
Google Grammar Check Feature: ఈ రోజుకి కూడా ఇంగ్లీషులో గ్రామర్ మిస్టేక్స్ చేసేవారి సంఖ్య భారీగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ దీని కోసం ఓ సరికొత్త ఫీచర్ తీసుకువచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
గూగుల్ ఇప్పుడు తన గూగుల్ సెర్చ్‌లో వినియోగదారుల కోసం 'గ్రామర్ చెక్ ఫీచర్' తీసుకువచ్చింది. ఇది ప్రస్తుతం ఇంగ్లిష్ లాంగ్వేజ్‌కి మాత్రమే అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని భాషలకు అందుబాటులో ఉండనుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో వచ్చిన ఈ ఫీచర్ ద్వారా ఒక వాక్యం గ్రామర్ పరంగా సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు.
ఈ కొత్త ఫీచర్ ద్వారా నేరుగా గ్రామర్ చెక్ చేసుకోవచ్చు. అంటే వాక్యాలు సరిగ్గా ఉన్నాయా.. లేదా? అని చెక్ చేసుకోవడానికి ప్రత్యేకించి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేదు. ఈ ఫీచర్ ఉపయోగించడం కూడా చాలా సులభం. నిజానికి ప్రతి సారీ గ్రామర్ చెక్ కోసం పేజ్ ఉపయోగించాల్సిన అవసరం లేదు, అయితే దీనిని మీరు ఉపయోగిస్తున్నప్పుడు గ్రామర్ చెక్ అనే టూల్ పాప్ అప్ అవుతుంది.
ఇదీ చదవండి: ఇలా చేస్తే ఏడాదికి 60 లక్షల ఆదాయం! 10 ఏళ్ల వరకు గ్యారెంటీ!
దీని ద్వారా మీరు ఒక వాక్యం ఎంటర్ చేయగానే అందులో గ్రీన్ చెక్ మార్క్ చూపిస్తుంది, అందులో ఏదైనా తప్పు ఉంటె రెడ్ మార్క్ చూపిస్తుంది. గ్రామర్ మాత్రమే కాకుండా స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా కరెక్ట్ చేస్తుంది. ఈ లేటెస్ట్ ఫీచర్ కంప్యూటర్లలో, స్మార్ట్‌ఫోన్లలో ఉపయోగించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment