ఏడాదికి 4 సిబిల్ రిపోర్టులు!
రూ.1,200 సబ్‌స్క్రిప్షన్‌తో...
సిబిల్ తాజాగా తన కస్టమర్ల కోసం సబ్‌స్క్రిప్షన్ సర్వీసులను ప్రారంభించింది. రూ.1,200తో సంవత్సరంలో త్రైమాసికానికి ఒకసారి చొప్పున నాలుగు సిబిల్ రిపోర్ట్‌లను పొందొచ్చు. దీని ద్వారా అప్ టు డేట్ క్రెడిట్ స్కోర్ వివరాలు కలిగి ఉండొచ్చు. దీనికోసం https://www.cibil. com.creditscore వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అక్కడ మనకు మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. ఒక రిపోర్ట్ (వన్‌టైమ్ ఆప్షన్, రూ.550), రెండు రిపోర్టులు (బైయాన్వల్ ఆప్షన్, రూ.800), నాలుగు రిపోర్ట్‌లు (క్వార్టర్లీ ఆప్షన్, రూ.1,200). వీటిల్లో ఏ ఆప్షన్‌నైనా ఎంచుకోవచ్చు.
అవసరమైన వివరాలు అందజేసి, ఫీజు చెల్లిస్తే సిబిల్ రిపోర్ట్స్ ఈ–మెయిల్‌కు వస్తాయి. రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు, స్కోర్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని భావించేవారు, సిబిల్ స్కోర్‌ను మెరుగుపరచుకోవాలనుకునే వారు క్వార్టర్లీ సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. దీని ద్వారా వారు నిర్దిష్ట కాలంలో రిపోర్ట్స్‌ను పొందుతారు. మీరు ఒక సిబిల్ రిపోర్ట్ కోసం రూ.550 చెల్లించాలి. తర్వాత మళ్లీ సంవత్సరంలోపే వేరొక రిపోర్ట్ కావాలంటే మళ్లీ రూ.550 కట్టాలి. అప్పుడు సంవత్సరానికి రూ.1,100 అవుతుంది. అలాంటప్పుడు క్వార్టర్లీ సబ్‌స్క్రిప్షన్ అప్షన్ ఎంచుకుంటే బాగుంటుంది. ఇక్కడ రూ.1,200తో నాలుగు రిపోర్ట్‌లు పొందొచ్చు. అయితే తొలిసారి సిబిల్ స్కోర్‌కు దరఖాస్తు చేసుకునే వారు వన్‌టైమ్ రిపోర్ట్ తీసుకోవడం ఉత్తమం.