
‘మన చేతుల్లో మన ఆరోగ్యం’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి ముత్తంశెట్టి, ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులు
సాక్షి, విశాఖపట్నం: అంతర్వేది ఘటన వెనుక ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన అనుచరుల కుట్ర ఉందని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. అందుకే అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ కోరామని చెప్పారు. శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే..
► ఘటనలో పెదబాబు, చినబాబు హస్తం ఉందన్న విషయం విచారణలో బయటపడుతుంది. హైదరాబాద్, గుంటూరు వ్యక్తుల ప్రమేయాన్ని పోలీసులు గుర్తించారు.
► చంద్రబాబు ప్రవాసాంధ్రుడిలా హైదరాబాద్‌లో ఉంటూ ఏపీలో అలజడులు సృష్టించాలని చూస్తున్నారు. చంద్రబాబు ట్రాప్‌లో పడి బీజేపీ, జనసేన మత రాజకీయాలు చేస్తున్నాయి.
► గత సార్వత్రిక ఎన్నికల్లో 23 స్థానాలకే పరిమితమైన టీడీపీని పూర్తిగా భూస్థాపితం చేసే సమయం ఆసన్నమైంది.
► కాగా, కరోనా నుంచి కోలుకున్న అనుభవాలతో విజయసాయిరెడ్డి రాసిన ‘మన ఆరోగ్యం మన చేతుల్లో’ పుస్తకాన్ని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఎంపీలు సత్యనారాయణ, సత్యవతి, ఎమ్మెల్యేలు నాగిరెడ్డి, అదీప్‌రాజ్, గొల్ల బాబూరావు, చెట్టి పాల్గుణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment