
సాక్షి, సిద్దిపేట : పదేళ్ల క్రితం ఆ ఇంటి పెద్ద గుండె ఆగిపోయింది. ప్రకృతి పగబట్టినట్టు వర్షాల కారణంగా ఆ కుటుంబానికి ఆసరాగా ఉన్న ఇల్లు కాస్తా కూలిపోయింది. మగదిక్కులేకుండా వయసులో ఉన్న కూతురుతో తల్లి దొంతరబోయిన బాలవ్వ సర్కారు బడి లో తలదాచుకుంది. సిద్దిపేట జిల్లా చిన్నకో డూరు మండలం రామంచకి చెందిన వీరి దీనస్థి తిని సెప్టెంబర్ 23న ‘సారూ.. సాయం చేయరూ’ శీర్షికన ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీనికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. నిరుపేదల గోడు విని సొంత ఖర్చుతో ఇల్లు కట్టించారు. శనివారం దగ్గరుండి తల్లీకూతుళ్లకు కొత్త బట్టలు పెట్టి గృహ ప్రవేశం చేయించారు.
నాడు కూలిన ఇల్లు.. నేడు కొత్తగా నిర్మించిన ఇల్లు
Comments
Please login to add a commentAdd a comment