రేపు అంతర్వేదికి సీఎం వైఎస్‌ జగన్‌ | CM YS Jagan To Visit Antarvedi Tomorrow | Sakshi
Sakshi News home page

రేపు అంతర్వేదికి సీఎం వైఎస్‌ జగన్‌

Published Thu, Feb 18 2021 10:43 AM | Last Updated on Thu, Feb 18 2021 10:43 AM

CM YS Jagan To Visit Antarvedi Tomorrow - Sakshi

అంతర్వేది ఆలయ ప్రధాన గోపురాన్ని పరిశీలిస్తున్న మంత్రి వేణు

కాకినాడ సిటీ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఉదయం 10.40 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 11.20 గంటలకు అంతర్వేది ఫిషింగ్‌ హార్బర్‌ వద్ద హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 11.30 నుంచి 11.35 గంటల వరకూ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ రాజగోపురం వద్దకు చేరుకుంటారు. 11.35 నుంచి 11.45 గంటల వరకూ శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనం, అర్చన, మంత్రపుష్పం సమర్పణ కార్యక్రమాలను సీఎం నిర్వహిస్తారు. 11.45 నుంచి 11.50 గంటల వరకూ రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. 11.50 గంటలకు వేద పండితుల నుంచి ఆశీర్వచనం, శేషవస్త్రం, ప్రసాదం స్వీకరిస్తారు. 12 గంటలకు శ్రీలక్ష్మీనరసింహస్వామి రథాన్ని సందర్శించి ప్రారంభిస్తారు. 12.35 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి తాడేపల్లి వెళతారు.

హెలిప్యాడ్‌ పనుల పరిశీలన
సఖినేటిపల్లి: పల్లిపాలెం మినీ ఫిషింగ్‌ హార్బర్‌లో హెలిప్యాడ్‌ నిర్మాణ పనులను జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ, జాయింట్‌ కలెక్టర జి.లక్ష్మీశ బుధవారం పరిశీలించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంతర్వేది పర్యటనకు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ హెలిప్యాడ్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఫిషింగ్‌ హార్బర్‌ వద్ద, పరిసరాల్లో తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లపై డీఎస్పీ మాధవరెడ్డి, సబ్‌ కలెక్టర్‌ హిమాన్షు కౌశిక్, ఇతర అధికారులతో సమీక్షించారు. పెట్రోలింగ్‌కు నాలుగు ఇంజిన్‌ బోట్లు సిద్ధం చేయాలని ఫిషరీస్‌ జేడీ పీవీ సత్యనారాయణకు ఎస్పీ సూచించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌ వెళ్లే మార్గంలోని ప్రధాన కూడళ్లలో కచ్చితంగా బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని ప్రత్యేక భద్రతా సిబ్బంది కోరారు.

ఆలయంలో స్వామివారి దర్శనానికి వెళ్లే మార్గం, రథం వద్ద కార్యక్రమాలపై కూడా దేవస్థానం అధికారులు, ఆలయ అర్చకులతో ఎస్పీ, జేసీ సమీక్షించారు. సంబంధింత అంశాలను దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ విజయరాజు, అసిస్టెంట్‌ కమిషనర్‌ భద్రాజీ, ప్రధానార్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస్‌ కిరణ్, స్థానాచార్య వింజమూరి రామ రంగాచార్యులు వివరించారు. ఇదిలా ఉండగా తుది దశకు చేరుకున్న ఉత్సవాల ఏర్పాట్లపై జేసీ లక్ష్మీశ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్వామి సన్నిధిలో సివిల్‌ సప్లయిస్‌ జిల్లా మేనేజర్‌ లక్ష్మీరెడ్డి పూజలు నిర్వహించారు.

మంత్రి వేణు సందర్శన
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ సందర్శించారు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న స్వామి కల్యాణోత్సవాల ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
చదవండి: అనంతలో అమానుషం: టీడీపీకి ఓటు వేయలేదని.. 
పేదలపై భారం మోపలేం..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement