KV
-
చంద్రయాన్–3లో మన కృష్ణమూర్తి
కాకినాడ: చంద్రయాన్–3 విజయవంతం కావడంలో మన కాకినాడ వాసి భాగస్వామ్యం కూడా ఉందన్న అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. దేశమంతటా చంద్రయాన్ సంబరాలు చేసుకుంటున్న నేపథ్యంలో ఇక్కడే పుట్టి చదువుకున్న శాస్త్రవేత్త పాత్ర ఉంది. ఆయనే కాకినాడ జగన్నాథపురం ఎంఎస్ఎన్ చార్టీస్లో చదువుకున్న కేవీ కృష్ణమూర్తి. ఆయన ఇస్రోలో స్పేస్ క్రాఫ్ట్ ప్రొపల్షన్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ గ్రూపులో డ్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ప్రాథమిక విద్య అనంతరం సాంకేతిక విద్యపై ఆసక్తితో ఆంధ్రా పాలిటెక్నిక్‌లో మెకానికల్ పూర్తి చేశారు. దివంగత కొల్లూరు శ్రీరామమూర్తి అవధాని, లక్ష్మీసోదమ్మల నాలుగో సంతానం ఆయన. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో చేరి, అక్కడ ఎస్వీ రాజగోపాల్ ప్రోద్బలంతో ఏఎంఐఈఈలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆ తరువాత బెంగళూరులోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ సెంటర్ బదిలీ అయ్యారు. అక్కడ స్పేస్ క్రాఫ్ట్ ప్రొపల్షన్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ గ్రూపులో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్నారు. చంద్రయాన్–3లో ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్‌కు పీఎస్ఐ పూర్తి చేయడంలో కీలక పాత్ర వహించారు. ఈ ప్రక్రియ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్‌కు దోహదపడిందని ఆయన తెలిపారు. చంద్రయాన్–3 మిషన్ ఆపరేషన్‌లో ఆయన 45 రోజుల పాటు ఇతర శాస్త్రవేత్తలతో కలసి శ్రమించారు. ప్రస్తుతం ఆయన గగన్‌యాన్ ప్రాజెక్టులో కూడా పని చేస్తున్నారు. ఇస్రోలో 38 ఏళ్ల కెరీర్లో కృష్ణమూర్తి మూడు ప్రాజెక్టులకు డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పని చేశారు. చంద్రయాన్–3 సక్సెస్ సమయంలో చివరి 17 నిమిషాలు నరాలు తెగేంత ఉత్కంఠను అనుభవించామని సాఫ్ట్ ల్యాండింగ్‌తో ఊపిరి పీల్చుకున్నామని కాకినాడలోని ఆయన కుటుంబ సభ్యులు సంతోషంగా చెప్పారు. ఇస్రో చైర్మన్ సోమనాథ్ సామర్థ్యం, ఇతర కేంద్రాల డైరెక్టర్ల మార్గదర్శకాలతో చేసిన సమష్టి కృషితో ఇది సాధ్యమైందని, ఈ మొత్తం ప్రాజెక్టులో తమ వాడు ఉండటం గర్వంగా ఉందని ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు సంతోషం వెలిబుచ్చారు. కాగా ఆదిత్య ఎల్–1 శాటిలైన్‌లో ప్రొపల్షన్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ కూడా కృష్ణమూర్తి ఆధ్వర్యంలోనే జరిగిందని అంటున్నారు. -
కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ బదిలీ
కాజీపేట రూరల్ : హన్మకొండ మండలం కడిపికొండలోని కేంద్రీయ విద్యాలయం(కేవీ) ప్రిన్సిపాల్ హనుముల సిద్ధరాములు మెదక్ జిల్లాలోని ఎద్దు మైలారం కేవీ ప్రిన్సిపాల్‌గా బదిలీ అయ్యారు. కాగా, ఆయన ఇక్కడి విధుల నుంచి సోమవారం రిలీవ్ అవుతారు. రాములు గత 5 సంవత్సరాలుగా కేవీ ప్రిన్సిపాల్‌గా సేవలందించారు. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విధి నిర్వహణలో తనకు సహకరించిన వారందరికీ సిద్ధరాములు ధన్యవాదాలు తెలిపారు. రాములు ఆధ్వర్యంలో కడిపికొండలోని నూతన కేవీ భవన నిర్మాణం జరిగింది. ఏటా 10వతరగతి, 10 ప్లస్ 2లలో అత్యుత్తమ ఫలితాలను సాధించారు. విద్యాసంస్థ విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో ప్రతిభ కనబర్చి పతకాలను కైవ సం చేసుకున్నారు. -
కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు
కాజీపేట రూరల్ : హన్మకొండ మండలం కడిపికొండలోని కేంద్రీయ విద్యాలయంలో కాం ట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. కేవీలో హిందీ, ఇంగ్లిష్, సాంఘిక, ప్రా థమిక తరగతులను బోధించేందుకు కాంట్రా క్ట్ ప్రాతిపదికన టీచర్ పోస్టులను భర్తీ చేసేం దుకు దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ హనుముల సిద్దరాములు గురువారం ఒక ప్ర కటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా ఈనెల 26వ తేదీన కేంద్రీయ విద్యాలయంలో జరిగే ఇంట ర్వూ్యలకు హాజరుకావాలని కోరారు. వివరాల కోసం వెబ్ సైట్ www kvwarangal. orgలో చూడాలని తెలిపారు. -
ఎన్ఐఓఎస్, కేవీ మధ్య ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్) అధ్యయన, పరీక్ష కేంద్రాలుగా ఇకపై కేంద్రీయ విద్యాలయాలు (కేవీ) పని చేయనున్నాయి. దీనికి సంబంధించిన ఒప్పందంపై ఎన్ఐఓఎస్ చైర్మన్ ప్రొఫెసర్ సీబీ శర్మ, కేవీ కమిషనర్ సంతోష్‌కుమార్ మల్ ఒప్పందం చేసుకున్నట్లు ఎన్ఐఓఎస్ హైదరాబాద్ రీజనల్ డెరైక్టర్ అనిల్‌కుమార్ తెలిపారు. దీంతో కేంద్రీయ విద్యాలయాల్లోని అధ్యయన కేంద్రాల్లో ఎన్ఐఓఎస్ శిక్షణ తరగతులు, బోధన, పరీక్షలు నిర్వహించుకునే వీలు కలిగిందన్నారు.