సాక్షి, అమరావతి : అంతర్వేది ప్రమాద ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ప్రమాదానికి కారుకులు ఎవరైనా వదిలేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో.. రాజకీయ కుట్రలు, కుతంత్రాలను ఉపేక్షించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్గ వైషమ్యాలు సృష్టించాలనుకుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. అంతర్వేది ఘటనలో దోషులు ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్త రథం తయారీకి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్ రూ.95 లక్షలు మంజూరు చేసిందని తెలిపారు. ఈ ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. (‘ఈగ కూడా వాలకుండా పచ్చ కండువా కప్పాడు’)
మరో ట్వీట్‌లో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘తునిలో రైలు, అమరావతిలో తోటలు తగలబెట్టించి, విజయవాడలో గుడులు కూల్చి, అమరేశ్వరుడి భూములు మింగి, పుష్కరాల్లో 7వేల కోట్లు ఆరగించి, దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేయించి, అంతర్వేదిలో రథానికి నిప్పు పెట్టించాడు. పాప భీతి, దైవ భక్తి ఏనాడూ లేనివాడు. ఆ బాబే హిందుత్వంపై దాడులకు మూలకారకుడు.’ అంటూ విమర్శించాడు.
Comments
Please login to add a commentAdd a comment