
సాక్షి, యాదాద్రి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణం పనులు తుదిదశకు చేరుకుంటున్నాయి. ఆలయ నిర్మాణంలో పలు పనులకు బంగార తాపడం చేపిస్తున్నారు. ఇదే క్రమంలో యాదాద్రి ప్రధానాలయం గర్భాలయం స్వర్ణముఖ ద్వారానికి బంగారు తాపడం చేపించారు. బంగారు తాపడంతో ఉండే ద్వారాల నమూనా వీడియోను దేవాలయ అధికారులు మీడియాకు విడుదల చేశారు. దీనితోపాటు అత్యంత స్వర శోభతో ఉండే విధంగా వివిధ నరసింహుని రూపాలు, దేవత విగ్రహాలు,పద్మాలతో స్వర్ణ తాపడంతో ఆలయ ద్వారాలు వుండే వీడియో నమూనాను అధికారులు విడుదల చేశారు. (అద్భుతం.. అద్దాల మండపం)