ఇంగ్లిష్ రాయడంలో ఎన్నో అక్షరదోషాలు, వ్యాకరణ సంబంధమైన తప్పులు దొర్లుతూంటాయి. ఈ తప్పులేవీ లేకుండా చూసుకోవాలనుకుంటే జింజర్ పేజ్ అండ్ గ్రామర్ కీబోర్డు అప్లికేషన్‌ను స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది. కేవలం వ్యాకరణం, అక్షరదోషాలు మాత్రమే కాకుండా ఈ అప్లికేషన్ సమానార్థకాలు, కొన్ని పదాలకు సంబంధించిన నిర్వచనాలు కూడా అందిస్తుంది. టెక్ట్స్‌ను మాటల్లో వినిపించేందుకూ పనికొస్తుంది. వాక్యాలను ఎలా అర్థవంతంగా తిరగరాయాలో కూడా సూచిస్తుంది. కామా, సెమీకోలన్ వంటి గుర్తులను ఎక్కడ ఉంచాలో కూడా పొందుపరిచారు. ఇంగ్లీషు భాషలోని సమాచారాన్ని దాదాపు 40 భాషల్లోకి తర్జుమా చేసేందుకు కూడా ఇందులో ఏర్పాట్లు ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం... ఈమెయిల్, నోట్ వంటివాటిని చక్కటి ఇంగ్లీషులో పంపేందుకు, సోషల్‌మీడియాలో పంచుకునేందుకు ఈ అప్లికేషన్‌ను ఉపయోగించడం మొదలుపెట్టండి మరి...!
మెయిళ్లన్నీ ఒక్కదాంట్లో...
మనలో చాలామందికి ఒకటికంటే ఎక్కువ ఈమెయిళ్లు ఉండటం సహజం. ప్రతిదాన్ని వేర్వేరుగా ఓపెన్ చేసుకుని మెయిళ్లు చదవడం బోర్ కొట్టిస్తూంటే స్మార్ట్‌ఫోన్‌లో మెయిల్‌వైజ్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. అన్నింటిని ఒకదగ్గరే చూసుకోవచ్చు. మెయిళ్లు పంపుకోవచ్చు కూడా. అంతేకాకుండా ఫార్వర్డ్ చేసిన మెయిళ్లలోని అనవసరమైన క్యారెక్టర్లన్నింటినీ తొలగించి క్లీన్‌గా ఒక సంభాషణ క్రమంలో అమర్చడం కూడా ఈ అప్లికేషన్ ప్రత్యేకత. ఇది పూర్తిగా క్లయింట్ సైడ్ అప్లికేషన్ కావడం వల్ల సమాచారం ఎక్కడో సెర్వర్లలో కాకుండా మీ ఫోన్‌లోనే స్టోర్ అవుతుంది. ఫలితంగా మన సమాచారం లీక్ అవుతుందని లేదా దుర్వినియోగం అవుతుందన్న బెంగ ఉండదు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీన్ని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాక్టివేట్ చేసుకోవడమూ సులువే. కాకపోతే యాక్టివేట్ చేసిన తొలి 24 గంటల్లో కొంచెం నెమ్మదిగా పనిచేస్తుందని, ఆ తరువాత వేగం పుంజుకుంటుందని డెవలపర్స్ అంటున్నారు.
గ్రామర్ చెకింగ్ కోసం...
Published Wed, Jul 23 2014 11:53 PM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM
Advertisement