
పహాడీషరీఫ్: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన పాఠశాల ప్రిన్సిపాలే గాడి తప్పాడు. 2వ తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలికపై ప్రిన్సిపాల్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....ఎర్రకుంటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో జోసెఫ్ (50) ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాడు. ఇదే పాఠశాలలో ఎనిమిదేళ్ల బాలిక 2వ తరగతి చదువుతుంది. గత నెల 28న బాలికను ప్రిన్సిపాల్ తన గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయమై ఆ బాలిక ఆలస్యంగా తల్లికి తెలిపింది. దీంతో తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment