సభలో మాట్లాడుతున్న నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్
గుంటూరు: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని 2019లో ముఖ్యమంత్రిని చేసుకుంటేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని నెల్లూరు ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరులో గురువారం జరిగిన వంచనపై గర్జన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అయిన ప్రత్యేకహోదా సాధన కోసం జగన్ మాట మేరకు సంవత్సరం పదవీకాలం ఉండగానే ఐదుగురు వైఎస్సార్ సీపీ ఎంపీలు పదవికి రాజీనామా చేశారన్నారు. టీడీపీ, బీజేపీకి మద్దతు ఇచ్చి, సమస్యలపై ప్రశ్నిస్తా అని నాలుగున్నరేళ్లు గడిపేసిన పవన్ కల్యాణ్ జగన్‌మోహన్‌రెడ్డి పారిపోయాడనడం అవివేకమన్నారు. పారిపోవటం, భయపడటం, వెన్ను చూపటం వైఎస్ జగన్ రక్తంలో లేదన్నారు.
ఎన్ని పార్టీలు ఏకమైనా ఎవరితో పొత్తు పెట్టుకోకుండా 2019 ఎన్నికల్లో ఒక్కడిగా పోటీ చేసే దమ్మున్న వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తెలుగు సరిగ్గా మాట్లాడటం రాని, కాగితం ముందు పెట్టినా చదవటం రాని లోకేష్ క్యామిడీ యాక్టర్‌కు ఎక్కువ, సీరియస్ యాక్టర్‌కి తక్కువ అని అన్నారు. తన స్థాయిని తెలుసుకుని జగన్‌ను విమర్శించాలన్నారు. రాష్ట్రంలో 1.75 కోట్ల నిరుద్యోగులు ఉంటే నాలుగున్నర ఏళ్ల తర్వాత 12 లక్షల మందికి మాత్రమే అది కూడా రూ.1,000 నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారన్నారు. నిరుద్యోగ భృతి ద్వారా ఇచ్చే రూ.1,000 సెల్‌ఫోన్లు కొనుగోలు చేసి జల్సాలు చేయరాదని లోకేష్ చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఐదుకోట్ల ఆంధ్రుల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు అయిన వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాకుండా ఎన్ని కుతంత్రాలు చేసినా సాగవన్నారు. అధికార పార్టీ నాయకులు వైఎస్సార్ కార్యకర్తలపై చేస్తున్న అరాచకాలకు, వారికి వత్తాసు పలుకుతున్న అధికారులకు చక్రవడ్డీతో చెల్లిస్తామన్నారు.
‘వంచనపై గర్జన’లో బొమ్మిరెడ్డి
వెంకటగిరి: గుంటూరులో గురువారం జరిగిన వంచనపై గర్జనలో వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంచనపై గర్జన కార్యక్రమంలో ప్రజల నుంచి విశేషంగా స్పందన రావడం హర్షణీయమని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా, విభజన హమీలను అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలం అయ్యారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment