
సాక్షి, తూర్పుగోదావరి: అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ నూతన రథాన్ని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లక్ష్మీ నరసింహ స్వామి అనుగ్రహంతోనే రథం పూర్తయిందన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల నిరంతర పర్యవేక్షణ తోనే రథం రికార్డు స్థాయిలో నిర్మాణం పూర్తి చేసుకుందన్నారు. రథం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరైతే బాగుంటుందన్నారు. నూతన రథాన్ని పాత షెడ్లో ఉంచాలా లేదా అన్న విషయంపై నిర్ణయిం తీసుకోలేదని మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment