
సాక్షి, తిరుపతి: అంతర్వేది ఘటనలో నిజాలు నిగ్గు తేలాలి అని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా డిమాండ్ చేశారు. అందుకే దీనిపై సీబీఐ విచారణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని తెలిపారు. చంద్రబాబులా పిరికిపంద రాజకీయాలు సీఎం జగన్‌కు తెలియవని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. ‘చంద్రబాబు గతంలో రాష్ట్రానికి సీబీఐ అవసరం లేదన్నారు. టీడీపీ పాలనలో 40 ఆలయాలను కూల్చివేశారు. గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు 29 మందిని పొట్టన పెట్టుకున్నారు. బాబు హయాంలో దుర్గగుడి, శ్రీకాళహస్తి ఆలయాల్లో క్షుద్రపూజలు జరిగాయి. చంద్రబాబు పాలనలో తిరుమలలో వేయి కాళ్ల మండపం కూల్చేశారు. కానీ ఎన్నడూ చంద్రబాబు సీబీఐ విచారణ కోరలేదు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు చంద్రబాబు కుట్ర పన్నారు’ అంటూ రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి: 100 ఏళ్లు ఉండేలా కొత్త రథం)
Comments
Please login to add a commentAdd a comment