సాక్షి, న్యూఢిల్లీ: కాలుష్యం పెరిగిపోతున్న క్రమంలో కొత్త నిర్మాణాలు, కూల్చివేతలపై ఢిల్లీ ప్రభుత్వం నిషేదం విధించింది. దీంతో వందల మంది కార్మికులపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో కీలక నిర్ణయం తీసుకున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ప్రభుత్వ నిర్ణయంతో ప్రభావితమైన నిర్మాణ రంగ కార్మికులందరికీ ఆర్థిక సాయం అందించాలని కార్మిక శాఖ మంత్రి మనీశ్ సిసోడియాను ఆదేశించారు.
‘కాలుష్యం కారణంగా ఢిల్లీలో నిర్మాణ కార్యక్రమాలు ఆగిపోయాయి. నిషేదం తొలగించే వరకు నిర్మాణ రంగంలోని కార్మికులకు ఒక్కొక్కరికి నెలకి రూ.5వేలు ఆర్థిక సాయం అందించాలని లేబర్ మంత్రి మనీశ్ సిసోడియాను ఆదేశించాం.’అని ట్వీట్ చేశారు అరవింద్ కేజ్రీవాల్. ఎన్‌సీఆర్ పరిధిలో గాలి నాణ్యత పడిపోయిన క్రమంలో అక్టోబర్ 30న గాలి నాణ్యత నిర్వహణ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ప్రాంతంలో నిర్మాణ కార్యకలాపాలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Pollution के ख़िलाफ़ लड़ाई में CM @ArvindKejriwal का बड़ा फ़ैसला‼️
— AAP (@AamAadmiParty) November 2, 2022
🔹Construction पर लगी रोक के मद्देनज़र Construction मज़दूर को ₹5000-₹5000 आर्थिक मदद देने का फ़ैसला लिया।
🔹 दिल्ली में निर्माण पर पाबंदियां रहने तक मज़दूरों को आर्थिक सहायता दी जाएगी।
AAP की सरकार-आप के साथ।
ఇదీ చదవండి: ‘అప్పుడు ఆజాద్.. ఇప్పుడు గెహ్లట్.. మోదీ ప్రశంసలు ఆసక్తికరం’.. పైలట్ సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment