
సాక్షి, అమరావతి : ఏపీలో బారీ వరదల్లోనూ పోలవరం ప్రాజెక్టు పనులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రణాళిక బద్ధంగా ప్రభుత్వం పనులను జరిపిస్తుంది. 902 హిల్‌లో 20 వేల క్యూబిక్ మీటర్ల కొండ తవ్వకం చేపట్టారు. గ్యాప్ 3 కాంక్రీట్ డ్యాం, మట్టితీత పనులతో పాటు గ్యాప్ 1 డాయఫ్రం వాల్ పనులు జరుగతున్నాయి. ముందస్తు ప్రణాళికతో స్పిల్ వేపై భాగంలో కార్మికులతో గడ్డర్ల తయారీ, కాంక్రీట్ డ్యామ్, డయా ఫ్రమ్ వాల్ పనులు నిర్వహిస్తున్నారు. అయితే స్పిల్ వే భారీ నీటి ప్రవాహం ఉన్నా స్పిల్ వే పై పనులు జరుపుతున్నారు. బారీ వరదల నేపథ్యంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడానికి రెండు బోట్లు, గజ ఈతగాళ్లను పెట్టి పనులను చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment