హామేరీకోమ్స్ | Girls to make a role model of HaMary Koms | Sakshi
Sakshi News home page

హామేరీకోమ్స్

Published Fri, Sep 5 2014 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 PM

హామేరీకోమ్స్

హామేరీకోమ్స్

పేదరికం ఎదురు నిలిచినా... కుటుంబం బాధ్యతలు మోపినా... సంకల్పమే ఆమెకు బలం. పట్టుదలే ప్రోత్సాహం. లక్ష్యం ఉండాలే గానీ... ఏవీ అడ్డంకులు కాదన్నది ఆమె నమ్మిన సిద్ధాంతం. కృషే పెట్టుబడిగా... సవాళ్లే నిచ్చెనగా చేసుకొని ఎదిగిన వుట్టిలో మాణిక్యం.. బాక్సింగ్ చాంపియన్ మేరీకోమ్. పవర్ పంచ్‌లతో రింగ్‌లో ప్రత్యర్థులను వుట్టికరిపిస్తున్న ఈ వుణిపూర్ వుణిపూస స్ఫూర్తితో వున సిటీలోనూ పుట్టుకొస్తున్నారు మేరీకోమ్‌లు. కృష్ణప్రియ, ధ్రువిక, ప్రవల్లిక, ఒసామా, సునీత, నసీరున్, తన్మయ్ యాదవ్...
 ఒకరా ఇద్దరా... మెరుపు పంచ్‌లు విసురుతూ అకుంఠిత దీక్షతో ‘టార్గెట్’ వైపు దూసుకుపోతున్నారు ఎందరో బాలికలు.  
 
కృష్ణప్రియ. నిరుపేద కుటుంబం. నాన్న జ్ఞానేశ్వర్ ఫుట్‌పాత్‌పై హెల్మెట్స్ అమ్ముతుంటాడు. ప్యారడైజ్ నల్లగుట్ట గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతోంది. పీఈటీ, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో జింఖానా గ్రౌండ్‌లో రెండేళ్ల నుంచి బాక్సింగ్‌లో కోచింగ్ తీసుకుంటోంది. ఎల్‌బీ స్టేడియంలో జరిగిన ఇంటర్ డిస్ట్రిక్ట్ బాక్సింగ్ పోటీల్లో గోల్డ్‌మెడల్ సాధించింది. నగ్మా రెడ్‌హిల్స్‌లోని ఇండో గ్రామర్ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. తండ్రి షేక్ ముక్తా నాంపల్లిలో మెకానిక్. ఆమె గతేడాది అసోంలో జరిగిన నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ప్రతిభ చూపింది. జిల్లాస్థాయి టోర్నీల్లోనూ పలు పతకాలను సాధించింది.
 
 ఆ నలుగురు...
 బి.కృష్ణవేణి, మౌనిక, నవ్య, రోజా సీతాఫల్‌మండిలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో చదువుకుంటున్నారు. పీఈటీలు హరిశ్చంద్రప్రసాద్, శ్రీనివాస్‌మూర్తిల పర్యవేక్షణలో బాక్సింగ్‌లో రాటుదేలుతున్నారు. గతేడాదిలో రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నీలో గోల్డ్‌మెడల్స్ దక్కించుకున్నారు.
 
 కృష్ణవేణికి అమ్మ లే దు. నాన్న గాంధీ
 వాచ్‌మన్. మౌనిక నాన్న నాగేశ్వర్‌రావు చిరు వ్యాపారి. నవ్య తండ్రి యాదగిరి రిక్షాపుల్లర్. రోజా ఫ్యామిలీదీ రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. తండ్రి హనుమంతు, తల్లి కమలమ్మ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు. వీరందరూ కడుపుకట్టుకొని కన్నబిడ్డల కలలు నెరవేర్చేందుకు కష్టపడుతున్నారు. ఈ అమ్మాయిలందరిదీ ఒకేమాట.. ‘లక్ష్యాన్ని చేరుకునేదాకా పిడిగుద్దుల వర్షం కురిపిస్తాం.’  
 
 శిక్షణ ఇలా...
 ఎల్‌బీ స్టేడియం, సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్‌లో బాక్సింగ్‌లో శాప్ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ ‘పే అండ్ ప్లే’
 పద్ధతిలో ప్రవేశం పొందవచ్చు. నిజాం కాలేజీలోని శిక్షణ
 కేంద్రానికి ఉస్మానియా వర్సిటీ నిధులు సమకూరుస్తోంది.
 ఎల్బీ స్టేడియం
 కోచ్ ఓంకార్ యాదవ్ -99851 55357,
 జింఖానా మైదానం
 కోచ్ శ్రీకాంత్‌రెడ్డి -94920 35789,
 నిజాం కళాశాల
 కోచ్ కేఆర్ స్టీవన్ -92465 38129.
 ఎల్‌బీ స్టేడియం కేంద్రంలో ప్రవేశానికి కనీసం 11 ఏళ్లు నిండి ఉండాలి. 14 ఏళ్లలోపు వారు రూ.35, 14 ఏళ్లు పైబడినవారు రూ.70 ప్రవేశ రుసుం చెల్లించాలి. నెల ఫీజూ అంతే మొత్తం. జింఖానాగ్రౌండ్‌లో ప్రవేశానికి 14 ఏళ్ల లోపు బాలలు రూ.70, ఆ వయసు పైబడినవారు రూ.110 ప్రవేశ రుసుం చెల్లించాలి. 14 ఏళ్లలోపు వారు రూ.30, 14 ఏళ్లు పైబడినవారు రూ.50 ప్రతినెలా ఫీజు చెల్లించాలి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో బాక్సింగ్ శిక్షణ ఇస్తున్నారు.  
 
 మెళకువలపై పట్టు ముఖ్యం...
 పదిహేనేళ్లుగా బాక్సింగ్ శిక్షణ ఇస్తున్నా. మెలకువల్లో పట్టు సాధిస్తే బాక్సింగ్‌లో రాణించడం తేలికే. మా కేంద్రంలో బాక్సర్లకు కావలసిన సామగ్రి అంతా అందుబాటులో ఉంది.
 - ఓంకార్ యాదవ్,
 శాప్ బాక్సింగ్ కోచ్, ఎల్‌బీ స్టేడియం   
 
 జీహెచ్‌ఎంసీ శిక్షణ కేంద్రాలు.. కోచ్‌లు
 రీహ ంపురా ప్లే గ్రౌండ్- పురానాపూల్-అనిల్ కుమార్-99081 99383
  కులీకుతుబ్ షా-మోహన్‌దాస్ మఠ్ పురానాపూల్-బహుదూర్ సింగ్-8801093421
 సలర్-ఈ-మిల్లార్
 చందూలాల్ బరాదరి- బహుదూర్‌పురా
 ఇస్మాయిల్ 9885963502
 ఫలక్‌నుమా ప్లే గ్రౌండ్
 అబిద్ ముస్తఫా-9652924694
 విక్టరీ ప్లే గ్రౌండ్-చాదర్‌ఘాట్
 దుర్గాప్రసాద్-98666 72227
  జీహెచ్‌ఎంసీ ప్లే గ్రౌండ్-
 షెనాయ్ నర్సింగ్ హోం-మారేడ్ పల్లి
 కె.కృష్ణ -9290218047
 గురుమూర్తి స్విమ్మింగ్ పూల్
 పరేడ్ గ్రౌండ్స్ (అశోక్ కుమార్)
 -  వాంకె శ్రీనివాస్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement