kalyana mahotsavam
-
హిందూ ధర్మ పరిరక్షణకు ఏపీ సర్కార్ ప్రాధాన్యత: మంత్రి వేణు
సాక్షి, రామచంద్రాపురం(కోనసీమ జిల్లా): దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం దాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుపుకోవడం ఆనందకరమని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. శనివారం ద్రాక్షారామ మాణిక్యాంబ భీమేశ్వర స్వామి వారి కల్యాణోత్సవంలో భాగంగా నాలుగోవ రోజు మంత్రి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హిందూ ధర్మ పరిరక్షణకు ప్రాధాన్యతను ఇస్తున్నారని ఇందులో భాగంగానే జీర్ణోద్ధరణకు వచ్చిన స్వామివారి పాత రథం స్థానే నూతన రథం నిర్మించడానికి సంకల్పించినట్లు తెలిపారు. నూతన రథం నిర్మాణం కోసం కంచి కామకోటి పీఠాధి మఠం, విశాఖ శారదా పీఠం పీఠాధిపతి స్వరూప నంద స్వామి ఆశీస్సులతో 45 రోజుల క్రితం నూతన రథం పనులు ప్రారంభించి రికార్డు స్థాయిలో స్వామివారి కల్యాణ సమయానికి నూతన రథం నిర్మించుకోవడం శుభపరిణామం అన్నారు. నూతన రథంలో స్థల పురాణములో తెలిపిన విధంగా స్వామి వారి దేవాలయంలో ఉన్న వివిధ విగ్రహాల సంబంధించిన చిత్రాలను నూతన రథంలో రథ రూపశిల్పి గణపతాచార్యులు ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు. నూతన రథం ప్రారంభోత్సవంలో విశాఖపట్నం శారదా పీఠం పీఠాధిపతి స్వాత్మా నంద స్వామి, జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర, జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్‌రెడ్డిలతో పాటు దేవాదాయ శాఖకు చెందిన అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
గోదాదేవి కల్యాణంలో సీఎస్ శాంతికుమారి
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం రాత్రి జరిగిన గోదాదేవి– శ్రీరంగనా«థుల కల్యాణ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పాల్గొన్నారు. గోదాదేవి– శ్రీరంగనాథులను అలంకరించి తిరువీధుల్లో ఆచార్యులు ఊరేగించగా.. సీఎస్ శాంతికుమారి దంపతులు, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, యాదాద్రి భువనగిరి అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఆలయ ఈవో గీతారెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలతో ముందు నడిచారు. ఆలయ ముఖ మండపంలో జరిగిన కల్యాణ వేడుకను తిలకించారు. సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించి తొలిసారి యాదాద్రి క్షేత్రానికి వచ్చిన శాంతికుమారికి ఆచార్యులు, ఈవో గీతారెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ట అలంకార మూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. సీఎస్ దంపతులకు ఆచార్యులు వేద ఆశీర్వచనం చేయగా, ఈవో గీతారెడ్డి లడ్డూ ప్రసాదం అందజేశారు. -
శోభాయమానంగా అంతర్వేది రథయాత్ర
సాక్షి, తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో వేంచేసి ఉన్న శ్రీలక్ష్మీనృసింహస్వామి రథయాత్ర శనివారం అత్యంత శోభాయమానంగా సాగింది. సుమారు లక్ష మందికి పైగా భక్తులు రథ యాత్రలో పాల్గొన్నట్లు అంచనా. శుక్రవారం రాత్రి స్వామి వారి కల్యాణం జరిగిన నేపథ్యంలో అనంతరం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో భక్తులు సముద్రంలో పుణ్య స్నానాలు ఆచరించారు. మధ్యాహ్నం 3 గంటలకు రథ యాత్ర ప్రారంభం కాగా, భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త కలిదిండి గోపాలరాజు బహద్దూర్ కొబ్బరి కాయ కొట్టి రథ యాత్ర ప్రారంభించారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పాల్గొన్నారు. -
Antarvedi: వైభవంగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం ఫొటోలు
-
రాములోరి కల్యాణానికి ముహూర్తం ఖరారు
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 5 వ తేదీన కల్యాణం నిర్వహించనున్నారు. భద్రాద్రిలోని వైదిక కమిటీ ఈ ముహూర్తాన్ని ఖరారు చేసింది. మార్చి 29 నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 5న కళ్యాణం నిర్వహించనున్నారు. అలాగే ఏప్రిల్ 6న రాములవారి మహాపట్టాభిషేకానికి ఏర్పాట్లు చేస్తున్నారు. -
తిరుకల్యాణ మహోత్సవం
-
తిరుకల్యాణ మహోత్సవం
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి, అమ్మవారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం రాత్రి 11 గంటల 25 నిమిషాలకు తులాలగ్న పుష్కరాంశ సుముహూర్తమున యాదగిరి నర సింహస్వామి, లక్ష్మీ అమ్మవారు ఒక్కటయ్యారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామి, అమ్మవార్లను హనుమంత వాహనసేవపై ఆలయ తిరువీధులలో బాజా భజంత్రీలు, ఆలయ అర్చకుల వేదమంత్రాల నడుమ ఊరేగించారు. రాత్రి స్వామి, అమ్మవార్లను పెళ్లికూతురు, పెళ్లికుమారుడిగా ముస్తా బు చేసి పలు పుష్పాలతో అలంకరించారు. ప్రభుత్వం తరఫున గవర్నర్ నరసింహన్ దంపతులు.. దేవస్థానం తరఫున దేవస్థానం చైర్మన్ బి.నరసింహమూర్తి అమ్మవార్లకు ముత్యాల తలంబ్రాలను, సీఎం సమర్పించిన పట్టువస్త్రాలను కల్యాణ మండపానికి తీసుకువచ్చారు. అర్చకులు, వేద పండితులు, రుత్వికుల వేద పఠనంతో, వేద మంత్రోచ్ఛరణల మధ్య రాత్రి స్వామి, అమ్మవార్లకు జీలకర్ర, బెల్లం పెట్టారు. యజ్ఞోపవీతధారణ చేశారు. అనంతరం కన్యాదానం, మాంగల్యధారణచేసి తలంబ్రాలను పోయించారు. కల్యాణంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, గుట్ట అభివృద్ధి మండలి ప్రత్యేక అధికారి కిషన్‌రావు, కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్పీ ప్రభాకర్‌రావు దంపతులు పాల్గొన్నారు.