-
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్. మీరు కనుక ఎస్బీఐ ఖాతాదారులు అయితే వెంటనే మీ కెవైసీ వివరాలను అప్డేట్ చేసుకోండి. లేకపోతే మీ ఖాతా తాత్కాలికంగా నిలిచిపోయే అవకాశం ఉంది. 2021 మే 31 లోగా వినియోగదారులు అందరూ కేవైసీ వివరాలను వెంటనే అప్డేట్ చేయాలని కోరుతూ ట్విట్టర్, ఇమెయిల్ ద్వారా కస్టమర్లకు సమాచారం ఇచ్చింది. కాబట్టి ఎస్బీఐ ఖాతాదారులు అందరూ తప్పనిసరిగా 2021 మే 31 లోగా తమ కేవైసీని అప్డేట్ చేసుకోవాల్సిందే. కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో కస్టమర్లు పోస్ట్ లేదా ఈ-మెయిల్ ద్వారా తమ కేవైసీ వివరాలను బ్యాంకుకు పంపవచ్చు అని తెలిపింది. ఖాతాదారులు సంబంధిత పత్రాలను బ్యాంకుకు పంపితే సరిపోతుంది. అయితే కస్టమర్లు తమ రిజిస్టర్డ్ ఈ-మెయిల్ అడ్రస్ నుంచే కేవైసీ డాక్యుమెంట్స్ పంపాల్సి ఉంటుంది. ఖాతాదారులు ప్రభుత్వం చేత గుర్తింపబడిన పాస్ పోర్ట్ ఐడీ, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, NREGA కార్డ్, పాన్ కార్డ్ వంటి వాటిలో ఏదైనా ఈ మెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది. అయితే కొందరు మోసాగాళ్లు కెవైసీ పేరుతో మోసానికి పాల్పడుతున్నట్లు ఎస్బీఐ గుర్తించింది. వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఎవరైనా కెవైసీ అప్డేట్ చేయకపోతే 24 ఖాతా బ్లాక్ అనే సందేశం వస్తే ఆ లింకుపై క్లిక్ చేయవద్దు అని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఎస్బీఐ అధికారిక పోర్టల్ ను సందర్శించాలని కోరింది. Important announcement for our customers in view of the lockdowns in place in various states. #KYCUpdation #KYC #StayStrongIndia #SBIAapkeSaath #StaySafe #StayStrong pic.twitter.com/oOGxPcZjeF — State Bank of India (@TheOfficialSBI) May 1, 2021 చదవండి: 5జీ ట్రయల్స్ కోసం స్పెక్ట్రమ్ కేటాయింపు -
గణపతి, వరవరరావుల మధ్య ఈమెయిల్స్!
పుణె: మావోయిస్టులతో సంబంధం ఉందనే ఆరోపణలపై జూన్‌లో అరెస్టైన ఐదుగురు హక్కుల కార్యకర్తల బెయిల్ పిటిషన్లను మహారాష్ట్ర ప్రభుత్వం కోర్టులో వ్యతిరేకించింది. విరసం నేత వరవరరావు, పరారీలో ఉన్న సీపీఐ (మావోయిస్టు) నేత గణపతిల మధ్య జరిగిన ఈ–మెయిల్ సంభాషణలను మహారాష్ట్ర తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. హక్కుల కార్యకర్తలు సురేంద్ర గాడ్లింగ్, సోమసేన్, వెర్నన్ గోన్సాల్వేజ్, అరుణ్ ఫెరీరా, సుధా భరద్వాజ్‌లు జూన్‌లో అరెస్టయ్యారు. ఆ తర్వాతనే ఈ ఈ–మెయిల్ సంభాషణలు జరిగాయని ప్రభుత్వ తరపు న్యాయవాది ఉజ్వలా పవార్ కోర్టుకు తెలిపారు. ఈ–మెయిల్స్‌ను గణపతి వరవరరావుకు పంపారనీ, హక్కుల కార్యకర్తలు అరెస్టైన అంశంపై సీపీఐ (మావోయిస్టు) సెంట్రల్ కమిటీ ఆందోళన చెందినట్లు ఈ–మెయిల్ ద్వారా తెలుస్తోందని పవార్ పేర్కొన్నారు. -
బతకాలని లేదు: సునంద
న్యూఢిల్లీ: ‘నాకు బతకాలనే కోరిక లేదు. చావు కోసం ప్రార్థిస్తున్నా’... చనిపోవడానికి సరిగ్గా 9 రోజుల ముందు సునంద పుష్కర్, తన భర్త, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌కు పంపిన ఈ–మెయిల్లోని మాటలివి. 2014 జనవరి 17న దక్షిణ ఢిల్లీలోని ఓ విలాసవంతమైన హోటల్ గదిలో సునంద అనుమానాస్పద రీతిలో శవమై కనిపించడం తెలిసిందే. భర్తకు ఆమె పంపిన ఈ–మెయిల్లోని అంశాలను పోలీసులు సోమవారం స్థానిక కోర్టుకు సమర్పించారు. విషపు మాత్రలు శరీరంలోకి వెళ్లడం వల్లే సునంద చనిపోయారనీ, అంతకుముందే ఆమెకు కొన్ని గాయాలు కూడా అయినట్లు పోస్టుమార్టమ్ నివేదికలోనే తేలిందని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఆమె శశి థరూర్‌కు పంపిన మెయిల్, సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులనే మరణ వాంగ్మూలాలుగా పరిగణించాలని కోరారు. ‘ఒకవేళ సునంద ఆత్మహత్య చేసుకుందని భావిస్తే అంతకుముందు ఆమె ఎన్నో వేధింపులకు గురై బాధను భరించి ఉంటుంది. ఈ అంశాన్ని పరిగణనలోనికి తీసుకుని ఆత్మహత్యకు ప్రేరేపించిన అంశంపై థరూర్‌ని నిందితుడిగా చేర్చాలి’ అని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టును కోరారు. సునందను థరూర్ శారీరక, మానసిక హింసకు గురి చేశారనీ, ఆమె ఆత్మహత్య చేసుకుందనీ భావించినా అందుకు కారణం ఆయనేనని ఈ నెల 14న కూడా పోలీసులు కోర్టుకు విన్నవించడం తెలిసిందే. కాగా, థరూర్‌ను నిందితుడిగా చేర్చేందుకు ఆయనకు నోటీసులు పంపాలా వద్దా అనే నిర్ణయాన్ని కోర్టు జూన్ 5కు వాయిదా వేసింది. -
‘భవిష్య’ చందాదారులకు మరింత వెసులుబాటు
న్యూఢిల్లీ: సంస్థలు తమ వాటాను భవిష్య నిధికి నిర్దిష్ట గడువులోగా జమ చేయకుంటే ఆ సమాచారం ఇకపై సదరు ఉద్యోగికి తెలుస్తుంది. ప్రస్తుతానికైతే కేవలం జమ చేసిన వివరాలనే ఎస్ఎంఎస్, ఈ–మెయిల్ ద్వారా భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) ఉద్యోగులకు పంపుతోంది. ‘ఇప్పటి వరకు సంస్థలు తమ వాటాను చెల్లించకుంటే ఆ సమాచారం ఆ ఉద్యోగులకు తెలిసేది కాదు. ఎవరి తరఫున వారి సంస్థ కంట్రిబ్యూషన్‌ను చెల్లించలేదో ఇకపై ఆ వివరాలు సదరు ఉద్యోగికి ఈ–మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా పంపుతాము’ అని ఈపీఎఫ్‌వో బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ–మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్‌ను తమ సార్వత్రిక ఖాతా సంఖ్య(యూఎఎన్)తో అనుసంధానం చేసుకున్న వారికి ఈ వెసులుబాటు ఉంటుందని పేర్కొంది. -
అపర కుబేరుడు...అయినా ఐఫోన్ వాడరు!
-
అపర కుబేరుడు...అయినా ఐఫోన్ వాడరు!
స్మార్ట్ ఫోన్ కూడా లేదు... ఈ-మెయిల్‌కూ దూరం!! కొత్తొక వింత పాతొక రోత అనేది సామెత! ముఖ్యంగా నేటి మార్కెట్ ట్రెండ్ ఇదే సూత్రం ఆధారంగా సాగుతోంది. కొత్తగా ఏది వచ్చినా అది ముందు మన చేతుల్లో ఉండాలనే తహతహ ప్రపంచమంతటా కనిపిస్తుంది. మొబైల్ ఫోన్ల విషయంలో ఇది మరీ ఎక్కువ. స్మార్ట్ ఫోన్లలో ఆర్నెల్లకే కొంగ్రొత్త మోడళ్లు. అప్డేటెడ్ వెర్షన్లు ముంచెత్తుతుంటాయి. ఆ ప్రకారం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండటం నేటి ఫ్యాషన్. ఇక ఐఫోన్ మీద క్రేజ్ గురించి వేరే చెప్పనవసరం లేదు. కొత్త వెర్షన్ కోసం నెలల తరబడి వేచివుంటూ.. ఏడాది కిందటే కొన్న ఐఫోన్‌ను పక్కోళ్లకి ఇచ్చేసో...లేక పక్కన పడేసో కొత్తదానికి సొంతం చేసుకునే వాళ్లు ఉన్నారు. వయసు 86 సంవత్సరాలు. అపర కుబేరుడు. ప్రపంచ ధనికుల్లో ఆయనది రెండో స్థానం. యాపిల్ కంపెనీలో ఆయనకు చాలా వాటాలున్నాయి. ఎన్నో వ్యాపారాలున్నాయి. కానీ ఆయన ఐఫోన్ వాడరు. ఆ మాటకొస్తే కనీసం స్మార్ట్ ఫోన్ కూడా వాడరు. పాతకాలం నాటి నోకియా ఫోన్‌నే వాడుతున్నారు. ‘ఏ వస్తువునైనా కనీసం ఓ పాతికేళ్లయినా వాడనిదే పారేయను’ అని స్పష్టంగా చెప్తారు. ఆయన ఈ-మెయిల్ కూడా వాడరు. ఇప్పటివరకూ ఒక్కసారి మాత్రమే ఈ-మెయిల్ పంపించారు. ఆయనే వారెన్ బఫెట్! బఫెట్ తన జీవితాన్ని ఆరంభించినప్పుడు ఎలా బతికేవాడో ఇప్పుడూ దాదాపు అలాగే బతుకుతున్నారు. 1958లో ఓమాహాలో 31,500 డాలర్లకు కొన్న మూడు పడక గదుల ఇంట్లోనే ఇప్పటికీ నివసిస్తున్నారు. ఆయనకు సొంతంగా ఒక జెట్ విమానం ఉంది. కానీ అత్యవసర సమావేశాలు ఉంటేనే అరుదుగా దానిని వాడతారు. స్మార్ట్ ఫోన్లు, ఈ-మెయిళ్లు వాడరు కాబట్టి, బఫెట్‌కు కొత్త సాంకేతిక పరిజ్ఞానమంటే అనవసర భయమని చాలామంది అనుకుంటారు. అది వాస్తవం కాదు. బఫెట్ తన జీవితాన్ని తన జీవిత సూత్రాల ప్రకారం జీవించే ప్రాక్టికల్ మనిషి. మనం అనుకునే ట్రెండ్ల ప్రభావానికి దేనికీ లోనుకాకుండా నిఖార్సైన జీవితం గడుపుతున్నారు. ముఖ్యంగా వస్తువుల విషయంలో అవసరాల ప్రాతిపదికన నడుచుకుంటారు. ‘ఏదైనా కంపెనీలో షేరు కొనాలంటే... దానిని కనీసం పదేళ్లయినా అట్టిపెట్టుకునే ఆలోచన లేకపోతే కొనవద్దు’ అనే మార్కెట్ జ్ఞానం ఆధారంగా ఆయన వస్తువులను చాలాకాలం పాటు వాడుతుంటారు. 2014 వరకూ ఎనిమిది సంవత్సరాల పాతదైన క్యాడిలాక్ కారునే వాడారు. ‘నేను ఏడాదిలో సుమారు 3,500 మైళ్లు మాత్రమే కారులో ప్రయాణిస్తాను. కాబట్టి కొత్త కారు కొనడం అరుదు’ అని బఫెట్ వివరిస్తారు. ఎంతోకాలంగా వాడుతున్న తన నోకియా ఫ్లిప్ ఫోన్‌ను గర్వంగా చూపిస్తూ ‘దీనిని అలగ్జాండర్ గ్రహంబెల్ నాకు ఇచ్చారు’ అని తెలిపారు. ‘క్రెడిట్ కార్డులకు దూరంగా ఉండండి... మీ మీద మీరు పెట్టుబడులు పెట్టుకోండి’ అనేది ఆయన యువతకు ఇచ్చే ముఖ్యమైన సలహా. బఫెట్ సాధారణ జీవనశైలి వెనుక - ‘డబ్బు మనిషిని సృష్టించదు... డబ్బును సృస్టించిందే మనిషి’ అనే ఆయన సిద్ధాంతం బలంగా పని చేస్తుంటుంది. సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఏడాదికి 4 సిబిల్ రిపోర్టులు!
రూ.1,200 సబ్‌స్క్రిప్షన్‌తో... సిబిల్ తాజాగా తన కస్టమర్ల కోసం సబ్స్క్రిప్షన్ సర్వీసులను ప్రారంభించింది. రూ.1,200తో సంవత్సరంలో త్రైమాసికానికి ఒకసారి చొప్పున నాలుగు సిబిల్ రిపోర్ట్‌లను పొందొచ్చు. దీని ద్వారా అప్ టు డేట్ క్రెడిట్ స్కోర్ వివరాలు కలిగి ఉండొచ్చు. దీనికోసం https://www.cibil. com.creditscore వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అక్కడ మనకు మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. ఒక రిపోర్ట్ (వన్‌టైమ్ ఆప్షన్, రూ.550), రెండు రిపోర్టులు (బైయాన్వల్ ఆప్షన్, రూ.800), నాలుగు రిపోర్ట్లు (క్వార్టర్లీ ఆప్షన్, రూ.1,200). వీటిల్లో ఏ ఆప్షన్నైనా ఎంచుకోవచ్చు. అవసరమైన వివరాలు అందజేసి, ఫీజు చెల్లిస్తే సిబిల్ రిపోర్ట్స్ ఈ–మెయిల్‌కు వస్తాయి. రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు, స్కోర్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని భావించేవారు, సిబిల్ స్కోర్‌ను మెరుగుపరచుకోవాలనుకునే వారు క్వార్టర్లీ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. దీని ద్వారా వారు నిర్దిష్ట కాలంలో రిపోర్ట్స్‌ను పొందుతారు. మీరు ఒక సిబిల్ రిపోర్ట్ కోసం రూ.550 చెల్లించాలి. తర్వాత మళ్లీ సంవత్సరంలోపే వేరొక రిపోర్ట్ కావాలంటే మళ్లీ రూ.550 కట్టాలి. అప్పుడు సంవత్సరానికి రూ.1,100 అవుతుంది. అలాంటప్పుడు క్వార్టర్లీ సబ్స్క్రిప్షన్ అప్షన్ ఎంచుకుంటే బాగుంటుంది. ఇక్కడ రూ.1,200తో నాలుగు రిపోర్ట్లు పొందొచ్చు. అయితే తొలిసారి సిబిల్ స్కోర్‌కు దరఖాస్తు చేసుకునే వారు వన్‌టైమ్ రిపోర్ట్ తీసుకోవడం ఉత్తమం. -
ఈ-మెయిల్ చేయండి.. మేం చూసుకుంటాం
న్యూఢిల్లీ: నల్లధన కుబేరుల వివరాలను సాధారణ ప్రజలు తమకు చెప్పొచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దేశ ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీస్తున్న వారి వివరాలను ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక ఈ-మెయిల్ కు పంపాలని రెవెన్యూ సెక్రటరీ హస్ముఖ్ అధియా దేశ ప్రజలను కోరారు. blackmoneyinfo@incometax.gov.in కు మెయిల్ చేయడం ద్వారా నల్లధన కుబేరుల వివరాలను ఆదాయపన్ను శాఖ అధికారులు సులువుగా గుర్తించగలుగుతారని చెప్పారు. -
సైబర్ పోకిరీకి అరదండాలు
హైదరాబాద్: అమెరికాలో పీహెచ్డీ చేస్తున్న మహారాష్ట్రకు చెందిన వివాహితను ఆన్ లైన్ ద్వారా వేధింపులకు గురి చేస్తున్న సైబర్ పోకిరిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. బాధితురాలు కేవలం ఈ–మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినప్పటికీ తక్షణం స్పందించిన అధికారులు కేసు నమోదు చేయడంతో పాటు నిందితుడిని కటకటాల్లోకి పంపడం విశేషం. మహారాష్ట్రలోని సాంఘ్లీ ప్రాంతానికి చెందిన వివాహిత 2007లో హైదరాబాద్‌లోని ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీలో (ఇఫ్లూ) ఫ్రెంచ్ భాషలో పీజీ చేశారు. ఆ సమయంలో రిఫరెన్స్ కోసం తరచూ ఇఫ్లూ లైబ్రరీకి వెళ్ళేవారు. అప్పట్లో ఉస్మానియాలో ఇంగ్లీష్‌లో ఎంఫిల్ చేస్తున్న వెస్ట్ మారేడ్‌పల్లికి చెందిన దేవతల మనోహర్ డేవిడ్ మాథ్యూస్ ఇఫ్లూ లైబ్రరీలో ఆమెను చూసి ఇతరుల ద్వారా పేరు తెలుసుకున్నాడు. కాగా సదరు మహిళకు అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో పీహెచ్డీ (ఫ్రెంచ్ సాహిత్యం) చేసే అవకాశం రావడంతో అక్కడకు వెళ్ళారు. డేవిడ్ మాథ్యూస్ విద్యాభ్యాసం తర్వాత ఓయూ ఆర్ట్స్ కాలేజీలో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ బోధకుడిగా చేరాడు. ఇఫ్లూ లైబ్రరీలో కనిపించిన ఆమె ఆపై కనిపించకపోవడంతో ఆమె కోసం ‘వెతకడం’ ప్రారంభించాడు. సోషల్ మీడియాతో పాటు ఆన్లైన్ లో ఆ వివాహిత పేరుతో భారీ సెర్చ్ చేసిన డేవిడ్ మాథ్యూస్ చివరకు ఆర్కూట్ ద్వారా ఆమె మెయిల్ ఐడీ తెలుసుకున్నాడు. దీనికి తన మెయిల్ ఐడీ నుంచి దాదాపు 200 అసభ్యకర, అభ్యంతరకర సందేశాలు పంపాడు. తనతో స్నేహం చేయాలని, హైదరాబాద్ వచ్చి సన్నిహితంగా ఉండాలని బెదిరించాడు. తాను వివాహితనని, తనకు స్నేహం చేసే ఆసక్తి లేదని ఆమె నుంచి బదులు రావడంతో డేవిడ్ మాథ్యూస్ మరింత రెచ్చిపోయాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు ఈ నెల ఏడున ఈ–మెయిల్ ద్వారా సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య, సంయుక్త కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెంటనే స్పందించారు. ఈ ఫిర్యాదును కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేయాల్సిందిగా సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్.జయరామ్‌ను ఆదేశించారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతిక ఆధారాలను బట్టి వెస్ట్ మారేడ్‌పల్లిలో ఉంటున్న డేవిడ్ మాథ్యూస్ నిందితుడిగా గుర్తించారు. శుక్రవారం అతడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ పోకిరి బారిన పడిన బాధితులు ఎవరైనా ఉంటే 9490617347 నెంబర్‌ను సంప్రదించాలని అధికారులు కోరారు. -
‘కోక్’ పేరుతో రూ.11 లక్షలు కాజేశాడు!
సాక్షి, సిటీబ్యూరో: ఘట్కేసర్కు చెందిన ఓ వ్యక్తికి ఈ–మెయిల్ ద్వారా ఎర వేసి... 45 వేల పౌండ్ల విలువైన కోకకోలా లాటరీ తగిలిందని నమ్మించి రూ.11.8 లక్షలు కాజేసిన నైజీరియన్‌ను రాచకొండ కమిషనరేట్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. న్యూఢిల్లీ కేంద్రంగా కథ నడిపిన ఇతడి నుంచి 2100 డాలర్లు, 25 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు కమిషనర్ మహేష్ ఎం.భగవత్ శుక్రవారం వెల్లడించారు. నైజీరియాకు చెందిన ఉడెలోర్ టోనీ న్యాండే 2010లో విజిట్ వీసా తీసుకుని భారత్‌కు వచ్చాడు. న్యూఢిల్లీలో మకాం ఏర్పాటు చేసుకున్న ఇతను మరికొందరు అనుచరుల్ని ఏర్పాటు చేసుకుని ఎస్సెమ్మెస్‌లు, ఈ–మెయిల్స్ ఆధారంగా మోసాలకు తెరలేపాడు. ఇంటర్నెట్తో పాటు వివిధ మార్గాల్లో దేశ వ్యాప్తంగా అనేక మందికి చెందిన ఈ–మెయిల్ ఐడీలు, ఫోన్ నెంబర్లు సేకరించాడు. బీబీసీ, కోకకోలా, సామ్సంగ్ వంటి ప్రముఖ కంపెనీల పేర్లను వినియోగించే టోనీ వారికి ఆ లాటరీలు తగిలాయంటూ ఎరవేసేవాడు. ఘట్కేసర్ మల్లికార్జున నగర్‌కు చెందిన పి.నవీన్‌కుమార్‌కు ఈ ఏడాది ఆగస్టులో కోకకోలా లాటరీ పేరుతో ఈ–మెయిల్ వచ్చింది. రూ.3.67 కోట్ల (45 వేల పౌండ్లు) మొత్తం లాటరీ వచ్చినట్లు ఉన్న ఆ మెయిల్‌కు అతడు స్పందించడంతో అసలు కథ మొదలైంది. ఈ నగదు పొందడానికి పన్నుల రూపంలో కొంత మొత్తం చెల్లించాలంటూ చెప్పిన టోనీ అతడినినమ్మి ంచేందుకు సరికొత్త పంథా అనుసరించాడు. ‘డార్క్ నెట్’ నుంచి కొన్ని క్రెడిట్‌కార్డుల డేటాను సంగ్రహించాడు. వివిధ బ్యాంకుల వినియోగదారుల నుంచి చోరీ చేసిన క్రెడిట్‌కార్డుల డేటాను కొనుగోలు చేసి ఖాళీ మ్యాగ్నసిక్ స్టిప్ర్పై రైట్ చేయడంతో పాటు దానిపై బ్రిటిష్ బ్యాంకు పేరుతో పాటు బాధితుడి పేరునే ముద్రించాడు. ఈ కార్డ్‌తో పాటు దాని పిన్ నెంబర్‌ను సైతం బాధితుడికి పంపాడు. వీటిని వినియోగించి బాధితులు ఓ ఏటీఎం సెంటర్‌కు వెళ్ళి రూ.14 వేలు డ్రా చేసుకున్నాడు. దీంతో అతడికి లాటరీ డబ్బు తనకు వస్తుందని నమ్మకం కలగడంతో అప్పటి నుంచి వివిధ రకాలైన పన్నులు, ఇతర లావాదేవీల పేర్లు చెప్పి వివిధ దఫాల్లో రూ.11.8 లక్షలు వివిధ బ్యాంకు ఖాతాల ద్వారా వసూలు చేశాడు. చివరకు మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలను బట్టి టోనీ నిందితుడిగా గుర్తించారు. ఢిల్లీ వెళ్లిన ప్రత్యేక బృందం నిందితుడిని అరెస్టు చేసి ట్రాన్సిట్ వారెంట్‌పై నగరానికి తీసుకువచ్చింది. -
హిల్లరీ క్లింటన్‌కు చిక్కులు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తలపడుతున్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. విదేశాంగ మంత్రిగా ఉన్నపుడు అధికార విధులకోసం ప్రైవేటు ఈ-మెయిల్‌ను ఎందుకు వాడారో చెప్పాలంటూ ఓ వాచ్డాగ్ సంధించిన ప్రశ్నలకు రాతపూర్వకంగా సమాధానం తెలపాలని హిల్లరీ క్లింటన్‌ను అమెరికా ఫెడరల్ జడ్జి ఆదేశించారు. హిల్లరీకి వ్యతిరేకంగా జ్యుడీషియల్ వాచ్ అనే గ్రూపు దాఖలు చేసిన ఓ దావా నేపథ్యంలో యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి ఎమ్మెట్ జి సులివాన్ ఈ ఆదేశాలను జారీ చేశారు. ఈ వ్యవహారంలో హిల్లరీని అధికార ప్రమాణాల కింద, వ్యక్తిగతంగా ప్రశ్నించేందుకు అనుమతివ్వాలన్న జ్యుడీషియల్ వాచ్ వినతిని కోర్టు తోసిపుచ్చింది. అయితే ఇందుకు సంబంధించిన మిగిలిన పత్రాలన్నింటినీ సెప్టెంబర్ 30లోగా జ్యుడీషియల్ వాచ్‌కు అందజేయాలని విదేశాంగశాఖను ఆదేశించింది. కాగా రాతపూర్వకంగా ప్రశ్నలను అక్టోబర్ 14లోగా హిల్లరీకి జ్యుడీషియల్ వాచ్ సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీనిపై సమాధానమిచ్చేందుకు హిల్లరీ క్లింటన్‌కు కోర్టు 30 రోజుల గడువిచ్చింది. కోర్టు ఆదేశాల పట్ల జ్యుడీషియల్ వాచ్ సంస్థ అధ్యక్షుడు టామ్ ఫిట్టొన్ హర్షం వెలిబుచ్చారు. చట్టానికి హిల్లరీ క్లింటన్ అతీతులు కాదని ఇది నిరూపించిందన్నారు. -
మౌనాన్ని వీడే మార్గమే లేదా?!
నాకు చిన్నప్పట్నుంచీ మొహమాటం ఎక్కువ. ఎవ్వరితోనూ ఎక్కువ మాట్లాడను. కొంచెంసేపు మాట్లాడితే ఇక ఆ సంభాషణను కొనసాగించలేను. ఆ సంభాషణ వల్ల కలిగే పర్యవసానానికి భయపడి మౌనంగా అయిపోతాను. ఈ పరిస్థితి మారేదెలా? - అఖిల్, మెయిల్ మొహమాటం వేరు, ఎవ్వరితోనూ మాట్లాడలేకపోవడం వేరు. ముందు ఆ విషయంలో క్లారిటీతో ఉండండి. సంభాషణ ఎలా ఉండాలో రామాయణంలో చక్కగా వివరించాడు వాల్మీకి. క్లుప్తంగా, సాగతీతలు లేకుండా, మృదువైన కంఠస్వరంతో, వర్ణోత్పత్తి స్థానాలైన హృదయ, కంఠాలను ఆశ్రయించి, ప్రతి అక్షరం మధ్యమ స్వరంలో పలకాలట. సంభాషణ నాలుగు రకాలు. మాటల కుంభ వృష్టి (అవసరం లేక పోయినా మాట్లాడటం), అనావృష్టి (అవసరం ఉన్నప్పుడు కూడా మాట్లాడలేకపోవడం), పూర్తిగా రిజర్వ్డ్గా ఉండటం, అవసరమైన మేరకు క్లుప్తంగా మాట్లాడటం. మీకు మాట్లాడటం రాదని, మీలో ఏదో తక్కువని చిన్నప్పుడు మీకు ఎవరో చెప్పి వుంటారు. వయసుతో పాటు ఆ న్యూనతా భావం మీలో పెరిగి ఉండొచ్చు. ఆ బరువు వదిలించుకుంటే మనసు తేలిక అవుతుంది. మొహమాటం, కాంప్లెక్స్‌లతో బాధపడేవారు కాస్త మార్పు ద్వారా ఆ మానసిక రోగాల నుంచి బయట పడవచ్చని సైకాలజిస్టులు చెబుతారు. అటు వంటి మార్గదర్శక సూత్రాలు మీ కోసం. జు మీతో మీరు ఎక్కువ సమయం గడపండి. ఇతరుల ప్రేమకై ఆరాటం తగ్గుతుంది. నాకె వరూ లేరే అని బాధపడటం ఒంటరితనం. నాకు నేనున్నానని సంతో షించడం ఏకాంతం. ప్రకృతి అందాల్ని, పక్షుల శబ్దాల్ని, గాలి సంగీ తాన్ని, ముఖేష్ పాటని, మీ ఉనికిని మీరు ఆనం దించడమే ఏకాంతం. పుస్తకాల్ని, ప్రార్థనని, ప్రకృతిని, పాటల్ని, తోటల్ని ప్రేమించేవాడు వృథా పరిచయాల కోసం పాకు లాడడు. జు ధీమాగా బతకండి. మీ ఆలోచనలు వంకరగా లేనంత కాలం మీ వంకర పళ్ల గురించి ఎవరూ పట్టించుకోరు. జు నీ అనుమతి లేకుండా నిన్నె వరూ చిన్నబుచ్చలేరు అంటాడు బాల్యంలోనే పోలియోతో రెండు కాళ్లూ పోగొట్టుకున్న అమె రికన్ ప్రెసిడెంట్ రూల్వెల్ట్. నువ్వెలా ఉంటే బావుంటావో నీ చెవిలో జోరీగలాగా నిరంతరం నిన్ను సాధించే మనిషి, నీలోనే ఒకడుంటాడు. అతడికీ నీకూ మధ్య గొడవ తగ్గేకొద్దీ నీ మీద నీకు ప్రేమ, నమ్మకం పెరుగుతాయి. ఇక ప్రైవేట్ కమ్యునికేషన్లో ఈ అంశాలు దృష్టిలో పెట్టుకోండి. 1. ఎప్పుడు జోక్ చెయ్యాలి, ఎప్పుడు సీరియస్‌గా ఉండాలి?; 2. పరిచయం ఎక్కువయ్యేకొద్దీ అతిగా సంభాషిం చకూడదు. శ్రద్ధగా వినాలి. 3. మాట్లాడటానికి తగిన విధంగా మీ మూడ్ ఉండాలి; 4. విన టానికి సరైన స్థితిలో అవతలివారి మూడ్ ఉందా? 5. వారి మూడ్‌ని మీ మాటల్లో మార్చ గలిగే పరిస్థితి ఉందా?; 6. అవతలివారి పరిస్థితిని బట్టి మూడ్‌ని మార్చుకునే అవసరం మీకుందా? మొనాలిసా పెయింటింగ్ ఎందు కంత ప్రసిద్ధి చెందింది? చిరునవ్వు వల్ల! ప్రశాంత మైన నవ్వుకి అంత గొప్ప విలువ ఉంది. ముఖంపై మృదు దరహాసం కొనసాగించండి. మీపట్ల మీకున్న నమ్మకానికి చిరునవ్వు ప్రత్యక్షసాక్షి. ఫస్ట్ ఇంప్రెషన్లో చిరునవ్వు, దుస్తులు, బాడీ లాంగ్వేజీ, మాటల్లో మృదుత్వం ప్రాముఖ్యత వహిస్తాయి. నేను బీటెక్ మూడో యేడు చదువుతున్నాను. నాకో ఫ్రెండ్ ఉన్నాడు. తనని నేను అన్నయ్యా అని పిలుస్తాను. తనూ నన్ను సొంత చెల్లిలా చూస్తాడు. తను ఈ మధ్య డ్రగ్స్‌కి అలవాటుపడ్డాడు. తను బాగా పాడైపోయాడని అందరూ కామెంట్ చేస్తున్నారు. దూరదూరంగా ఉంటున్నారు. అది నేను తట్టుకో లేకపోతున్నాను. సర్ది చెబుదామంటే ఎలా రియాక్ట వుతాడోనని భయం. ఏం చేయమంటారు? తనని ఎలా ఆ అలవాటు నుంచి బయట పడేయాలి? - అనూష, రాజమండ్రి మీ అన్నయ్యకి అమ్మ, నాన్న, అన్న, చెల్లి... ఇలా సొంతవాళ్లెవరూ లేరా? వాళ్లకి ఈ డ్రగ్స్ విషయం తెలుసా? వాళ్లకి లేని బాధ మీకెందుకు అని నేను అనట్లేదు. తమ మనిషి డ్రగ్స్‌కి అల వాటుపడ్డ విషయం గురించి ఇంట్లో తెలిసిందా లేదా అని మాత్రమే అడుగుతున్నాను. తెలి సుంటే వాళ్లు ఈపాటికే అతణ్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడమో, హెచ్చరించడమో చేసి ఉంటారు. అది కనుక్కోండి. ఓసారి డ్రగ్స్‌కి అలవాటు పడ్డ వాడు చెప్తే బాగుపడడు. కాని చెప్పడం మీ బాధ్యత. మీ ప్రయత్నం మీరు చేసి చూడండి. అతడు ఎలా రియాక్టవుతాడో అని మీకెందుకు భయం! ఆ విషయం మీకు తెలిసిందని ఏడుస్తాడా, కోపగించుకుంటాడా లేక మిమ్మల్ని దూరం చేసుకుంటాడా? ఏం జరిగినా అతడి ఆరోగ్యం కంటే ప్రమాదకరమైనవి కావు. ఇకపోతే మీది రాజమండ్రి అంటున్నారు కాబట్టి అక్కడే ఇద్దరు ప్రముఖ సైకాలజిస్టులున్నారు. ఈ అలవాటును తాము మాన్పించగలం అని తరచూ ప్రకటిస్తున్నారు కూడా. తీసుకెళ్లండి. అయితే ఇవన్నీ మీ అన్నయ్య ఒప్పుకుంటేనే జరుగుతాయి. -
అత్తింట్లో నరకం
తన లాయర్‌కు పంపిన ఫిర్యాదు లేఖలో సారిక గోడు * అత్తామామ, భర్త కలసి తీవ్రంగా వేధించారు * అడుగడుగునా అవమానాలే.. * భర్త బలాదూర్‌గా తిరిగాడు.. నా డబ్బులన్నీ వాడుకున్నాడు * వివాహేతర సంబంధంపై ప్రశ్నిస్తే కొట్టేవాడు * పిల్లల్ని ఏనాడూ పట్టించుకోలేదు.. పాల డబ్బాలు కొనాలన్నా ఇబ్బందే * వంటగదికి తాళం వేసేవారు.. పస్తులు అలవాటైపోయాయి * భర్త కోసం త్యాగాలు చేయాలని రాజయ్య అనేవారు * ఆయన మాటలకు చచ్చిపోవాలనిపించేది సాక్షి, హన్మకొండ: ప్రేమ పేరుతో సారిక జీవితంలోకి ప్రవేశించిన మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కుమారుడు అనిల్ అనుక్షణం ఆమెకు నరకాన్ని చూపించాడు. భర్తగా కష్టసుఖాల్లో తోడుండాల్సిన వ్యక్తి బాధ్యతలను గాలికొదిలి బలాదూర్‌గా తిరిగాడు. సారిక కష్టార్జితాన్ని ఇష్టారీతిగా వాడుకుంటూ మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. తప్పు దారిలో వెళ్తున్న కొడుకును మందలించాల్సిన తల్లిదండ్రులు కూడా ఆయనకే వత్తాసు పలికారు. సూటిపోటి మాటలు, భౌతిక దాడులతో సారికకు అనుక్షణం నరకం చూపించారు. భర్త, అత్తమామాలు పెడుతున్న ఇబ్బందులను తన తరఫున న్యాయవాదికి, షాహిన్స్ ఉమెన్ ఆర్గనైజేషన్‌కు పంపిన ఫిర్యాదు లేఖలో సారిక పూసగుచ్చినట్టు వివరించింది. ఆ వివరాలివీ.. నా కొడుకును పెళ్లి చేసుకో.. అనిల్, నేను ఉద్యోగాలు తెచ్చుకుంటే మా వాళ్లను, అనిల్ కుటుంబీకులను ఒప్పించి పెళ్లి చేసుకుందామని అనుకున్నా. పెళ్లికి ముందు మా అత్తగారు మాధవి నన్ను తన కాలేజీకి (కేయూలో పీహెచ్డీ చేస్తున్న సమయంలో) తీసుకెళ్లి మాయ మాటలు చెప్పింది. నన్ను మా అమ్మవాళ్ల ఇంట్లోంచి బయటకొచ్చి, వాళ్ల అబ్బాయిని పెళ్లి చేసుకోమని చెప్పింది. చదువుకున్న వ్యక్తి, లెక్చరర్, మంచీచెడు అన్ని తెలిసిన పెద్దావిడ అని తల్లిలా భావించాను. ఆమె చెప్పినట్లే ఇంట్లోంచి వచ్చేసి అనిల్‌ను పెళ్లి చేసుకున్నా. ఆవిడ మాటలు విని చాలా పెద్ద తప్పు చేశాను. ఘోరమైన తప్పుడు స్టెప్ వేశాను. ఒక తప్పుడు నిర్ణయంతో జీవితం ఎలా నాశనం చేసుకుంటామన్నదానికి నా జీవితమే పెద్ద ఉదాహరణ. నా భర్త ఇంట్లో ప్రతీ క్షణం నన్ను అవమానించాడు. నా కష్టార్జితాన్ని వాడుకున్నారు. నన్ను, నా పిల్లలను పట్టించుకోలేదు. పిల్లలకు వ్యాక్సిన్ వేయించేందుకు ఆస్పత్రికి వెళ్లడం నాకో పెద్ద పరీక్ష. ఇంట్లో మూడు కార్లు ఉన్నా.. ఒక్కటీ తీసేవారు కాదు. చివరికి పాల డబ్బాలు, మందులు కొనడం కూడా ఇబ్బందిగా ఉండేది. ఇంట్లో వంటగదికి తాళం వేసేవారు. వండిన వంటలో అడుగుకు మిగిలినవే నాకు నా బిడ్డలకు దక్కేవి. రెండోసారి గర్భిణిగా ఉన్నప్పుడు ఇంట్లో అన్ని గదులకు తాళం వేసి నన్ను హాల్లోనే ఉంచేవారు. బాత్రూమ్కి వెళ్లడం కష్టంగా ఉండేది. బట్టలుతికే స్థలంలో స్నానం చేయాల్సి వచ్చేది. పెద్ద పొట్టతో హాల్లో నేను ఇబ్బంది పడుతుంటే ఇంట్లోకి వచ్చిన అత్తామామలు.. పెద్దవాళ్లు వచ్చినప్పుడు లేచి నిలబడాలని తెలియదా? అంటూ తిట్టేవాళ్లు. ఇద్దరు కవల పిల్లలు పుట్టాక పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. పాలు, సెరిలాక్ డబ్బా కొనడానికి కూడా నేను ఇబ్బంది పడాల్సి వచ్చేది. పస్తులు కామన్ అయ్యాయి.. అనిల్‌తో 2006లో జరిగిన పెళ్లితో నా నరకప్రాయమైన జీవితం మొదలైంది. ఇంట్లో ఎవరూ నన్ను తిన్నావా? అని అడిగేవారు కాదు. అన్నానికి కూడా పిలిచేవారు కాదు. పస్తులు ఉండటం కామన్ అయిపోయింది. నా డబ్బులు రూ.20 లక్షలు, 10 తులాల బంగారం అంతా వాళ్ల దగ్గరే ఉంది. మా అమ్మ వాళ్లతో మాట్లాడేప్పుడు ఫోన్ లౌడ్ స్పీకర్ ఆన్ చేయమనేవాడు. కాల్‌లాగ్ చెక్ చేసేవాడు. మీ చెల్లెలితో మాట్లాడావా.. అంతసేపు ఏం మాట్లాడావు? అంటూ ఆరా తీసేవాడు. ఇదీ అని చెబితే, నాకు చెప్పింది 5 నిమిషాలే కదా.. మిగతా 25 నిమిషాలు ఏమి మాట్లాడావని అడిగేవాడు. ఇలాంటివెన్నో భరించాను. ఎక్కడా ఎప్పుడు ఎవరితో చెప్పుకునేదాన్ని కాదు. మా అమ్మవాళ్లతో కూడా ఏమీ చెప్పలేదు. పెళ్లైనప్పట్నుంచీ అనిల్ ఇంతవరకు ఒక్క పని చేయలేదు. జాబ్ చేయమని ఎంతో నచ్చ చెప్పేదాన్ని. రెజ్యూమ్ ప్రిపేర్ చేయడం, ఇంటర్వ్యూ తేదీలు ఇలా ఏ టూ జడ్ పనులు చేసినా ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉండేవాడు. మా అత్తమామలు తలచుకుంటే ఏదైనా మంచి బిజినెస్, జాబ్ పెట్టించి ఉండొచ్చు. కానీ ఏదీ చేయలేదు. 2007 నుంచి 2010 వరకు కలకత్తా, ముంబై, పుణేలో మూడేళ్లు జాబ్ చేశాను. ఆ సమయంలో ఏటీఎం అనిల్ దగ్గరే ఉండేది. సేవ్సింగ్స్ లేకుండా డబ్బులన్నీ వాడుకున్నాడు. 2010లో పుణేలో ఉద్యోగానికి రాజీనామా చేసి ఇక్కడికి వచ్చాక తెలిసింది అతనికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని. ముందుగా ఒప్పుకోలేదు కానీ తర్వాత ఒప్పుకున్నాడు. తప్పులను ప్రశ్నిస్తే చాలు.. నాపై చేయి చేసుకునేవాడు, ఒకసారి నా జుట్టు పట్టుకుని నన్ను విసిరేస్తే, మంచం చివర తగిలి పెద్ద గాయమైంది. అత్తామామకు ఈ విషయం చెబితే పట్టించుకోలేదు సరికదా అనిల్‌కే మద్దతుగా నిలిచారు. అత్త పచ్చి బూతులు తిట్టేది అత్త మాధవి ఈసడింపు మాటలు, బూతులు, చిన్నదానికీ పెద్ద దానికీ వంకలు పెడుతూ తిట్టేది. చీటికీమాటికీ ‘నా మోచేతి నీళ్లు తాగి బతుకుతున్నావు. బయటకు పంపేస్తాను. గేట్ బయట నించోని మాట్లాడు. పచ్చి బూతులు తిట్టేది. మా మామయ్య, నా భర్త ఏనాడూ ఆవిడను అడ్డుకునేవారు కాదు. ఒకసారి మా అమ్మ నాకు చీర పెట్టింది. ఆ చీర చూసి, నానా రభస చేసి ‘ఎవడేమీ ఇచ్చినా ఇలాగే తీసుకో’ అంటూ ద్వంద్వార్థాలతో మాట్లాడింది. ‘ఇప్పటికిప్పుడు నువ్వు ఇంట్లోంచి వెళ్లిపో, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు’ అంటూ నాపైకి వచ్చేసి, వస్తువులు మీదకు విసిరేసి, చేయి చేసుకుని ఇంట్లోంచి గెంటేసింది. నాలుగు జతల బట్టలు తీసుకుని వెక్కివెక్కి ఏడ్చుకుంటూ వెళ్లిపోయాను. అనిల్ కూడా వాళ్లమ్మకే వంత పాడేవాడు. త్యాగం చేయాలన్న మామ కుటుంబ పెద్దగా మామయ్య సిరిసిల్ల రాజయ్య ఏనాడూ నాకు అండగా నిలవలేదు. ‘‘ఎంతో మంది మహిళలు భర్త కోసం, భర్త కుటుంబం కోసం త్యాగాలు చేస్తున్నారు. నువ్వు కూడా త్యాగం చేయాలి’’ అని అనేవాడు. పనివాళ్లు, పార్టీ కార్యకర్తల ముందే ఇష్టం వచ్చినట్టుగా గట్టిగా తిట్టేవాడు. దీంతో పైప్రాణం పైనే పోయేది. ఆ మాటలకు ఒక్కోసారి చచ్చిపోవాలనిపించేది. మామయ్య నా పేరు మీద నా అకౌంట్లో రూ.8 లక్షలతో కార్ లోను తీసుకున్నాడు. చేతిఖర్చులకు నా డబ్బులు వాడుకునేవాడు. -
స్టార్టప్‌లకు మైక్రోసాఫ్ట్ దన్ను..
సంస్థ సీఈవో సత్య నాదెళ్ల వెల్లడి జస్ట్‌డయల్, పేటీఎం, స్నాప్‌డీల్‌తో ఒప్పందం ముంబై: భారత్‌లో స్మార్ట్ సిటీల రూపకల్పనలో నిమగ్నమైన వందల కొద్దీ స్టార్టప్ సంస్థలకు, ఔత్సాహిక యువ వ్యాపారవేత్తలకు తోడ్పాటు ఇవ్వనున్నట్లు సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల చెప్పారు. ఇక్కడి స్టార్టప్ సంస్కృతి తనను అబ్బురపరుస్తోందన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన స్థానిక మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవలు, నూతన డివైజ్‌లు.. అపార వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఎంట్రప్రెన్యూర్లకి ఉపయోగపడగలవని ఆయన తెలిపారు. భారత్‌లో తొలిసారిగా మైక్రోసాఫ్ట్ భారీ ఎత్తున నిర్వహించిన క స్టమర్ల సదస్సులో పాల్గొన్న సందర్భంగా నాదెళ్ల ఈ విషయాలు వివరించారు. భారత్‌లో క్లౌడ్ కంప్యూటింగ్‌కి ప్రాధాన్యం పెరుగుతున్న తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని నాదెళ్ల చెప్పారు. ఈ నేపథ్యంలోనే పుణే, ముంబై, చెన్నైలలో మైక్రోసాఫ్ట్ మూడు డేటా సెంటర్లు ప్రారంభించిందని పేర్కొన్నారు. మరోవైపు, ఈ-కామర్స్ సంస్థలు జస్ట్‌డయల్, పేటీఎం, స్నాప్‌డీల్ సంస్థలతో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. వ్యాల్యుయేషన్ల గురించి ఆందోళన లేదు.. స్టార్టప్ సంస్థల్లో తాము ఇన్వెస్టర్లుగా ఉండబోవడం లేదు కాబట్టి.. వాటి వ్యాల్యుయేషన్ల గురించి పెద్దగా ఆలోచించడం లేదని నాదెళ్ల చెప్పారు. ఆయా ఆవిష్కర్తల అబ్బురపరిచే ఐడియాలపైనే తాము ఆసక్తిగా ఉన్నామని ఆయన వివరించారు. స్టార్టప్ ఎంట్రప్రెన్యూర్లు కొంగొత్త ఆవిష్కరణలు చేసేందుకు దాదాపు రూ.80 లక్షల విలువైన అజూర్ కంప్యూటింగ్ సొల్యూషన్స్‌ను అందిస్తామని నాదెళ్ల పేర్కొన్నారు. స్మార్ట్ సిటీల ఏర్పాటుకు తోడ్పడే డిజిటల్ ప్రాజెక్టులను నిర్వహిస్తామన్నారు. తాము చేపట్టిన కార్యక్రమాల ప్రభావం వచ్చే ఐదేళ్లలో 50 స్మార్ట్ సిటీలపై కనిపించగలవని నాదెళ్ల చెప్పారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో పైలట్ ప్రాజెక్టులు అమలు చేస్తున్నామని తెలిపారు. కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు: సెర్చి ఇంజిన్ బింగ్, క్లౌడ్ ఆధారిత అనలిటిక్స్ తోడ్పాటుతో కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు మైక్రోసాఫ్ట్, జస్ట్‌డయల్ కలిసి పనిచేయనున్నాయి. కస్టమర్లు మొబైల్ లావాదేవీలు సులువుగా నిర్వహించుకునేందుకు, బిల్లులను సులభతరంగా ఆన్లైన్లోనే చెల్లించే వీలు కల్పించేందుకు కోర్టానా బ్రౌజర్‌తో పేటీఎం యాప్, పేటీఎం వాలెట్‌ను అనుసంధానం చేసే అంశంపై పేటీఎం, మైక్రోసాఫ్ట్ చేతులు కలిపాయి. ఈ డీల్‌లో భాగంగా పేటీఎం తమ నెట్వర్క్ ద్వారా మైక్రోసాఫ్ట్ సర్వీస్ సేల్స్‌కు తోడ్పాటునివ్వనుంది. అటు ఆన్లైన్లో వాహనాల విక్రయానికి తోడ్పడేలా రూపొందిస్తున్న వ్యవస్థ కోసం స్నాప్‌డీల్.. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ప్లాట్‌ఫాంను ఉపయోగించుకోనుంది. పాస్వర్డ్హ్రిత ప్రపంచంపై కసరత్తు .. ఈమెయిల్స్, మొబైల్ ఫోన్స్ భద్రతపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో యూజర్లకు పాస్వర్డ్ కష్టాల నుంచి విముక్తి కల్పించే దిశగా కసరత్తు చేస్తున్నట్లు నాదెళ్ల తెలిపారు. పాస్వర్డ్లు హ్యాకింగ్‌కు గురయ్యే ప్రసక్తి లేకుండా కంప్యూటింగ్ పరికరాలకు రక్షణ కల్పించాలన్నది తమ ఉద్దేశమన్నారు. ప్రపంచం, టెక్నాలజీలు మారిపోతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఉత్పాదకత ను, వ్యాపార ప్రక్రియలను మెరుగుపర్చుకోవాలన్నది తమ కంపెనీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. తాను వ్యక్తిగతంగా ఉపయోగించే సాధనాల గురించీ నాదెళ్ల ప్రస్తావించారు. ‘నేను మా కంపెనీ తయారు చేసే హైఎండ్ లూమియాతో పాటు ఐఫోన్ నూ వాడతా ను. అయితే, దీన్ని ఐఫోన్ ప్రోగా భావిస్తా. ఎందుకంటే ఇందు లో మా మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ మొత్తం ఉంటుంది’ అని సత్య చెప్పారు. జనవరిలో సర్ఫేస్ ప్రో 4.. వచ్చే ఏడాది జనవరిలో సర్ఫేస్ ప్రో 4 ట్యాబ్లెట్‌ను భారత్‌లో ఆవిష్కరించనున్నట్లు నాదెళ్ల తెలిపారు. 12.3 అంగుళాల పిక్సెల్సెన్స్ డిస్ప్లే, 9 గంటల బ్యాటరీ లైఫ్, 64 జీబీ నుంచి 500 జీబీ దాకా స్టోరేజ్ ఆప్షన్స్ ఇందులో ఉంటాయి. దీని ఖరీదు రూ. 75,000గా ఉండొచ్చని అంచనా. డిసెంబర్లో లుమియా 950, లుమియా 950 ఎక్స్ఎల్ ఫోన్లను ప్రవేశపెట్టనున్నట్లు మైక్రోసాఫ్ట్ ఇండియా చైర్మన్ భాస్కర్ ప్రామాణిక్ తెలిపారు. సంస్కరణల అమలుతోనే పురోగతి.. గడచిన 12 నెలలుగా తమ క్లౌడ్ వ్యాపారం గణనీయంగా వృద్ధి చెందిందని, వ్యవస్థాగతమైన సంస్కరణలు అమలవుతుండటం వల్లే ఇది సాధ్యపడిందని తాను భావిస్తున్నట్లు నాదెళ్ల పేర్కొన్నారు. ప్రభుత్వ విభాగాలతో సాధ్యమైనంత వరకూ ఘర్షణాత్మక పరిస్థితి లేకుండా చూసుకునేందుకే తాను ప్రాధాన్యం ఇస్తానని ఎడిటర్లతో జరిగిన సమావేశంలో ఆయన వివరించారు. ఏడాది క్రితం ప్రవేశపెట్టిన తమ క్లౌడ్ సర్వీసులను ప్రైవేట్ సంస్థలే కాకుండా ప్రభుత్వ సంస్థలు కూడా పెద్ద ఎత్తున వినియోగిస్తుండటం తనను ఆశ్చర్యపర్చిందన్నారు. -
సారిక ఈ మెయిల్ సారాంశం ఇదే...
-
సారిక ఈ మెయిల్ సారాంశం ఇదే...
హైదరాబాద్ : అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కాంగ్రెస్ నేత సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక... తన తరఫు న్యాయవాది రెహానాకు 22 పేజీల ఈ మెయిల్ పంపింది. తనను మానసికంగా, శారీరకంగా హింసలను భరిస్తున్నానంటూ ఆమె ఈ మెయిల్లో పేర్కొంది. భర్త అనిల్ వ్యవహారాన్ని సారిక పూసగుచ్చినట్లు మెయిల్లో వివరించింది. ఈ మెయిల్ సారాంశం..ఇదే... 'ఇల్లు విడిచి వెళ్లాలంటూ పదే పదే అత్త, భర్త వేధించేవారు. తిట్లు అరుపులు, కేకలతో రోజు అత్త విరుచుకుపడేది. నా తల్లి ఇచ్చిన చీరను కూడా తీసుకోనివ్వలేదు. రాజయ్య ఎంపీ అయ్యాక వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయి. ఇంట్లో పనివాళ్లు, పరిచయస్తుల ముందే తిట్టేవారు. అనిల్‌కు వివాహేతర సంబంధాలున్నాయి. ఎప్పుడు ఇంటికి వస్తాడో, ఎప్పుడు వెళ్లిపోతాడో తెలియదు. కుటుంబం పట్ల కనీస బాధ్యత లేదు. ఎక్కడకు వెళ్లావని అడిగితే చాలు..భౌతిక దాడులకు దిగేవాడు. ఇంత జరుగుతున్నా...అత్తమామలు పట్టించుకునే వాళ్లు కాదు. వండుకోవడానికి కనీసం సరుకులు కూడా అనిల్ తెచ్చేవాడు కాదు. నేను, పిల్లలు చాలాసార్లు ఆకలితో అలమటించాం. పిల్లల స్కూల్ ఫీజులు, ఆస్పత్రి బిల్లులు కట్టేవాడు కాదు. నా తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్లలతో మాట్లాడేందుకు అనిల్ ఒప్పుకునేవాడు కాదు. నన్ను ఎప్పుడు ఇంట్లో నుంచి పంపిద్దామా? అన్నదే అత్త, మామల ఆలోచన. పిల్లలు నేను హాల్లోనే ఉండేవాళ్లం. నిరంతరం వేధింపులకు గురి చేసేవారు. ఏమైనా అడిగితే ఇంటి నుంచి వెళ్లిపో అనేవారు. జీవితాన్ని త్యాగం చేయాలంటూ రాజయ్య కూడా అనేవారు. చాలామంది మహిళలు... భర్తలు, అత్తమామల కోసం జీవితాలను త్యాగం చేశారని రాజయ్య చెప్పేవారు. రాజయ్య మాటలకు చాలాసార్లు బాధపడ్డా. జీవితాన్ని ఇప్పటితో ముగించాలన్న ఆలోచన అనేకసార్లు వచ్చేది. ఈ షాక్, ఒత్తిళ్ల నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టేది.' అని సారిక పేర్కొంది. -
అన్నింటికీ ‘ఆధార’మే
అన్ని శాఖలూ విధిగా ఆధార్ అనుసంధానాన్ని అమలు చేయాలని మంత్రి వర్గం తీర్మానం సాక్షి, హైదరాబాద్: ఇకపై రాష్ట్రంలో అన్నింటికీ ఆధార్‌ను లింకు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ శాఖలు విధిగా ఆధార్ అనుసంధానాన్ని అమలు చేయాల్సిందేని నిర్ణయం తీసుకుంది. ఈమేరకు శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. సచివాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇందులో చర్చించిన అంశాలను మంత్రులు కె.అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు విలేకరులకు వెల్లడించారు. ప్రస్తుతం కొన్ని శాఖలు మాత్రమే ‘ఆధార్’ను అమలు చేస్తున్నాయని, ఇకపై అన్ని శాఖలూ విధిగా ‘ఆధార్’ను అనుసంధానం చేయాలని కేబినెట్ తీర్మానించినట్లు తెలిపారు. పౌర సరఫరాలు, పెన్షన్లకు గ్రామీణాభివృద్ధిశాఖ ఆధార్‌ను అమలు చేసి సత్ఫలితాలు సాధించాయని చెప్పారు. కొత్త ఈ-మెయిల్ విధానాన్ని కూడా అమలు చేయాలని తీర్మానించినట్టు తెలిపారు. ప్రభుత్వమే ఈ-మెయిల్‌ను క్రియేట్ చేసి గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి ఉద్యోగుల వరకు కామన్పూల్లో తీసుకుని ఉపయోగించుకునేలా విధానాన్ని రూపొందిస్తామని వివరించారు. విజయదశమి (అక్టోబర్ 22) పర్వదినాన రాజధానికి శంకుస్థాపన చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించాలని, అదే రోజుల పోలవరం ప్రాజెక్టు పనులను ఆయన చేత ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు జీవో 22, 63లలో కొన్ని సడలింపులు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టును ఆగస్టు 15లోగా పూర్తిచేసి, గోదావరి నీటిని ప్రకాశం బ్యారేజికి తరలించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆ మేరకు మిగులు నీటిని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రాయలసీమకు తరలిస్తామన్నారు. పోలవరం కుడికాలువ భూసేకరణకు రూ.701 కోట్లు కేటాయించామని, కాలువ పనులు శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశించామని చెప్పారు. విప్లవయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేయాలని లోక్‌సభ స్పీకర్, కేంద్ర మంత్రి మండలికి లేఖ రాయాలని తీర్మానించినట్లు తెలిపారు. విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే సమకూర్చుతుందని చెప్పారు. అల్లూరి జయంతిని ఏటా ఘనంగా నిర్వహించాలని నిర్ణయించామన్నారు. పారదర్శక పాలన అందించేందుకు అన్ని శాఖల అధికారులకు ట్యాబ్‌లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. అగ్రి గోల్డ్ బాధితులకు న్యాయం చేయడానికి విజిలెన్స్, సీఐడీ అధికారులు, చార్టెడ్ అకౌంటెంట్‌తో కమిటీని వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అగ్రి గోల్డ్ ఆస్తులను విక్రయించడం ద్వారా బాధితులకు పరిహారం చెల్లించడానికి ఈ కమిటీ చర్యలు తీసుకుంటుంది. ఘనంగా గోదావరి పుష్కరాలు.. గోదావరి పుష్కరాలను ఈనెల 14 నుంచి 25 వరకు ఘనంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. పుష్కరాల్లో రాష్ట్ర ప్రజలందరూ పాలు పంచుకునేలా ఈనెల 7 నుంచి 13 వరకూ గ్రామగ్రామాన ప్రచారం చేయాలని నిశ్చయించింది. ఈ ప్రచారంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలనూ వివరించనున్నారు. ఇందుకోసం మంత్రుల నేతృత్వంలో ప్రత్యేక కమిటీలను వేశారు. కమిటీల్లో ఆయా శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. గోదావరి పుష్కరాల ప్రాముఖ్యతపై వ్యాసరచన, చిత్రలేఖనం, వకృత్వ పోటీలు నిర్వహించి.. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో అవార్డులివ్వనున్నారు. పుష్కరాలకు కేంద్ర మంత్రులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, జాతీయ మీడియా ప్రతినిధుల్ని ఆహ్వానించడానికి మంత్రుల నేతృత్వంలో ఓ కమిటీని, హైకోర్టు న్యాయమూర్తులు, రాష్ట్రంలో మీడియా ప్రతినిధులను ఆహ్వానించడానికి మరో కమిటీని నియమించనున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్రపతికి ఫిర్యాదు * మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. విభజన చట్టంలోని సెక్షన్-8 అమలు, తెలంగాణ ప్రభుత్వం వ్యవహార శైలి, ఓటుకు నోట్లు తదితర అంశాలపై చర్చ జరిగినట్టు తెలిసింది. రాష్ట్రపతి హైదరాబాద్‌లో బసచేసిన నేపథ్యంలో ఆయనను నలుగురైదుగురు మంత్రులు కలసి సెక్షన్-8పై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ అనుసరిస్తున్న వైఖరిని వివరించాలని తీర్మానించారు. తెలంగాణకు చెందిన నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ మే 28న ఫిర్యాదు చేస్తే అంతకు ఐదురోజులు ముందుగా అంటే 23నే టీడీపీ ఎమ్మెల్యేలతోపాటు అధికారుల ఫోన్లు ట్యాప్ చేసేందుకు అనుమతివ్వాలంటూ నలుగురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల సంతకాలతో కేంద్రానికి టీప్రభుత్వం లేఖ రాసిన విషయాన్నీ ప్రస్తావించాలని నిర్ణయించారు. ఇకపై కంపెనీల చేతిలో మద్యం ధరలు * కర్ణాటక తరహా విధానం అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: మద్యం కంపెనీల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసే మద్యం ధరలను ఇక నుంచి ప్రభుత్వం నిర్ణయించకూడదని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. మద్యం ధరల విషయంలో కర్ణాటక తరహా విధానాన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు అధ్యక్షతన శనివారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఏర్పాటునకు ఆమోదం తెలిపింది. ఆదాయపు పన్ను బారిన పడకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ప్రభుత్వ తరుఫున మద్యం లావాదేవీలను కొనసాగిస్తుందని పేర్కొంటున్నారు. గృహ నిర్మాణ అక్రమాలపై సభాసంఘం సాక్షి, హైదరాబాద్: గత పదేళ్లనుంచి ఆంధ్రప్రదేశ్‌లో మంజూరైన 41 లక్షల ఇళ్లలో 15 లక్షల ఇళ్లు నిర్మాణం జరగలేదని, లబ్ధిదారుల పేర్ల మీద రూ.5,500 కోట్ల మేర దోపిడీ జరిగిందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు చెప్పారు. గృహ నిర్మాణంలో జరిగిన అక్రమాలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్ర మంత్రివర్గానికి శనివారం నివేదిక సమర్పించినట్లు చెప్పారు. గృహనిర్మాణంలో జరిగిన అక్రమాలపై సభాసంఘం నియమించేందుకు మంత్రివర్గ భేటీలో తీర్మానించామని, ఒకట్రెండు రోజుల్లో సభాసంఘం చైర్మన్ పేరును ప్రకటిస్తామని తెలిపారు. -
గవర్నర్ సాబ్.. డూండో జరా!
రాంపూర్: ‘సార్.. మా కుక్క తప్పిపోయింది. వెతికించండి. మా కోళ్లు పోయాయి. తెప్పించండి. మేకను దొంగిలించారు. ఇప్పించండి’ అంటూ ఎవరైనా గవర్నర్ అంతటి వ్యక్తిని అడుగుతారా? కానీ ఉత్తరప్రదేశ్ రాజ్‌భవన్‌కు ఇలాంటి విచిత్ర ఫిర్యాదులు వస్తున్నాయట! ఔదార్యంతో ఓ వ్యక్తికి సాయపడాలని గవర్నర్ రామ్ నాయక్ జోక్యం చేసుకోవడమే ఇప్పుడు సమస్యగా మారిందట! వివరాల్లోకెళితే... ఫర్హానుల్లాఖాన్కు చెందిన పన్నెండు కోళ్లు చోరీకి గురయ్యాయి. పోలీసులు పట్టించుకోకపోవడంతో గవర్నర్‌కు ఈ-మెయిల్లో ఫిర్యాదు చేశాడు. గవర్నర్ పోలీసులకు ఆదేశాలు జారీచేశారు. ఆ కోళ్ల జాడ ఇప్పటికీ తెలియలేదు. కానీ.. గవర్నర్‌కు అలాంటి విజ్ఞప్తులు మాత్రం వరుసగా మొదలయ్యాయి! ‘నూతన్(కుక్క)ను నా కన్నబిడ్డలా చూసుకున్నా. దాని కోసం ఇంట్లో ఏసీ కూడా పెట్టించా’ అంటూ రజ్మీక్ ఖాన్ అనే వ్యక్తి మొరపెట్టుకున్నాడు. ‘నా మేకను వెతికించేందుకు ఇంకా చర్యలు తీసుకోలేదు. కోళ్లు ఆఫ్ట్రాల్. మేక వాటికన్నా విలువైనది కదా’ అంటూ మోయిన్ పఠాన్ అనే వ్యక్తి అసహనం వ్యక్తంచేశాడు. ఇటీవలే కారును పోగొట్టుకున్న ఆర్ఎల్డీ రాంపూర్ శాఖ చీఫ్ దీనిపై మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోళ్లు, కుక్కలు, మేకలకే భద్రత లేదు. మనుషులకు ఉండాలని ఎలా ఆశిస్తారు?’ అంటూ చమత్కరించారు. అన్నట్టూ.. యూపీ మంత్రి ఆజమ్ ఖాన్‌కు చెందిన ఏడు గేదెలూ ఇటీవల చోరీకి గురయ్యాయి. మంత్రి గారి గేదెలు కదా.. ఏకంగా క్రైమ్‌బ్రాంచ్ పోలీసులే జాగిలాలతో సహా రంగంలోకి దిగి మరీ దొంగలను పట్టుకున్నారట! -
జీ20లో మోదీ వివరాలు లీక్
లండన్: ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో గత ఏడాది జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సుకు హాజరైన భారత ప్రధాని నరేంద్రమోదీ సహా 31 మంది ప్రపంచ దేశాల అగ్రనేతల వ్యక్తిగత వివరాలను అజాగ్రత్తగా లీక్ చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. సదస్సుకు హాజరైన అగ్రనేతల పేరు, పుట్టిన తేదీ, జాతీయత, పాస్‌పోర్ట్ నంబరు, వీసా నంబరు తదితర వివరాలతో కూడిన ఈ-మెయిల్‌ను.. ఆస్ట్రేలియా వలస విభాగంలోని ఒక ఉద్యోగి పొరపాటుగా.. ఆసియాన్ కప్ స్థానిక నిర్వహణ కమిటీ సభ్యుడు ఒకరికి పంపినట్లు గార్డియన్ దినపత్రిక తెలిపింది. ఆ కథనం ప్రకారం.. మోదీతో పాటు, అమెరికా అధ్యక్షుడు ఒబామా, రష్యా అధ్యక్షుడు పుతిన్, బ్రిటన్ ప్రధాని కామెరాన్ తదితర 31 దేశాల నేతల వివరాలు ఈ ఈ-మెయిల్లో ఉన్నాయి. దాన్ని అందుకున్న వ్యక్తి తక్షణమే తెలియజేయటంతో ఈ విషయాన్ని ఆస్ట్రేలియా వలస విభాగం ఉన్నతాధికారులకు నివేదించగా.. ఆ ఈ-మెయిల్ మరెవరికీ వెళ్లకుండా చర్యలు చేపట్టారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన లీక్ కాదని.. దీనివల్ల ఉత్పన్నమయ్యే పెద్ద సమస్యలు ఏవీ ఉండవని.. కాబట్టి ఈ విషయాన్ని ఆయా నేతలకు తెలియజేయాల్సిన అవసరం లేదని వలస విభాగం పేర్కొనటంతో మోదీ సహా ఆయా దేశాల నేతలు ఎవరికీ తెలియజేయలేదు. -
అమెజాన్ నుంచి బిజినెస్ ఈమెయిల్ సర్వీసులు
వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్‌కి దీటుగా కార్పొరేట్ వర్గాలకు క్లౌడ్ ఆధారిత ఈమెయిల్, క్యాలెండర్ సేవలు అందించనున్నట్లు ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ తెలిపింది. వర్క్మెయిల్ పేరిట తమ వెబ్ సర్వీసెస్ వ్యాపార విభాగం ద్వారా వీటిని అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొంది. ప్రతి యూజర్‌కి 50 గిగాబైట్ల మెయిల్‌బాక్స్ స్టోరేజి ఉంటుందని, ఇందుకు గాను ఒక్కో యూజర్‌కి నెలకు 4 డాలర్ల చొప్పున చార్జీ ఉంటుందని అమెజాన్ వివరించింది. ఈ సర్వీసు మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్‌తో కూడా ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. -
చిన్నా.. అమ్మానాన్న జాగ్రత్త
జీవితంలో ఎన్నో కోల్పోయాను.. ఇక నా జీవితం వృథా ఐదు రోజుల తర్వాత తమ్ముడికి ఈ-మెయిల్ సందేశం బెంగళూరుకు వె ళ్లిన ‘బీపీవో’ యజమాని అదృశ్యం జవహర్‌నగర్: ‘తమ్ముడు.. అమ్మానాన్న జాగ్రత్త..! జీవితంలో ఎన్నో కోల్పోయాను. ఇక నా జీవితం వృథా’ అంటూ జవహర్‌నగర్‌లో నివసించే లైట్బర్గ్ బీపీవో కంపెనీ యజమాని బాగోతుల లక్ష్మీనరసింహన్(27) తన తమ్ముడికి ఈ-మెయిల్ పెట్టాడు. ఐదు రోజుల క్రితం బెంగుళూరు వెళ్లిన అతడి జాడ కనిపించకుండా పోయింది. సీఐ వెంకటగిరి తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్‌నగర్‌లో బాగోతుల లక్ష్మీనరసింహన్ తన తల్లిదండ్రులతో కలసి ఉంటున్నాడు. ఈయన హైదరాబాద్ నేరెడ్‌మెట్‌లోని రాజ్ అన్నపూర్ణ అపార్ట్మెంట్లో బీపీవో కంపెనీ నిర్వహిస్తున్నాడు. ఈనెల 11న బెంగళూరు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరాడు. అనంతరం ఆఫీస్‌కు చేరుకొని సాయంత్రం బెంగళూరుకు వెళ్లాడు. రెండు రోజుల తర్వాత కుటుంబీకులు లక్ష్మీనరసింహన్కు కాల్ చేయగా ఫోన్ స్విచాఫ్ వస్తోంది. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు శుక్రవారం రాత్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా ఇటీవల లక్ష్మీనరసింహన్కు వివాహ సంబంధాలు చూస్తున్నామని, తమకు ఎవరూ శత్రువులు లేరని కుటుంబీకులు తెలిపారు. ఇదిలా ఉండగా, శుక్రవారం లక్ష్మీనరసింహన్ తమ్ముడు నాగకుమార్ మెయిల్‌కు అన్న నుంచి సందేశం వచ్చింది. ‘ చిన్నా టేక్ కేర్ మామ్ అండ్ డాడ్, యూ బీ ఓన్లీ సోర్స్ ఫర్ దెమ్, ఫ్రమ్ నౌ ఆన్.. ఐయామ్ లూజర్ అండ్ ఐ కెనాట్ లైవ్ లైక్ ఏ లూజర్, ఐయామ్ సారీ, మిస్ యూ ఆల్’ అని లక్ష్మీనరసింహన్ తన మెయిల్లో పేర్కొన్నాడు. కాగా లక్ష్మీనరసింహన్ ఆర్థిక ఇబ్బందులతో అదృశ్యమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బెంగళూరు పోలీసులతో కలసి కేసును ఛేదిస్తామని సీఐ వెంకటగిరి తెలిపారు. కాగా కుమారుడి అదృశ్యంతో లక్ష్మీనరసింహన్ తల్లిదండ్రులు సీతామహలక్ష్మి, రాధాకృష్ణ మూర్తి కన్నీటిపర్యంతమవుతున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఈమెయిల్‌ను కనుగొన్నది ఎవరో తెలుసా?
ఈమెయిల్‌ను ఎవరు కనుగొన్నారో తెలుసా.. భారతీయుడే!! అవును.. భారత అమెరికన్ శాస్త్రవేత్త వి.ఎ. శివ అయ్యదురై అనే శాస్త్రవేత్త ఈమెయిల్‌ను తొలిసారిగా 32 ఏళ్ల క్రితం కనుగొన్నారు. అమెరికా ప్రభుత్వం కోసం 1982 ఆగస్టు 30వ తేదీన ఆయన తొలిసారి ఎలక్ట్రానిక్ మెయిల్ సిస్టమ్ అనే కంప్యూటర్ ప్రోగ్రాంను కనుగొన్నారు. అప్పట్లో న్యూజెర్సీలోని లివింగ్టన్ హైస్కూల్లో చదువుకొంటున్న అయ్యదురై.. అక్కడి యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ అండ్ డెంటిస్ట్రీ కోసం ఈ మెయిల్‌ను కనుగొనేందుకు పరిశోధనలు మొదలుపెట్టారు. వాస్తవానికి ఆయన 1978లోనే కేవలం కార్యాలయంలోనే పంపుకొనే వీలున్న పూర్తిస్థాయి మెయిల్ వ్యవస్థను రూపొందించి, దానికి 'ఈ-మెయిల్' అని పేరుపెట్టారు. అయితే 1982లో దానికి కాపీరైట్ లభించింది. ఆ సమయంలో కాపీరైట్ పేటెంటు హక్కుతో సమానం. సాఫ్ట్వేర్ ఆవిష్కరణలను రక్షించుకోడానికి అంతకంటే మార్గం ఉండేది కాదు. ఆయన చేసిన పరిశోధనలకు గాను 1981లో అయ్యదురైకి వెస్టింగ్‌హౌస్ సైన్స్ టాలెంట్ సెర్చ్ అవార్డు లభించింది. అయితే.. ఆయనే ఈమెయిల్‌ను కనుగొన్నా.. కంప్యూటర్ చరిత్రలో మాత్రం వేరేవాళ్లు కూడా తామే కనుగొన్నట్లు చెబుతుండటంతో కొంత వివాదం ఏర్పడి ఆయన పేరు పెద్దగా బయటకు రాలేదు. -
మీ చెయ్యే.. మీ ఫోన్ స్క్రీన్..!
మీరు డ్రైవింగ్‌లో ఉన్నారు.. ఈలోగా మీ ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది.. ఫోన్ తీయకుండానే దాన్ని మీ చేతిపైనే చూసుకోగలిగితే.. బావుంటుంది కదూ? త్వరలోనే ఇది నిజం కానుంది. టైమ్తోపాటు ఈమెయిల్స్, ఎస్సెమ్సెస్‌లు, ఫేస్బుక్ పోసు ్టలు, నోటిఫికేషన్లు, రిమైండ ర్లు.. వీటన్నింటినీ కూడా చేతిపైనే చూసుకోవచ్చు. ‘రిటా ట్’ అనే ప్రొజెక్షన్ వాచ్‌తో ఇది సుసాధ్యం కానుంది. దీనిని చేతికి పెట్టుకుని, బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేసుకుంటే చాలు.. మన చెయ్యే ఫోన్ స్క్రీన్ అయిపోతుంది. టైమ్ చూడాలనుకుంటే ఒక్కసారి చేతిని ఊపితే సరిపోతుంది. ఏదైనా నోటిఫికేషన్ వస్తే.. ఈ వాచ్ వైబ్రేట్ అవుతుంది. ఎవరైనా ఫోన్ చేసినా, ఆ వివరాలు చేతిపై ప్రత్యక్షమైపోతాయి. ఉక్రెయిన్‌కు చెందిన మైకేల్ మెడ్విడ్ ఈ ప్రొజెక్టర్ వాచ్‌ను రూపొందించాడు. దీని ధర దాదాపు రూ.7వేలు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఇది అందుబాటులోకి రానుంది. -
గ్రామర్ చెకింగ్ కోసం...
ఇంగ్లిష్ రాయడంలో ఎన్నో అక్షరదోషాలు, వ్యాకరణ సంబంధమైన తప్పులు దొర్లుతూంటాయి. ఈ తప్పులేవీ లేకుండా చూసుకోవాలనుకుంటే జింజర్ పేజ్ అండ్ గ్రామర్ కీబోర్డు అప్లికేషన్‌ను స్మార్ట్‌ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. కేవలం వ్యాకరణం, అక్షరదోషాలు మాత్రమే కాకుండా ఈ అప్లికేషన్ సమానార్థకాలు, కొన్ని పదాలకు సంబంధించిన నిర్వచనాలు కూడా అందిస్తుంది. టెక్ట్స్‌ను మాటల్లో వినిపించేందుకూ పనికొస్తుంది. వాక్యాలను ఎలా అర్థవంతంగా తిరగరాయాలో కూడా సూచిస్తుంది. కామా, సెమీకోలన్ వంటి గుర్తులను ఎక్కడ ఉంచాలో కూడా పొందుపరిచారు. ఇంగ్లీషు భాషలోని సమాచారాన్ని దాదాపు 40 భాషల్లోకి తర్జుమా చేసేందుకు కూడా ఇందులో ఏర్పాట్లు ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం... ఈమెయిల్, నోట్ వంటివాటిని చక్కటి ఇంగ్లీషులో పంపేందుకు, సోషల్‌మీడియాలో పంచుకునేందుకు ఈ అప్లికేషన్‌ను ఉపయోగించడం మొదలుపెట్టండి మరి...! మెయిళ్లన్నీ ఒక్కదాంట్లో... మనలో చాలామందికి ఒకటికంటే ఎక్కువ ఈమెయిళ్లు ఉండటం సహజం. ప్రతిదాన్ని వేర్వేరుగా ఓపెన్ చేసుకుని మెయిళ్లు చదవడం బోర్ కొట్టిస్తూంటే స్మార్ట్‌ఫోన్‌లో మెయిల్వైజ్ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకోండి. అన్నింటిని ఒకదగ్గరే చూసుకోవచ్చు. మెయిళ్లు పంపుకోవచ్చు కూడా. అంతేకాకుండా ఫార్వర్డ్ చేసిన మెయిళ్లలోని అనవసరమైన క్యారెక్టర్లన్నింటినీ తొలగించి క్లీన్‌గా ఒక సంభాషణ క్రమంలో అమర్చడం కూడా ఈ అప్లికేషన్ ప్రత్యేకత. ఇది పూర్తిగా క్లయింట్ సైడ్ అప్లికేషన్ కావడం వల్ల సమాచారం ఎక్కడో సెర్వర్లలో కాకుండా మీ ఫోన్లోనే స్టోర్ అవుతుంది. ఫలితంగా మన సమాచారం లీక్ అవుతుందని లేదా దుర్వినియోగం అవుతుందన్న బెంగ ఉండదు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాక్టివేట్ చేసుకోవడమూ సులువే. కాకపోతే యాక్టివేట్ చేసిన తొలి 24 గంటల్లో కొంచెం నెమ్మదిగా పనిచేస్తుందని, ఆ తరువాత వేగం పుంజుకుంటుందని డెవలపర్స్ అంటున్నారు. -
రెండో పెళ్లిని ఆపిన ఈ-మెయిల్
చెన్నై: విదేశాల్లో ఉన్న భార్యను మోసపుచ్చి రెండోపెళ్లికి సిద్ధమైన భర్తను ఆమె ఈ- మెయిల్ ద్వారా అడ్డుకుంది. ఈ సంఘటన తమిళనాడులోని తిరుచ్చిరాపల్లిలో చోటుచేసుకుంది. శ్రీలంకకు చెందిన శాంతివాసన్ (33) కెనడాలోని ఒక ప్రైవేటు కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో పనిచేస్తున్న శ్రీలంకకు చెందిన సీతతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. వారిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో తిరుచ్చిలో ఉన్న మాజీ ప్రేయసిని పెళ్లి చేసుకుంటానని భర్త, ఎలా చేసుకుంటావో చూస్తానంటూ భార్య సవాళ్లు విసురుకున్నారు. కెనడా నుంచి ఇటీవల తిరుచ్చికి వచ్చిన శాంతివాసన్... సంఘమి(26)ని ఈనెల 4వ తేదీన రిజిష్టరు వివాహం చేసుకున్నాడు. అనంతరం ఈ నెల 9వ తేదీన సంప్రదాయ రీతిలో పెళ్లి చేసేందుకు వధువు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సమాచారం అందుకున్న కెనడాలోని శాంతివాసన్ భార్య సీత ఈ మెయిల్ ద్వారా తిరుచ్చి పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన కమిషనర్ కంటోన్మెంటు పోలీసులకు ఆదేశాలు ఇవ్వడంతో విచారణ చేపట్టారు. సీత తాను సహజీవనం చేశామని, తమకు ముగ్గురు పిల్లలు ఉన్నట్లు శాంతివాసన్ అంగీకరించడంతో పోలీసులు పెళ్లిని ఆపేశారు. -
ఇంటర్నెట్ లో మాయగాళ్లు
సాక్షి,హైదరాబాద్: ‘కంగ్రాట్స్ మా సంస్థ మిమ్మల్ని అవార్డు గ్రహీతగా ఎంపిక చేసింది. విదేశాల్లో జరిగే పసందైన వినోద కార్యక్రమంలో పాల్గొనేందుకు సంస్థ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తాం’ ఇటీవల నగరంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ మెయిల్‌కు వచ్చిన సందేశం ఇది. ‘లండన్‌లోని ఓ ధనవంతురాలికి సంతానం లేదు. ఆమె మిమ్మల్ని దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చింది. ఇక ఆమె ఆస్తికి మీరే వారసులు’ ఇది ఓ ప్రైవేట్ ఉద్యోగికి వచ్చిన సందేశ సారాంశం. ‘మీకు ఐదు కోట్ల రూపాయల విలువైన అంతర్జాతీయ లాటరీ తగిలింది. ఆ మొత్తం పొందడానికి సంస్థ నిబంధనల మేరకు రూ.60 వేలు ముందుగా చెల్లిస్తే చాలు’ అన్న సందేశం మరో యువకుడి మెయిల్లో ప్రత్యక్షమైంది. ఇలాంటి సందేశాలను చూసి ముందూ వెనుకా ఆలోచించకుండా కొందరు అందిన చోటల్లా అప్పులు చేసి ఈ-మెయిల్లో పేర్కొన్న బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేశారు. వారం రోజులు ఎదురు చూసినా ఎటువంటి సమాచారం అందకపోవడంతో వివరణ కోరుతూ మెయిల్ వచ్చిన చిరునామాకు లేఖ పంపా రు. అయినా సమాధానం లేదు. అప్పుడు తాను మోసపోయానని గ్రహించి ఘొల్లుమన్నారు. ఇలాంటి హై టెక్ మోసాలు చేసేందుకు కొన్ని వ్యవస్థీకృత ముఠాలు ఏర్పడ్డాయి. ‘ఈ-మాయగాళ్లు’ వ్యవహారం తెలియక అనేక మంది అమాయక ప్రజలు తాము సంపాదించిన సొమ్మును చేజేతులా పోగొట్టుకుంటున్నారు. సెల్‌ఫోన్లలోనూ.. నిత్య జీవనంలో తప్పనిసరి వస్తువుగా మారిన సెల్ఫోన్లు కూడా ఈ కేటుగాళ్లకు వరంలా మారిపోయాయి. పలు ఆకర్షణీయ బహుమతులున్నాయని నచ్చిన వారితో స్నేహం చేసే వీలుంటుందని ఆకర్షిస్తూ భారీగానే సొమ్ము చేసుకుంటున్నారు. నెట్ బ్యాంకింగ్ ద్వారా ప్రజల సొమ్మును కాజేసేందుకు నకిలీ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. నగరంలో గతంలో జరిగిన ఇలాంటి మోసాలకు మూలం నైజీరియన్, ఉత్తరాదికి చెందిన ముఠాలని సైబర్ క్రైమ్ పోలీసుల విచారణలో వెల్లడవుతోంది. పోలీసులు ఇలాంటి మోసగాళ్లకు చెక్ పెడుతున్నా అక్కడక్కడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే అనుమానాస్పద సందేశాలు వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచన. -
సుప్రీం కోర్టుకు ఈమెయిల్ చేయొచ్చు
లైంగిక వేధింపుల ఫిర్యాదుల స్వీకరణకు మెయిల్ ఐడీ న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆవరణలో చోటుచేసుకునే లైంగిక వేధింపుల ఉదంతాలను పరిశీలిస్తున్న కోర్టు కమిటీ(జీఎస్ఐసీసీ).. బాధితులు ఫిర్యాదు చేయడానికి సులువైన మార్గాన్ని చూపింది. సుప్రీంకోర్టు ఆవరణలో జరిగే ఈ వేధింపులపై ఫిర్యాదులను కోర్టుకు ఈమెయిల్, రిజ్స్టర్డ్ పోస్టు, కొరియర్ల ద్వారా పంపేందుకు అనుమతించాలని నిర్ణయించింది. ‘లింగ చైతన్యం, సుప్రీంకోర్టు వద్ద మహిళలపై లైంగిక వేధింపులు(నిరోధం, నిషేధం, పరిష్కారం.. జీఎస్ఐసీసీ)’లోని 2ఏ నిబంధన ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. బాధితులు తమ ఫిర్యాదులను కమిటీ కార్యదర్శి, రిజిస్ట్రార్ రచనా గుప్తకు వ్యక్తిగతంగానే కాకుండా ఆమె ఈమెయిల్ ఐడీ gupta.rachna@indianjudiciary.gov.in కి కూడా పంపొచ్చని ఓ సర్క్యులర్‌లో తెలిపింది. గత ఏడాది నవంబర్‌లో ఏర్పాటైన తమ కమిటీకి ఇప్పటికి వరకు ఇద్దరు మహిళా న్యాయవాదుల నుంచి రెండు ఫిర్యాదులు అందాయంది. -
నైజీరియన్ల ‘నయా’వంచన
ఆధునిక పంథాలో పంజా విసిరిన నల్లజాతీయులు సహకరిస్తున్న ఉత్తరాదికి చెందిన కొందరు యువకులు దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లో ఆన్లైన్ ద్వారా టోకరా ఆరుగురిని అరెస్టు చేసిన సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: లాటరీ తగిలిందంటూ ఎస్సెమ్మెస్ పంపి... ఆస్తి అప్పగిస్తామంటూ ఈ-మెయిల్ చేసి... ఉద్యోగం దొరికిందంటూ సంప్రదించి... ఇప్పటి వరకు ఇలాంటి చర్యల ద్వారానే సైబర్ నేరాలకు పాల్పడుతున్న నైజీరియన్లు తమ పంథా మార్చారు. పోలీసులు కూడా అవాక్కయ్యే రీతిలో వ్యవస్థీకృతంగా ‘నయా’వంచనకు పాల్పడ్డారు. దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో పంజా విసిరి రూ.కోట్లల్లో కొల్లగొట్టిన ముఠాకు చెందిన ఆరుగురిని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ఐదుగురు నైజీరియన్లు కాగా, ఒకరు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తులని పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ వెల్లడించారు. అదనపు కమిషనర్ సందీప్‌శాండిల్య, సంయుక్త కమిషనర్ బి.మల్లారెడ్డి, క్రైమ్స్ డీసీపీ జి.పాలరాజుతో కలిసి శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్వాల్ పూర్తి వివరాలు వెల్లడించారు. అద్దె ఇంటి నుంచి కరెంట్ ఖాతా వరకు... నైజీరియన్లతో జట్టు కడుతున్న ఉత్తరాదికి చెందిన కొందరు యువకులు అనేక విధాలుగా సహకరిస్తున్నారు. ఈ స్కామ్‌కు సంబంధించి బ్యాంక్ ఖాతాలు తెరవడం, సిమ్‌కార్డులు కొనుగోలు చేయడం, సంప్రదింపులు జరపడంలాంటి సాయం చేసిపెడుతున్నారు. ముఠాలకు నేతృత్వం వహిస్తున్న నైజీరియన్లు వీరికి కొంత మొత్తం ఇచ్చి పంపిస్తున్నారు. ఓ నగరానికి చేరుకున్న తరవాత ఆయా గుర్తింపుకార్డుల్ని చూపిస్తున్న వీరు వ్యాపారం కోసం వచ్చామంటూ ఇళ్లు అద్దెకు తీసుకుంటున్నారు. బ్యాంకుల పేరుతోనే నకిలీ సైట్స్ సృష్టించి... వివిధ బ్యాంకుల పేర్లను పోలిఉండే యూఆర్‌ఎల్స్‌తో వెబ్‌సైట్స్ రూపొందిస్తున్నారు. ఆన్లైన్లోనే కొన్ని సంస్థల ద్వారా సేకరించిన ఈ-మెయిల్ ఐడీలకు వీటిని వినియోగించి ఒకేసారి భారీగా మెయిల్స్ పంపుతున్నారు. ఈ-మెయిల్స్ రిసీవ్ చేసుకున్న వారిలో సదరు బ్యాంక్ ఖాతా కలిగిన వారుంటే ఓపెన్ చేస్తున్నారు. ఈ బోగస్ వెబ్సైట్ సైతం అసలు దాని మారిదిగానే ఉండటంతో బాధితులు మోసపోయి అందులో కోరిన వివరాలను నింపేస్తున్నారు. ఇలా ఖాతాదారుడికి చెందిన పూర్తి సమాచారం నేరగాళ్లకు చేరిపోతోంది. సాంకేతిక దర్యాప్తుతో పట్టిన సీసీఎస్... ఈ పంథాలో హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, తమిళనాడు, గుజరాత్‌ల్లో అనేక మందిని ముంచి రూ.కోట్లలో స్వాహా చేసిన ముఠాను సాంకేతిక దర్యాప్తు ద్వారా సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. గత ఏడాది డిసెంబర్లో సంఘ్వీ కార్పొరేషన్ బ్రాంచ్ మేనేజర్ కైలాష్‌నాథ్ సేథ్ తన ప్రమేయం లేకుండా తన ఖాతా నుంచి రూ.5 లక్షలు కాన్పూర్‌కు చెందిన విక్రమాదిత్య అనే వ్యక్తి ఖాతాలోకి ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ అయ్యాయంటూ ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ క్రమంలో వాడిన నాలుగు ఫోన్ నెంబర్లను గుర్తించారు. ఈ ఫోన్ల ఐఎంఈఐ నెంబర్లను విశ్లేషించగా ఇప్పటి వరకు ఈ నాలుగింటిలో 154 సిమ్స్ వేసి వాడారని తేలింది. దర్యాప్తు చేసిన అధికారులు కాన్పూర్‌కు చెందిన జైదీప్ పట్వర్థన్ పాత్రను అనుమానించారు. అతడు బెంగళూరులో ఉన్నాడని గుర్తించిన ప్రత్యేక బృందం వలపన్ని అతడితో పాటు సూత్రధారులైన నైజీరియన్లు సునే ఒఛే ఒజామా, మైఖేల్ అనింబా, ఒనియెగ్బునా ఒడోచుక్కు, నవాంజోండి అమేజీ ఒబేద్, టినైల్ యూసుఫ్ ఒలాతుంగిలను 5న అరెస్టు చేశారు. ఈ ఆరుగురినీ శుక్రవారం కస్టడీలోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ల్యాప్‌టాప్స్‌లో 100 ఖాతాల వివరాలు... ఈ నిందితుల నుంచి పోలీసులు రెండు ల్యాప్టాప్స్, మూడు డేటా కార్డులు, ఆరు ఫోన్లు, 20 సిమ్‌కార్డులు, ఓ కారుతో పాటు మూడు పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 100 మంది ఖాతాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయని గుర్తించారు. ఓటీజీఎస్ ద్వారా స్వాహాకు సిద్ధపడిన మరో రూ.61 లక్షలున్న బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేశారు. ఈ ముఠా నెల రోజుల్లో నగరంలోని వివిధ బ్యాంకుల్లో 38 ఖాతాలు తెరినట్లు గుర్తించారు. ఐదు రాష్ట్రాల పోలీసులకు వీరు వాంటెడ్‌గా ఉండటంతో వారికి అరెస్టుపై సమాచారం ఇవ్వనున్నారు. విచారణ తరవాత స్వాహా అయిన మొత్తం తెలుస్తాయని కొత్వాల్ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. -
తాకట్టుకు టౌన్‌హాల్
= వడ్డీలు చెల్లించలేని దుస్థితిలో బీబీఎంపీ.. సాక్షి ప్రతినిధి, బెంగళూరు : సమాజంలో దివాళా తీసిన వాడిని గురించి ‘వడ్డీకి వడ్డీ కట్టి మునిగిపోయాడు’ అని చెప్పడం సహజం. ఘనత వహించిన బృహత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీఎంపీ)ను ఇప్పుడు ఆ విధంగానే పిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పులు, వడ్డీలు చెల్లించలేక ఏకంగా నగరంలోని ప్రతిష్టాత్మక టౌన్ హాలును తాకట్టు పెట్టడానికి బీబీఎంపీ సిద్ధమైంది. ఆర్థిక పరంగా ఇప్పటికే పీకల లోతు కష్టాల్లో మునిగిపోయిన బీబీఎంపీ, ప్రస్తుతం టౌన్ హాలును తాకట్టు పెట్టాలని నిర్ణయించడంపై సర్వత్రా విమర్శల పాలవుతోంది. కెనరా బ్యాంకు నుంచి 2010లో తీసుకున్న రుణాన్ని చెల్లించలేక, టౌన్ బ్యాంకును అదే బ్యాంకుకు తాకట్టు పెట్టడం ద్వారా రుణ విముక్తం కావాలని బీబీఎంపీ నిర్ణయించింది. సోమవారం జరిగిన బీబీఎంపీ సర్వ సభ్య సమావేశంలో ఈ మేరకు సర్క్యులర్‌ను కూడా ప్రవేశపెట్టింది. నగరంలో ప్రాథమిక సదుపాయాల కల్పన కోసం చెల్లింపు హుండీల ద్వారా బీబీఎంపీ కెనరా బ్యాంకు నుంచి ఓవర్‌డ్రాఫ్ట్ రూపంలో రూ.155 కోట్లు తీసుకుంది. దీనికి 14 శాతం వడ్డీని కలుపుకొంటే ప్రస్తుతం ఆ మొత్తం రూ.200 కోట్లకు చేరుకుంది. ఎంతకూ ఈ మొత్తాన్ని చెల్లించక పోవడంతో కెనరా బ్యాంకు ఈ లావాదేవీని ఎన్పీఏ (నిరర్థక ఆస్తి)గా పరిగణించింది. పరువు పోతుందని గ్రహించిన బీబీఎంపీ ఈ గండం నుంచి బయటపడే మార్గం చెప్పాల్సిందిగా బ్యాంకును కోరింది. కెనరా బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న టౌన్ హాలుతో పాటు దాని పక్కనున్న పార్కింగ్ ప్రదేశాన్ని తాకట్టుగా పెడితే ఎన్పీఏ ముద్ర పడకుండా చూస్తామని బ్యాంకు సూచించింది. పైగా రుణ మొత్తంలో రూ.45 లక్షల రాయితీ కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. ఇదేదో చక్కని ఐడియా అని భావించిన బీబీఎంపీ, తాకట్టుకు సిద్ధమైంది. దీనిపై బీబీఎంపీ కమిషనర్ లక్ష్మీ నారాయణ సీఎం క్యాంప్ కార్యాయం కృష్ణాలో సిద్ధరామయ్యతో గురువారం చర్చించారు. అయితే టౌన్ హాలు కాకుండా వేరే ఏదైనా భవనాన్ని తాకట్టు పెట్టాలని సీఎం సూచించినట్లు సమాచారం. దీంతో బీబీఎంపీ సందిగ్ధంలో పడింది. ఘన చరిక్రత టౌన్ హాలుకు ఘన చరిత్ర ఉంది. 1933లో అప్పటి మైసూరు మహారాజు క ృష్ణరాజ ఒడయార్ ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1935 సెప్టెంబరు 11న నిర్మాణం పూర్తయింది. అప్పటి మహారాజు కంఠీరవ నరసింహ రాజ ఒడయార్ దీనిని ప్రారంభించారు. ఇందులో కార్యక్రమాలను 1,038 మంది కూర్చుని తిలకించే అవకాశం ఉంది. -
జనం నెత్తిన గ్యాస్ బండ
నర్సీపట్నం, న్యూస్‌లైన్ : ఓవైపు చమురు కంపెనీలు ఎడాపెడా చమురు, గ్యాస్ ధరలు పెంచుతూ వినియోగదారుడిని బాదేస్తూ, బాధిస్తూ ఉంటే, స్థానికంగా తామేం తక్కువ తిన్నామన్న చందంగా గ్యాస్ ఏజెన్సీలు నిబంధనలను అతిక్రమించి మరింత భారం మోపుతున్నాయి. రవాణా చార్జీల పేరుతో వినియోగదారులందరి నుంచి రుసుము వసూలు చేస్తూ అయినకాడికి దోచుకుంటున్నాయి. నిబంధనల ఉల్లంఘన : ప్రస్తుతం 14.2 కిలోల గ్యాస్ ధర రూ. 402 ఉంది. సిలెండర్‌ను ఏజెన్సీ నుంచి ఐదు కిలోమీటర్ల లోపు వినియోగదారులకు అందజేస్తే ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయరాదని నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. అయితే గ్యాస్ ఏజెన్సీలు వీటిని ఖాతరు చేయడం లేదు. ఐదు కిలోమీటర్లకు లోబడి నివసిస్తున్న వారికి గ్యాస్ సరఫరా చేసినా ధరకు అదనంగా రూ. 22 వసూలు చేస్తున్నారు. దీన్ని బట్టి లెక్కిస్తే నర్సీపట్నంలో ఉన్న సుమారు 20 వేల మంది వినియోగదారుల నుంచి ప్రతి నెలా రూ. 4.5 లక్షలు వసూలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న వారి నుంచి మరింత ఎక్కువ వసూలు చేస్తూ అదనపు బారం మోపుతున్నారు. కొత్త కనెక్షన్ కష్టాలు : వినియోగదారులెవరైనా కొత్తగా కనెక్షన్ తీసుకుంటే ఏజెన్సీ నిర్వాహకుల పంట పండినట్టే. తాము చెప్పే కంపెనీకి చెందిన స్టవ్‌ను, ఇతర సామగ్రిని కొంటేనే కనెక్షన్ ఇస్తామని షరతులు పెడుతున్నారు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇష్టం లేకపోయినా నిర్వాహకులు విధించిన షరతులకు లోబడి వస్తువులు కొనుగోలు చేసి కనెక్షన్ పొందాల్సి వస్తోంది. వినియోగదారుల సమస్యలను ఏజెన్సీలు పట్టించుకోకపోవడంతో ప్రజలు నిత్యం నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఇలా వ్యవహరిస్తున్న ఓ గ్యాస్ ఏజెన్సీపై వినియోగదారుల సంఘం కార్యదర్శి పి.శ్రీనివాసరావు ఇటీవల పెట్రోలియం సంస్థకు ఈ-మెయిల్ ద్వారా పిర్యాదు చేశారు కూడా. మరి అధికారులు ఏ రీతిన స్పందించి సమస్యలు పరిష్కరిస్తారో చూడాలి.