భక్త జన సందోహం నడుమ సాగుతున్న రథయాత్ర
సాక్షి, తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో వేంచేసి ఉన్న శ్రీలక్ష్మీనృసింహస్వామి రథయాత్ర శనివారం అత్యంత శోభాయమానంగా సాగింది. సుమారు లక్ష మందికి పైగా భక్తులు రథ యాత్రలో పాల్గొన్నట్లు అంచనా. శుక్రవారం రాత్రి స్వామి వారి కల్యాణం జరిగిన నేపథ్యంలో అనంతరం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో భక్తులు సముద్రంలో పుణ్య స్నానాలు ఆచరించారు.
మధ్యాహ్నం 3 గంటలకు రథ యాత్ర ప్రారంభం కాగా, భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త కలిదిండి గోపాలరాజు బహద్దూర్ కొబ్బరి కాయ కొట్టి రథ యాత్ర ప్రారంభించారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment