పిల్లలపై పెద్దల దాడి! | parents attack in gurukul school principal | Sakshi
Sakshi News home page

పిల్లలపై పెద్దల దాడి!

Published Wed, Jul 13 2016 4:25 AM | Last Updated on Mon, Sep 4 2017 4:42 AM

పిల్లలపై పెద్దల దాడి!

పిల్లలపై పెద్దల దాడి!

స్థానిక గురుకుల పాఠశాలలో సీనియర్ ఇంటర్ విద్యార్థులు..

గురుకుల పాఠశాల వ్యవహారంలో తలదూర్చిన తల్లిదండ్రులు
కేసు నమోదు చేసిన పోలీసులు

 అర్ధవీడు: స్థానిక గురుకుల పాఠశాలలో సీనియర్ ఇంటర్ విద్యార్థులు.. జూనియర్లను చితకబాదిన నేపథ్యంలో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం విద్యాలయూనికి చేరుకొని సీనియర్లను కొట్టారు. ప్రిన్సిపాల్ రూతురమాలతో కొందరు మాట్లాడుతుండగా.. ఆవేశంతో ఊగిపోరుున మరికొంతమంది  తరగతి గది, స్టాఫ్ రూంలో ఉన్న సీనియర్స్‌ను తీవ్రంగా కొట్టారు. కళాశాల సిబ్బంది.. ప్రిన్సిపాల్.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగప్రవేశం చేశారు. సోమవారం రాత్రి జరిగిన సంఘటనలో బాధ్యులైన విద్యార్థులను, తల్లిదండ్రులను ప్రిన్సిపాల్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు.

 గొడవకు కారణం ఏమిటి?
గురుకుల కళాశాలలో ప్రిన్సిపాల్‌కు.. సిబ్బంది మధ్య భేదాభిప్రాయూలు ఉన్నారుు. ఈ నేపథ్యంలో ఒక వర్గం వారు సీనియర్ విద్యార్థులను మరొక వర్గం వారు జూనియర్ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. సీనియర్లు ఒంగోలు, కందుకూరు, టంగుటూరు, తాళ్లూరు కావడంతో స్థానికంగా ఉన్న విద్యార్థులు వారిపై ఆధిపత్యం చెలారుుంచేలా సిబ్బంది ప్రోత్సహించినట్లు సమాచారం. తల్లిదండ్రులు కూడా దాడి చేస్తున్నా 30 మంది వరకు ఉన్న కళాశాల సిబ్బంది వారించకపోవడం విశేషం. కొంతమంది విద్యార్థులు రాత్రి సమయూల్లో కూడా వీధుల వెంట తిరగడం.. సిబ్బంది అరుుతే మద్యం తెప్పించుకోవడం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

 సొమ్మసిల్లి పడిపోయిన విద్యార్థి తండ్రి
విద్యార్థులపై దాడి చేసి తల్లిదండ్రులను ఎస్సై రాములునాయక్ స్టేషన్‌కు పిలిపించి విచారిస్తుండగా ఓ విద్యార్థి తండ్రి శ్యామ్ సొమ్మసిల్లి పడిపోవడంతో పోలీసులు ప్రథమ చికిత్స చేరుుంచారు. అనంతరం అర్ధవీడు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎస్సై మాట్లాడుతూ పత్రికల్లో వచ్చిన కథనానికి స్పందించిన ఎస్పీ , జిల్లా న్యాయాధికారి ఆదేశాల మేరకు విద్యార్థుల తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement