఇష్టాయిష్టాల గురించి చెప్పండి? పెద్ద పెద్ద కోరికలు, ఇష్టాలూ ఉండవు నాకు. అన్ని రంగుల్నీ ఇష్టపడతాను. సింపుల్‌గా జీన్స్, టీషర్టులు వేసుకుంటాను. నచ్చింది తింటాను. నచ్చినట్టు ఉంటాను. పెద్ద పెద్ద ప్రణాళికలు వేసేసుకోవడం, వాటి గురించి టెన్షన్ పడిపోవడం నాకు నచ్చదు. అందుకే ఓ పద్ధతి ప్రకారం పని చేసుకుంటూ పోతాను. వీలైనంత కూల్‌గా ఉంటాను. * మీ లైఫ్ ఫిలాసఫీ? జీవితం చాలా అందమైనది. కాకపోతే దాన్ని జీవించడం రావాలి. మనం నవ్వాలి. ఎదుటివారిని నవ్వించాలి. మంచి చేయక పోయినా ఫర్లేదు కానీ, ఎవరికీ చెడు మాత్రం చేయకూడదు. * ఫ్యూచర్ ప్లాన్స్? ఇప్పుడిప్పుడే కెరీర్ వేగాన్ని పుంజు కుంటోంది. మంచి మంచి పాత్రలు వస్తున్నాయి. కాబట్టి కొన్నేళ్ల వరకూ నటన గురించి మాత్రమే ఆలోచిస్తాను. అయితే నాకు రాజకీయాలంటే చాలా ఇష్టం. యువత రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి నేను ఏదో ఒకరోజు పాలిటిక్స్‌లోకి వెళ్లి తీరతా! -
గరుడ పురాణంలో ఏముంటుంది?
గరుడ పురాణాన్ని వేదవ్యాసుడు రచించాడు. విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతునికి ఒకసారి మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు? ఆ జీవుడికి ఏయే గతులు కలుగుతాయి... తదితర సందేహాలు కలిగాయట. వాటన్నింటికీ విష్ణువే సమాధానాలు చెప్పి, గరుడుని సందేహ నివృత్తి చేశాడట. గరుడుని కోసం చెప్పింది కాబట్టి దీనికి గరుడ పురాణం అని పేరొచ్చింది. దీనిలో ప్రధానంగా రెండు భాగాలుంటాయి. ఒకటి... పూర్వఖండం, రెండు... ఉత్తర ఖండం. పూర్వఖండంలో బ్రహ్మాదుల ఆవిర్భావం, రాజుల కథలు, వ్యాకరణం, ఛందస్సు, యుగధర్మాలు, విష్ణువు దశావతారాలు వంటివి ఉన్నాయి. ఉత్తర ఖండంలోని ప్రథమాధ్యాయంలో ప్రేతకల్పం అనే భాగం ఉంది. అందులో మరణానంతరం జీవుడు ఏం చేస్తాడు... వంటి విషయాలుంటాయి. ఇంటిలో ఎవరైనా గతించినప్పుడు పఠించేది ఈ అధ్యాయాన్నే! ద్వితీయాధ్యాయాన్ని ఎవరైనా, ఎప్పుడైనా చదువుకోవచ్చు. ప్రతిమనిషికి భయం ఉండాలి. అది దైవభీతి కావచ్చు, పాపభీతి కావచ్చు... ఏదైనా. ఆ భయం లేకుంటే మనిషికి, మృగానికి భేదం లేకుండా పోతుంది. అందుకే ఋషులు ఎంతో ముందుచూపుతో పురాణాలను రచించి మానవజాతికి అందించారు. ఈ పురాణాలన్నింటిలోనూ అది చేస్తే పాపం, ఇది చేస్తే పాపం అని భయపెడుతున్నట్లే ఉంటుంది. దాంతో వాటిని పక్కన పడేస్తాం. వాస్తవానికి మనిషిని సద్వర్తనలోకి నడిపించాలంటే భయం కూడా అవసరమే. అందుకే మన పెద్దలు అంతగా భయపెట్టారు. గరుడ పురాణంలో అన్నీ ఇలాంటి విషయాలే ఉంటాయి. మనిషి మనిషిగా బతకాలంటే గరుడ పురాణం చదవాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. ఇవిచేయకూడదా..? కొన్ని విషయాలను పాపాలని గరుడపురాణం చెబుతోంది. అవి... బ్రహ్మహత్య, శిశుహత్య, గో హత్య, స్త్రీ హత్యలతోబాటు గర్భపాతం చేసేవారు, రహస్యంగా పాపపు పని చేసేవారు, గురువులు, పండితులు, దేవతలు, స్త్రీ, శిశు ధనం హరించేవారు కూడా నరకంలో శిక్షలను అనుభవించక తప్పదంటుంది. అలాగే అప్పు తీర్చనివారు, పర ద్రవ్యాన్ని అపహరించేవారు, విశ్వాస ఘాతకులు, ఇతరులను హత్యచేసే వారు, దోషులను పొగిడేవారు, మంచివారిని నిందించేవారు, ఋణగ్రస్థులను ఎగతాళి చేసేవారు, సత్పురుషులతో స్నేహం చేయనివారు కూడా పాపులేనట. పుణ్యతీర్థాలను, సజ్జనులను, సత్కర్ములను, గురువులను, దేవతలను నిందించేవారు యమలోకంలో దక్షిణపు మార్గాన నడవాల్సి ఉంటుందట. పురాణాలను, వేదాలను, మీమాంస, న్యాయశాస్త్రాలను, వేదాంత శాస్త్రాలను దూషించేవారు, ఇతరులు సంతోషంగా ఉంటే దుఃఖించేవారు, ఎదుటివారు దుఃఖిస్తుంటే ఆనందించేవారు, చెడుమాటలు పలికేవారు కూడా దుర్గతుల పాలు కాక తప్పదు. పెద్దల హితోపదేశాన్ని వినని వారు, ఆత్మస్తుతి, పరనింద చేసేవారు, అధర్మ మార్గంలో నడిచేవారు ఒకరకానికి చెందిన వారైతే ఇంకా నీచమైన పనులు చేసేవారు మరికొందరున్నారు. అంటే... తల్లిదండ్రులను, గురువును, ఆచార్యులను అవమానించేవారు, భార్యను అకారణంగా ద్వేషించి విడిచిపెట్టేవారు, ఏదైనా ఇస్తానని మాట తప్పినవారు, ఇచ్చినదానిని తిరిగి తీసుకునేవారు, దానం ఇచ్చి, బాధపడేవారు వైతరణిని దాటక తప్పదు. దానం చేసేవారిని ఇవ్వవద్దని ఆపేవారు, యజ్ఞవిధ్వంసకులు, హరికథకులకు విఘ్నం కలిగించేవారు, పరుల భూముల సరిహద్దులను చెరిపి భూమిని ఆక్రమించేవారు, పశువులకి మేత లేకుండా చేసేవారు, పశుహత్య చేసేవారు... యమలోకంలో దక్షిణమార్గాన ఉన్న వైతరణిలో కూలబడవలసిందేనట. యమధర్మరాజు ఆజ్ఞను పాటించి యమభటులు పాపాత్ములను వైతరణిలో తోసి వేస్తారట. అబద్ధపు సాక్ష్యం చెప్పేవారు, వంచన చేసి ధనం సంపాదించేవారు, దొంగతనం చేసేవారు, పచ్చని చెట్టను నరికేవారు, ఫలవృక్షాలను పూలతోటలను ధ్వంసం చేసేవారు, తీర్థయాత్రలను చేసేవారికి ఆటంకం కలిగించేవారు, వితంతువులను మోసం చేసి మానహరణ చేసేవారు వైతరణిలో దుఃఖాన్ని అనుభవించి ఒడ్డున ఉన్న బూరుగచెట్టుకు కట్టబడి యమభటుల చేతి దెబ్బలు తింటూ ఉంటారని గరుడపురాణం చెప్తుంది. అంటే గరుడపురాణం మనిషిని సన్మార్గంలో నడిపించడానికి మన పెద్దలు రాసిన ఒక మహత్తరమైన గ్రంథం. దీనిని చదవడం వల్ల మనిషి తన జీవితాన్ని మంచిమార్గంలోకి మలచుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే... బలహీన మనస్కులు దీనిని చదవడం వల్ల చలించి పోతారని, అందువల్ల ఎప్పుడైనా మృతి సంభవించిన సమయంలో మాత్రమే గరుడపురాణాన్ని చదవాలని పెద్దలు చెప్పారు. కానీ, గరుడపురాణం ఇంటిలో ఉండటం కూడా మంచిది కాదని జరిగే ప్రచారాలలో ఏమాత్రం యథార్థం లేదని పండితులు చెబుతున్నారు. - డి.వి.ఆర్. భాస్కర్ -
గ్రామర్ చెకింగ్ కోసం...
ఇంగ్లిష్ రాయడంలో ఎన్నో అక్షరదోషాలు, వ్యాకరణ సంబంధమైన తప్పులు దొర్లుతూంటాయి. ఈ తప్పులేవీ లేకుండా చూసుకోవాలనుకుంటే జింజర్ పేజ్ అండ్ గ్రామర్ కీబోర్డు అప్లికేషన్‌ను స్మార్ట్‌ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. కేవలం వ్యాకరణం, అక్షరదోషాలు మాత్రమే కాకుండా ఈ అప్లికేషన్ సమానార్థకాలు, కొన్ని పదాలకు సంబంధించిన నిర్వచనాలు కూడా అందిస్తుంది. టెక్ట్స్‌ను మాటల్లో వినిపించేందుకూ పనికొస్తుంది. వాక్యాలను ఎలా అర్థవంతంగా తిరగరాయాలో కూడా సూచిస్తుంది. కామా, సెమీకోలన్ వంటి గుర్తులను ఎక్కడ ఉంచాలో కూడా పొందుపరిచారు. ఇంగ్లీషు భాషలోని సమాచారాన్ని దాదాపు 40 భాషల్లోకి తర్జుమా చేసేందుకు కూడా ఇందులో ఏర్పాట్లు ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం... ఈమెయిల్, నోట్ వంటివాటిని చక్కటి ఇంగ్లీషులో పంపేందుకు, సోషల్‌మీడియాలో పంచుకునేందుకు ఈ అప్లికేషన్‌ను ఉపయోగించడం మొదలుపెట్టండి మరి...! మెయిళ్లన్నీ ఒక్కదాంట్లో... మనలో చాలామందికి ఒకటికంటే ఎక్కువ ఈమెయిళ్లు ఉండటం సహజం. ప్రతిదాన్ని వేర్వేరుగా ఓపెన్ చేసుకుని మెయిళ్లు చదవడం బోర్ కొట్టిస్తూంటే స్మార్ట్‌ఫోన్‌లో మెయిల్వైజ్ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకోండి. అన్నింటిని ఒకదగ్గరే చూసుకోవచ్చు. మెయిళ్లు పంపుకోవచ్చు కూడా. అంతేకాకుండా ఫార్వర్డ్ చేసిన మెయిళ్లలోని అనవసరమైన క్యారెక్టర్లన్నింటినీ తొలగించి క్లీన్‌గా ఒక సంభాషణ క్రమంలో అమర్చడం కూడా ఈ అప్లికేషన్ ప్రత్యేకత. ఇది పూర్తిగా క్లయింట్ సైడ్ అప్లికేషన్ కావడం వల్ల సమాచారం ఎక్కడో సెర్వర్లలో కాకుండా మీ ఫోన్లోనే స్టోర్ అవుతుంది. ఫలితంగా మన సమాచారం లీక్ అవుతుందని లేదా దుర్వినియోగం అవుతుందన్న బెంగ ఉండదు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాక్టివేట్ చేసుకోవడమూ సులువే. కాకపోతే యాక్టివేట్ చేసిన తొలి 24 గంటల్లో కొంచెం నెమ్మదిగా పనిచేస్తుందని, ఆ తరువాత వేగం పుంజుకుంటుందని డెవలపర్స్ అంటున్నారు.