కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ బదిలీ
Published Fri, Aug 26 2016 12:31 AM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM
కాజీపేట రూరల్ : హన్మకొండ మండలం కడిపికొండలోని కేంద్రీయ విద్యాలయం(కేవీ) ప్రిన్సిపాల్ హనుముల సిద్ధరాములు మెదక్ జిల్లాలోని ఎద్దు మైలారం కేవీ ప్రిన్సిపాల్‌గా బదిలీ అయ్యారు. కాగా, ఆయన ఇక్కడి విధుల నుంచి సోమవారం రిలీవ్ అవుతారు. రాములు గత 5 సంవత్సరాలుగా కేవీ ప్రిన్సిపాల్‌గా సేవలందించారు. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విధి నిర్వహణలో తనకు సహకరించిన వారందరికీ సిద్ధరాములు ధన్యవాదాలు తెలిపారు. రాములు ఆధ్వర్యంలో కడిపికొండలోని నూతన కేవీ భవన నిర్మాణం జరిగింది. ఏటా 10వతరగతి, 10 ప్లస్ 2లలో అత్యుత్తమ ఫలితాలను సాధించారు. విద్యాసంస్థ విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో ప్రతిభ కనబర్చి పతకాలను కైవ సం చేసుకున్నారు.
Advertisement
Advertisement