11 ఏళ్ల విద్యార్థినిపై దారుణం | In Patna 11 Years old Girl Assaulted By School Principal Clerk | Sakshi
Sakshi News home page

11 ఏళ్ల విద్యార్థినిపై దారుణం

Published Thu, Sep 20 2018 1:24 PM | Last Updated on Thu, Sep 20 2018 2:28 PM

In Patna 11 Years old Girl Assaulted By School Principal Clerk - Sakshi

పాట్నా : ఐదో తరగతి విద్యార్థినిపై అరాచకానికి పాల్పడిన  ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయున్ని, అతనికి సహకరించిన గుమస్తాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. పాట్నాకు చెందిన పదకొండేళ్ల చిన్నారి ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆ చిన్నారిపై అకృత్యానికి పాల్పడ్డాడు. అంతటితో ఊరుకోక ఆ దృశ్యాలను వీడియో తీసి ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే ఆ వీడియోలను బయటపెడతాను.. చంపేస్తాను అని బెదిరించాడు. ఇలా నెల రోజుల పాటు ఈ దారుణం కొనసాగింది. ఈ క్రమంలో సదరు బాలిక కొన్ని రోజులుగా కడుపునొప్పి, వాంతులతో బాధపడుతుండటంతో బాలిక తల్లిదండ్రులు చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన వైద్యులు చిన్నారిని గర్భవతిగా నిర్ధారించారు. విస్తుపోయిన తల్లిదండ్రులు బాలికను ఆరా తీయగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాఠశాలకు వెళ్లి విచారించగా సదరు ప్రిన్సిపాల్‌ హోం వర్క్‌ చెక్‌ చేసే నేపంతో బాలికను తన గదికి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిసింది. ఇందుకు పాఠశాలలో పనిచేస్తోన్న కర్ల్క్‌ సాయం చేసేవాడని తేలింది. అంతేకాక ప్రిన్సిపాల్‌ ఫోన్‌లో బాలికకు సంబధించిన ఫోటోలు కూడా ఉన్నాయి. దాంతో పోలీసులు ప్రధానోపాధ్యాయున్ని, క్లర్క్‌ని అదుపులోకి తీసుకుని, స్కూల్‌ని సీజ్‌ చేశారు. కేవలం 1 - 5 వరకే ఉన్న ఈ పాఠశాలలో 90 మంది విద్యార్ధులు చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement