
మౌనాన్ని వీడే మార్గమే లేదా?!
నాకు చిన్నప్పట్నుంచీ మొహమాటం ఎక్కువ. ఎవ్వరితోనూ ఎక్కువ మాట్లాడను. కొంచెంసేపు మాట్లాడితే ఇక ఆ సంభాషణను కొనసాగించలేను. ఆ సంభాషణ వల్ల కలిగే పర్యవసానానికి భయపడి మౌనంగా అయిపోతాను. ఈ పరిస్థితి మారేదెలా?
- అఖిల్, మెయిల్
మొహమాటం వేరు, ఎవ్వరితోనూ మాట్లాడలేకపోవడం వేరు. ముందు ఆ విషయంలో క్లారిటీతో ఉండండి. సంభాషణ ఎలా ఉండాలో రామాయణంలో చక్కగా వివరించాడు వాల్మీకి. క్లుప్తంగా, సాగతీతలు లేకుండా, మృదువైన కంఠస్వరంతో, వర్ణోత్పత్తి స్థానాలైన హృదయ, కంఠాలను ఆశ్రయించి, ప్రతి అక్షరం మధ్యమ స్వరంలో పలకాలట. సంభాషణ నాలుగు రకాలు. మాటల కుంభ వృష్టి (అవసరం లేక పోయినా మాట్లాడటం), అనావృష్టి (అవసరం ఉన్నప్పుడు కూడా మాట్లాడలేకపోవడం), పూర్తిగా రిజర్వ్‌డ్‌గా ఉండటం, అవసరమైన మేరకు క్లుప్తంగా మాట్లాడటం. మీకు మాట్లాడటం రాదని, మీలో ఏదో తక్కువని చిన్నప్పుడు మీకు ఎవరో చెప్పి వుంటారు.
వయసుతో పాటు ఆ న్యూనతా భావం మీలో పెరిగి ఉండొచ్చు. ఆ బరువు వదిలించుకుంటే మనసు తేలిక అవుతుంది. మొహమాటం, కాంప్లెక్స్‌లతో బాధపడేవారు కాస్త మార్పు ద్వారా ఆ మానసిక రోగాల నుంచి బయట పడవచ్చని సైకాలజిస్టులు చెబుతారు. అటు వంటి మార్గదర్శక సూత్రాలు మీ కోసం. జు మీతో మీరు ఎక్కువ సమయం గడపండి. ఇతరుల ప్రేమకై ఆరాటం తగ్గుతుంది. నాకె వరూ లేరే అని బాధపడటం ఒంటరితనం. నాకు నేనున్నానని సంతో షించడం ఏకాంతం. ప్రకృతి అందాల్ని, పక్షుల శబ్దాల్ని, గాలి సంగీ తాన్ని, ముఖేష్ పాటని, మీ ఉనికిని మీరు ఆనం దించడమే ఏకాంతం. పుస్తకాల్ని, ప్రార్థనని, ప్రకృతిని, పాటల్ని, తోటల్ని ప్రేమించేవాడు వృథా పరిచయాల కోసం పాకు లాడడు. జు ధీమాగా బతకండి.
మీ ఆలోచనలు వంకరగా లేనంత కాలం మీ వంకర పళ్ల గురించి ఎవరూ పట్టించుకోరు. జు నీ అనుమతి లేకుండా నిన్నె వరూ చిన్నబుచ్చలేరు అంటాడు బాల్యంలోనే పోలియోతో రెండు కాళ్లూ పోగొట్టుకున్న అమె రికన్ ప్రెసిడెంట్ రూల్‌వెల్ట్. నువ్వెలా ఉంటే బావుంటావో నీ చెవిలో జోరీగలాగా నిరంతరం నిన్ను సాధించే మనిషి, నీలోనే ఒకడుంటాడు. అతడికీ నీకూ మధ్య గొడవ తగ్గేకొద్దీ నీ మీద నీకు ప్రేమ, నమ్మకం పెరుగుతాయి. ఇక ప్రైవేట్ కమ్యునికేషన్‌లో ఈ అంశాలు దృష్టిలో పెట్టుకోండి. 1. ఎప్పుడు జోక్ చెయ్యాలి, ఎప్పుడు సీరియస్‌గా ఉండాలి?; 2. పరిచయం ఎక్కువయ్యేకొద్దీ అతిగా సంభాషిం చకూడదు. శ్రద్ధగా వినాలి. 3. మాట్లాడటానికి తగిన విధంగా మీ మూడ్ ఉండాలి; 4. విన టానికి సరైన స్థితిలో అవతలివారి మూడ్ ఉందా? 5. వారి మూడ్‌ని మీ మాటల్లో మార్చ గలిగే పరిస్థితి ఉందా?; 6. అవతలివారి పరిస్థితిని బట్టి మూడ్‌ని మార్చుకునే అవసరం మీకుందా?
మొనాలిసా పెయింటింగ్ ఎందు కంత ప్రసిద్ధి చెందింది? చిరునవ్వు వల్ల! ప్రశాంత మైన నవ్వుకి అంత గొప్ప విలువ ఉంది. ముఖంపై మృదు దరహాసం కొనసాగించండి. మీపట్ల మీకున్న నమ్మకానికి చిరునవ్వు ప్రత్యక్షసాక్షి. ఫస్ట్ ఇంప్రెషన్లో చిరునవ్వు, దుస్తులు, బాడీ లాంగ్వేజీ, మాటల్లో మృదుత్వం ప్రాముఖ్యత వహిస్తాయి.
నేను బీటెక్ మూడో యేడు చదువుతున్నాను. నాకో ఫ్రెండ్ ఉన్నాడు. తనని నేను అన్నయ్యా అని పిలుస్తాను. తనూ నన్ను సొంత చెల్లిలా చూస్తాడు. తను ఈ మధ్య డ్రగ్స్‌కి అలవాటుపడ్డాడు. తను బాగా పాడైపోయాడని అందరూ కామెంట్ చేస్తున్నారు. దూరదూరంగా ఉంటున్నారు. అది నేను తట్టుకో లేకపోతున్నాను. సర్ది చెబుదామంటే ఎలా రియాక్ట వుతాడోనని భయం. ఏం చేయమంటారు? తనని ఎలా ఆ అలవాటు నుంచి బయట పడేయాలి?
- అనూష, రాజమండ్రి
మీ అన్నయ్యకి అమ్మ, నాన్న, అన్న, చెల్లి... ఇలా సొంతవాళ్లెవరూ లేరా? వాళ్లకి ఈ డ్రగ్స్ విషయం తెలుసా? వాళ్లకి లేని బాధ మీకెందుకు అని నేను అనట్లేదు. తమ మనిషి డ్రగ్స్‌కి అల వాటుపడ్డ విషయం గురించి ఇంట్లో తెలిసిందా లేదా అని మాత్రమే అడుగుతున్నాను. తెలి సుంటే వాళ్లు ఈపాటికే అతణ్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడమో, హెచ్చరించడమో చేసి ఉంటారు. అది కనుక్కోండి. ఓసారి డ్రగ్స్‌కి అలవాటు పడ్డ వాడు చెప్తే బాగుపడడు. కాని చెప్పడం మీ బాధ్యత. మీ ప్రయత్నం మీరు చేసి చూడండి.
అతడు ఎలా రియాక్టవుతాడో అని మీకెందుకు భయం! ఆ విషయం మీకు తెలిసిందని ఏడుస్తాడా, కోపగించుకుంటాడా లేక మిమ్మల్ని దూరం చేసుకుంటాడా? ఏం జరిగినా అతడి ఆరోగ్యం కంటే ప్రమాదకరమైనవి కావు. ఇకపోతే మీది రాజమండ్రి అంటున్నారు కాబట్టి అక్కడే ఇద్దరు ప్రముఖ సైకాలజిస్టులున్నారు. ఈ అలవాటును తాము మాన్పించగలం అని తరచూ ప్రకటిస్తున్నారు కూడా. తీసుకెళ్లండి. అయితే ఇవన్నీ మీ అన్నయ్య ఒప్పుకుంటేనే జరుగుతాయి.