
సాక్షి, తూర్పుగోదావరి: అంతర్వేది అగ్ని ప్రమాద సంఘటన స్థలం వద్ద డీఐజీ క్యాంప్‌ను ఏర్పాటు చేసినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్‌రావు తెలిపారు. పరిసరప్రాంతాలలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది అని వెల్లడించారు.
ఫోరెన్సిక్ శాఖకు చెందిన నిపుణులు సంఘటన స్థలంలో అనువనువునా నిశితంగా పరిశీలిస్తున్నారని తెలిపారు. కొంత మంది శాంతిభద్రతలకు విఘాతం కల్గించే విధంగా ప్రయత్నించారన్నారు. అంతర్వేది పరిసరప్రాంతాలలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని పేర్కొన్నారు. ఇతరులు ఎవ్వరు ఈ ప్రాంతానికి రావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో ఉండాలని ప్రజలను కోరారు. అంతర్వేదిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథాన్ని కొంతమంది దుండగలు దగ్ధం చేసిన సంగతి తెలిసిందే.
చదవండి: అవసరమైతే సీబీఐ విచారణ
Comments
Please login to add a commentAdd a comment