
సాక్షి, కాకినాడ: అంతర్వేదిలో నూతనంగా నిర్మించిన రధానికి ఫిబ్రవరి 13వ తేదీన సంప్రోక్షణ కార్యక్రమం చేపడతామని ఆలయ అధికారులు వెల్లడించారు. సంప్రోక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విశాఖ శారదా పీఠాధిపతులను ఆహ్వానించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఫిబ్రవరి 11 నుంచి మూడు రోజుల పాటు సంప్రోక్షణ ప్రక్రియ చేపట్టనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. సంప్రోక్షణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా, ఆగమానుసారం చేపట్టాలని స్వామి స్వరూపానందేంద్ర సూచించారు. కాగా, 62 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రధం గతేడాది సెప్టెంబర్ 6న అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment