Bengaluru: కుప్పకూలిన 120 అడుగుల రథం | 120 Foot Charriot Collapsed In Bengluru Temple | Sakshi
Sakshi News home page

గుళ్లో వేడుక.. కుప్పకూలిన 120 అడుగుల రథం

Published Sat, Apr 6 2024 6:27 PM | Last Updated on Mon, Apr 8 2024 10:18 PM

120 Foot Charriot Collapsed In Bengluru Temple - Sakshi

బెంగళూరు: బెంగళూరు రూరల్‌ పరిధిలోని అనేకల్‌లో శనివారం(ఏప్రిల్‌ 6)జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఘోర ప్రమాదం జరిగింది. ఏకంగా 120 అడుగుల ఎత్తున్న రథం ఒక్కసారిగా కుప్పకూలింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు.  హుస్కుర్‌ మడ్డురమ్మ గుడి వార్షికోత్సవ వేడుకలో  ఈ ప్రమాదం జరిగింది.

రథం కూలిపోయినపుడు అక్కడ వేలాది మంది భక్తులున్నారు. రథాన్ని తాళ్లతో కట్టి పైకి లేపడానికి ప్రయత్నించినపుడు అదుపు తప్పి కిందపడిపోయింది. ఎత్తైన రథాల ఊరేగింపునకు హుస్కుర్‌ మడ్డురమ్మ టెంపుల్‌ చాలా పాపులర్‌. దశాబ్దం క్రితం ఈ గుడి వార్షికోత్సవంలో వందల రథాలను ఊరేగించేవారు. అయితే ప్రస్తుతం ఈ సంఖ్య 10కి పడిపోవడం గమనార్హం.  

ఇదీ చదవండి.. రంగు మారనున్న గరీబ్‌రథ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement