వైవీయూ: కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాల (స్వయంప్రతిపత్తి) సెమిష్టర్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. శుక్రవారం నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాలలో నవంబర్‌లో నిర్వహించిన ప్రథమ, తృతీయ, 5వ సెమిష్టర్ పరీక్ష ఫలితాలను ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. సుబ్బనరసయ్య విడుదల చేశారు. బీఏలో 80 శాతం, బీఎస్సీలో 71 శాతం, బీకాంలో 76 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల పరీక్షల విభాగం నియంత్రణాధికారి డాక్టర్ ఎం. రవికుమార్, అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ డాక్టర్ పి. హరిప్రసాద్, డా. ఎల్‌ఎండీ భ„Šరత్ తదితరులు పాల్గొన్నారు.