మద్నూర్(జుక్కల్): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ అదే పాఠశాల స్టాఫ్‌నర్స్ సునీత సోమవారం మద్నూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గతేడాది నుంచి తనను వేధిస్తూ లొంగదీసుకోవడానికి ప్రయత్నాలు చేశాడని, ప్రతిఘటించడంతో ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ తన భర్త శంకర్‌తో వచ్చి బోరున విలపించింది. గతంలో తనను హైదరాబాద్ వరకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి కారులో తీసుకెళ్లి అసభ్యకరం గా ప్రవర్తించాడని పేర్కొంది. తనతో పాటు అక్కడి మహిళా సిబ్బందికి ఇబ్బందులు పెడుతున్నా భయంతో బయటకు చెప్పుకోలేకపోతున్నారని వివరించింది. చెప్పినట్టు చేయకపోతే చంపుతానని బెదిరింపులకు పాల్పడుతున్నాడని పేర్కొంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment