Construction Worker
-
ఇసుక దొరక్క.. ఉపాధి లేక.. కార్మికుల ఆకలి కేకలు
గతంలో ఆదివారం కూడా పని ఉండేది. ఇప్పుడు వారంలో రెండు రోజులు కూడా పని దొరకడం లేదు. రోజూ సెంటర్‌కు వెళ్లి ఎవరైనా కూలికి పిలుస్తారేమోనని ఎదురుచూస్తున్నాం. పిల్లల చదువు కోసం వేరే ఊరి నుంచి విజయవాడకు వచ్చాం. రోజు పనికి వెళితేగానీ పూట గడవదు. పనులు లేక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. – శ్రీనివాస్, సెంట్రింగ్ కార్మికుడు, విజయవాడ‘మేం అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తా... పేదలకు పంచుతా... ఇందుకోసం పెద్దగా చేయాల్సింది కూడా ఏమీలేదు.. ఉచిత ఇసుక ఇస్తే చాలు... రోజూ పెద్ద ఎత్తున పనులు జరుగుతాయి. ప్రజల ఆదాయం పెరుగుతుంది...’ అంటూ ఎన్నికల ముందు ప్రతి సభలోనూ చెప్పిన చంద్రబాబు... అధికారంలోకి వచ్చాక ప్లేటు ఫిరాయించారు. ఉచిత ఇసుకను ప్రచారానికే పరిమితం చేశారు. రాష్ట్రంలో ఇసుకను ‘తమ్ముళ్ల’కు ఆదాయ వనరుగా మార్చేశారు.భవన నిర్మాణ కార్మికుల ఉపాధికి ఉరి వేశారు. ఒకవైపు ఇసుకను బ్లాక్‌లో అధిక ధరలకు విక్రయించుకుని ‘తమ్ముళ్లు’ తమ సంపదను పెంచుకుంటున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు పనుల్లేక పస్తులు ఉంటున్నారు. అదేవిధంగా గతంలో ఇసుకపై ఆదాయం ప్రభుత్వ ఖజానాకు వచ్చేది. ఇప్పుడు అలా రాకపోగా ధర మూడు రెట్లు పెరిగింది. ఆ రేటుకు కూడా బ్లాక్‌లో దొరకని పరిస్థితి నెలకొంది. సాక్షి, అమరావతి: విజయవాడ బెంజ్ సర్కిల్ భవన నిర్మాణ కార్మికులకు అడ్డా. ఉదయం ఆరు గంటలకే తలకు కండువా చుట్టుకుని, క్యారేజీ పట్టుకుని వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఇక్కడికి చేరుకుంటారు. మేస్త్రీలు, కాంట్రాక్టర్లు వచ్చి కూలీలను పనికి తీసుకువెళతారు. ఉదయం తొమ్మిది గంటల్లోపే ఆ ప్రాంతం ఖాళీ అవుతుంది. కానీ.. రెండున్నర నెలలుగా అక్కడ పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా పని కోసం కూలీలు పడిగాపులు పడుతున్నారు.అటుగా బైక్, కారుపై వెళ్లేవారు ఒక్క క్షణం ఆగితే... వారి వద్దకు పరుగున వెళ్లి ‘సార్... ఏదైనా పని ఉంటే చెప్పండి... ఎంతో కొంత ఇద్దురుగానీ..’ అని వేడుకుంటున్న దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. చివరికి ఎవరూ పనికి పిలవకపోవడంతో ఉపాధి లేక ఉసూరుమంటూ ఇంటి ముఖం పడుతున్నారు. విజయవాడలోని రామవరప్పాడు వంతెన, చిట్టినగర్ సెంటర్... గుంటూరులో గాంధీ పార్క్, లాడ్జి సెంటర్... విశాఖపట్నంలోని ఇసుకతోట, పూర్ణా మార్కెట్ జంక్షన్, ఎన్ఏడీ జంక్షన్.. నెల్లూరులోని కొండాయిపాలెంగేటు... అనంతపురంలోని రామ్‌నగర్ రైల్వేగేటు సెంటర్... ఇలా రాష్ట్రవ్యాప్తంగా కూలీలు పని కోసం పలు అడ్డాల్లో ఎదురు చూస్తూ అల్లాడిపోతున్నారు. ఎవరిని కదిలించినా రెండున్నర నెలలుగా ఇసుక లేక భవన నిర్మాణాలు నిలిపివేశారు... మాకు పని దొరకడంలేదు.. అంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు చౌడాడ వెంకటరమణ. సొంత ఊరు శ్రీకాకుళం జిల్లా పాలకొండ. తమ ఊరిలో ఉపాధి లేక భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి పదేళ్ల కిందట విశాఖపట్నం వచ్చేశాడు. గాజువాక పరిధిలోని దయాల్‌నగర్‌లో అద్దెకు ఉంటూ భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూ పనికి వెళుతూ వచ్చిన డబ్బులతో పిల్లలను చదివిస్తూ ఆనందంగా జీవిస్తున్నాడు. కానీ, టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండున్నర నెలలుగా ఇసుక దొరక్క భవన నిర్మాణాలు నిలిచిపోయాయని, పని దొరకడం లేదని వెంకటరమణ తెలిపారు. రోజూ ఉదయం మేస్త్రీల వద్దకు వెళ్లి రెండు గంటలు కూర్చుంటున్నానని, ఎక్కడా పని లేదని చెబుతుండటంతో తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నానని, ఆరి్థకంగా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పనులు లేక తాను, తన భార్య ఒకపూట పస్తు ఉండాల్సి వస్తోందని, తమ భవిష్యత్ ఏమిటో అర్థం కావడం లేదని వెంకటరమణ ఆందోళన వ్యక్తంచేశారు. ‘తమ్ముళ్ల’కు కాసులు.. కార్మికులకు కష్టాలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ వర్షాకాలంలో ఇసుకకు ఇబ్బంది లేకుండా ముందుచూపుతో 80 లక్షల టన్నులు నిల్వ చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన పది రోజుల్లోనే 40 లక్షల టన్నుల ఇసుకను ఆయా పార్టీల నేతలు ఊడ్చేశారు. మిగిలిన 40 లక్షల టన్నులను ఉచితం పేరుతో అధిక ధరలకు విక్రయించారు. దాదాపు రెండున్నర నెలలుగా ఇసుక కొరత తీవ్రంగా ఉంది. దీంతో బ్లాక్‌లో 18 టన్నుల ఇసుక లారీ రూ.35 వేల నుంచి రూ.60 వేల వరకు పలుకుతోంది. అంత ధర చెల్లించి ఇసుక కొనుగోలు చేయలేక భవన యజమానులు, కాంట్రాక్టర్లు నిర్మాణాలను నిలిపివేశారు.ఒక ట్రాక్టర్ ఇసుక దొరికినా పూర్తయ్యే పనులు కూడా ఆగిపోయాయి. దీంతో భవన నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్న తాపీ మేస్త్రీలు, కూలీలతోపాటు అనుబంధంగా ఇటుకల తయారీ, సెంట్రింగ్, రాడ్ బెండింగ్, ప్లంబింగ్, కార్పెంటర్, పెయింటింగ్, సీలింగ్, టైల్స్, మార్బుల్స్, గ్రానైట్ తదితర 36 రకాల విభాగాల్లో ఉపాధి పొందుతున్న లక్షలాది మంది కార్మికులకు పని లేకుండాపోయింది. భవన నిర్మాణ, అనుబంధ రంగాలపై ఆధారపడి మన రాష్ట్రానికి చెందిన సుమారు 31 లక్షల మంది జీవనం సాగిస్తుండగా.. బిహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి మరో 14 లక్షల మంది ఈ పనుల కోసం వలస వచ్చారు. మొత్తం 45 లక్షల మంది కూటమి ప్రభుత్వ తీరుతో జీవనోపాధి కోల్పోయారు. వారి కుటుంబాలు రోడ్డునపడ్డాయి. జీవనాధారం కరువు నేను రోజూ తాపీ పనులకు వెళితేనే మా ఇల్లు గడుస్తుంది. రోజువారి కూలీతో భార్య, కుమారుడు, కుమార్తెను పోషించుకుంటున్నాను. గత ప్రభుత్వ హయాంలో ఇసుక లభ్యత బాగుండటంతో వారం రోజులు పని ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక అంటున్నారు. కానీ కైకలూరు నియోజకవర్గానికి రాజమండ్రి, విజయవాడ, భద్రాచలం వంటి ప్రాంతాల నుంచి ఇసుక రావాలి. రవాణా చార్జీలు, ఇతర ఖర్చులు పెరగడంతో ఇసుక రావడం లేదు. దీనివల్ల మాలాంటి కార్మికులకు జీవనాధారం కరువైంది. – కోమటి శ్యామ్‌ప్రసాద్, పెరికెగూడెం, ఏలూరు జిల్లా ఇళ్లలో పనికి పోతున్నా గతంలో రోజూ భవన నిర్మాణ పనులకు వెళ్లేదానిని. రెండు నెలలుగా ఇసుక లేక భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి. ఇక పిల్లల కోసమైనా కష్టపడి ఏదో ఒక పని చేయాలి కదా... చివరికి ఏ పనీ దొరక్క ఇళ్లలో పాచిపని చేయడానికి వెళుతున్నా. గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి పరిస్థితి ఏ రోజూ లేదు. – సరోజని, నెల్లూరు కొరత తీవ్రంగా ఉంది ఉచిత ఇసుక పాలసీ సక్రమంగా అమలు కావడంలేదు. దీనివల్ల ఇసుక కొరత తీవ్రంగా ఉంది. భవన నిర్మాణాలు ఆగిపోతున్నాయి. నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఉచిత ఇసుక పాలసీని ప్రభుత్వం సక్రమంగా అమలు చేసి భవన నిర్మాణ రంగాన్ని కాపాడాలి. – మామిడి రాము, క్రెడాయ్ గుంటూరు చాప్టర్ అధ్యక్షుడు -
Kuwait Building Fire: కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం... 49 మంది దుర్మరణం
దుబాయ్: గల్ఫ్ దేశం కువైట్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఏకంగా 49 మంది మరణించారు. వీరిలో ఏకంగా 42 మంది భారతీయులేనని సమాచారం. మరో 50 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. బాధితుల్లో ఎక్కువమంది కేరళకు చెందినవారని సమాచారం. తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఉపాధి కోసం వలస వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవడం తీవ్ర విషాదానికి గురిచేసింది. కువైట్ దక్షిణ అహ్మదీ గవర్నరేట్‌లో మాంగాఫ్ ప్రాంతంలోని ఆరు అంతస్థుల భవనంలో బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. తొలుత వంటగది నుంచి మంటలు వ్యాపించినట్లు తెలియజేశారు. ఈ భవనంలో 200 మందికిపైగా భవన నిర్మాణ కారి్మకులు నివసిస్తున్నారు. వివిధ దేశాల నుంచి వలస వచి్చన వీరంతా ఎన్బీటీసీ గ్రూప్ అనే నిర్మాణ సంస్థలో పని చేస్తున్నారు. కారి్మకుల వసతి కోసం ఈ సంస్థ సదరు భవనాన్ని అద్దెకు తీసుకుంది. మృతులు 20 నుంచి 50 ఏళ్ల లోపు వారేనని అరబ్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. అగ్నిమాపక సిబ్బంది చాలాసేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో కారి్మకులు నిద్రలో ఉన్నారు. దట్టమైన పొగ వ్యాపించింది. దాన్ని పీల్చడం వల్లే ఎక్కువ మంది మరణించారు.క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అగ్నిప్రమాదంలో చాలామంది భారతీయులు మరణించడంపై కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నెంబర్ +965–65505246 ఏర్పాటు చేసింది. సహాయం, సమాచారం అవసరమైన వారు తమను సంప్రదించాలని సూచించింది. బాధితులకు అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించింది. కువైట్ మొత్తం జనాభాలో భారతీయులు 21 శాతం(10 లక్షలు) ఉంటారు. కువైట్‌లోని మొత్తం కారి్మకుల్లో 30 శాతం మంది(దాదాపు 9 లక్షలు) భారతీయులే కావడం విశేషం. అగ్నిప్రమాదంలో మరణించినవారికి భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మాంగాఫ్ ప్రాంతంలోని ఘటనా స్థలాన్ని భారత రాయబారి ఆదర్శ్ స్వాయికా సందర్శించారు. గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న భారతీయులను పరామర్శించారు. తగిన సాయం అందిస్తామని భరోసా కలి్పంచారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించే విషయంలో కువైట్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. బాధితుల్లో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా, మరికొందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వివరించారు. యాజమాన్యం దురాశకు అమాయకులు బలి మాంగాఫ్ భవన యజమానిని తక్షణమే అరెస్టు చేయాలని కువైట్ ఉప ప్రధానమంత్రి షేక్ ఫహద్ అల్–యూసుఫ్ అల్–సబా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్మికులకు తగిన భద్రత కలి్పంచని భవన నిర్మాణ కంపెనీ యజమానికి సైతం అరెస్టు చేయాలన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కంపెనీ యాజమాన్యంతోపాటు భవన యజమాని దురాశ వల్ల అమాయకులు బలయ్యారని ఆయన విమర్శించారు. ఒకే భవనంలో పెద్ద సంఖ్యలో కారి్మకులు నివసించడం నిబంధనలకు విరుద్ధమేనని చెప్పారు. ఇలాంటి ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అగ్నిప్రమాదానికి బాధ్యులుగా గుర్తించి పలువురు అధికారులను కువైట్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతిహుటాహుటిన కువైట్‌కు మంత్రి రాజవర్ధన్ సింగ్కువైట్ అగ్నిప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రమాదంలో ఆప్తులను కోల్పోయినవారికి సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రారి్థస్తున్నట్లు చెప్పారు. కువైట్ భారత రాయబార కార్యాలయం సహాయక చర్యల్లో నిమగ్నమైందని ‘ఎక్స్’లో మోదీ పోస్టు చేశారు. ఈ ఉదంతంపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రధాని ఆదేశాల మేరకు విదేశాంగ శాఖ సహాయమంత్రి కీర్తివర్దన్ సింగ్ కువైట్‌కు బయలుదేరారు. సహాయ చర్యలను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తారు. మృతుల్లో మలయాళీలు ఎక్కువగా ఉన్నారన్న వార్తల నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అప్రమత్తమయ్యారు. కేంద్రం వెంటనే తగిన సాయం అందించాలని, బాధితులను ఆదుకోవాలని కోరుతూ విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌కు లేఖ రాశారు. -
ఆ తల్లికి ముగ్గురు ‘సరస్వతులు’
ఆమెకు ముగ్గురు కుమార్తెలు పుట్టడంతో భర్త విడిచిపెట్టాడు. అయినా, ఆమె కుంగి పోలేదు. కాయకష్టాన్ని నమ్ముకుంది. భవన నిర్మాణ కార్మికురాలిగా మారింది. వచ్చిన కూలిడబ్బులతో పిల్లలను సాకింది. ప్రభుత్వ పాఠశాలల్లో ముగ్గురు కుమార్తెలను చేర్పించింది. చదువు విలువ తెలియజేసింది. తల్లి కష్టాన్ని కుమార్తెలు గుర్తించారు. చదువులో రాణించారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైన వేళ పెద్దల అండదండలతో అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ముగ్గురిలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికకాగా, మరొకరు పీహెచ్డీ చేస్తున్నారు. అమ్మనమ్మకాన్ని గెలిపించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. శృంగవరపుకోట: శృంగవరపుకోట పట్టణంలో శ్రీనివాసకాలనీలో నివసిస్తున్న మాచిట్టి బంగారమ్మకు ముగ్గురు ఆడపిల్లలు. సరస్వతి, రేవతి, పావని. వీరిని విడిచి తండ్రి వెళ్లిపోయాడు. బంగారమ్మే కంటికి రెప్పలా సాకింది. భవన నిర్మాణ పనులు చేస్తూ వచ్చిన కూలి డబ్బులతో చదువులు చెప్పించింది. ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ వరకూ చదివిన 2వ కుమార్తె రేవతిని ఆర్థిక ఇబ్బందులతో ఒక దశలో చదువు మానిపంచాలనుకుంది. టెన్త్‌లో అత్యంత ప్రతిభ చూపిన రేవతికి స్థానిక పుణ్యగిరి విద్యాసంస్థల అధినేత ఎల్.సత్యనారాయణ తన కళాశాలలో ఉచితంగా ఇంటర్మీడియట్ లో ప్రవేశం కలి ్పంచారు. అత్యధిక మార్కులు సాధిస్తే భవిష్యత్‌లో కోరిన చదువుకు తనే ఖర్చు భరిస్తానంటూ భరోసా ఇచ్చారు. రేవతి ఇంటరీ్మడియట్‌లో 984 మార్కులు సాధించింది. ఎంసెట్‌లో ర్యాంక్ సాధించి గాయత్రి ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేసింది. 2019లో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం భర్తీచేసిన సచివాలయ ఉద్యోగాల్లో ధర్మవరం సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పోస్టు సాధించింది. అంతటితో వదిలేయకుండా ఏపీపీఎస్సీ పరీక్షలకు సాధన చేసింది. 2023 ఆగస్టులో పరీక్ష రాసింది. నవంబర్‌లో విడుదలైన ఫలితాల్లో విజయం సాధించింది. రేవతికి ప్రస్తుతం జోన్–1 పరిధిలో శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈగా నియమిస్తూ ప్రభుత్వం నుంచి మంగళవారం ఉత్తర్వులు అందాయి. ప్రస్తుతం రేవతి అక్క సరస్వతి ఏలూరులో సచివాలయ ఉద్యోగిగా పనిచేస్తుండగా, చెల్లెలు పావని పీహెచ్డీ చేస్తోంది. ముగ్గురు అమ్మాయిలు చదువులో రాణించడంతో తల్లి బంగారమ్మ సంతోషపడుతోంది. పిల్లలు సాధిస్తున్న విజయాలతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. -
Indo-Islamic Cultural Foundation: అయోధ్యలో మసీదు నిర్మాణం.. మేలో ప్రారంభం
లక్నో: రామజన్మభూమి– బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తీర్పు మేరకు అయోధ్యలో ప్రతిపాదిత మసీదు నిర్మాణ పనులు వచ్చే ఏడాది మేలో ప్రారంభం కానున్నాయి. అయోధ్యలోని ధన్నిపూర్‌లో మసీదు నిర్మాణ బాధ్యతలను ఇండో–ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్ తీసుకుంది. మసీదు నిర్మాణానికి అవసరమై నిధుల సేకరణకు వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి వివిధ రాష్ట్రాలకు ఇన్చార్జుల నియామకాలు చేపట్టాలని ట్రస్ట్ యోచిస్తోంది. ఫిబ్రవరిలో మసీదు తుది డిజైన్‌ను ఖరారు చేసి అధికారుల ఆమోదానికి పంపుతామని ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్‌బోర్డ్ చైర్మన్, ఇండో–ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ చీఫ్ ట్రస్టీ జుఫర్ ఫరూకీ తెలిపారు. ‘15 వేల చదరపు అడుగులకు బదులు 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మసీదు నిర్మాణం జరగనుంది. జవాబుదారీతనం, పారదర్శకత పాటిస్తూ నిధులు సేకరిస్తాం. ప్రభుత్వమిచ్చే భూమిలో మసీదుతో పాటు ఆస్పత్రి, లైబ్రరీ, కమ్యూనిటీ కిచెన్, మ్యూజియంలను కూడా నిర్మిస్తాం. నిర్మాణ పనుల కోసం ముంబైకి చెందిన సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నాం. నిధుల లభ్యతపైనే నిర్మాణ పనుల వేగం ఆధారపడి ఉంటుంది’’ అని ట్రస్ట్ సెక్రటరీ అథార్ హుస్సేన్ చెప్పారు. మధ్యప్రాచ్య మసీదుల శైలిలో రూపొందిన తొలి డిజైన్ తిరస్కరణకు గురవడం కూడా ఆలస్యానికి ఒక కారణమన్నారు. ప్రతిపాదిత మసీదు, ఇతర భవనాల డిజైన్‌ను మసీదు కమిటీ 2021లో అయోధ్య డెవలప్మెంట్ అథారిటీకి సమర్పించగా ఈ ఏడాది మార్చిలో అనుమతులు లభించాయి. కేంద్రం అయోధ్యలో ఐదెకరాలను యూపీ సున్ని సెంట్రల్ వక్ఫ్‌బోర్డ్‌కు అందజేయగా, బోర్డ్ మసీదు నిర్మాణ బాధ్యతలను ఇండో–ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్‌కు అప్పగించింది. -
కూలీ నంబర్ 1
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ప్రాజెక్ట్ హీరో యాప్‌లో 5 లక్షల మంది వర్కర్లు నమోదై ఉండగా.. ఇందులో హైదరాబాద్ నుంచి 12,285 మంది ఉన్నారు. యాప్‌లో రిజిస్టరైన 1.4 లక్షల ఉద్యోగ పోస్టింగ్‌లు, వాటి వినియోగ డేటాను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించింది. కరోనా కంటే ముందుతో పోలిస్తే ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిర్మాణ కూలీ 5 నుంచి 8% పెరిగితే.. హైదరాబాద్‌లో ఏకంగా 20% వృద్ధి చెందింది. నగరంలో పెద్ద ఎత్తున వాణిజ్య, ఆకాశహర్మ్యాల నిర్మాణాలు జరుగుతుండటం అత్యధిక కూలీ చెల్లింపులకు కారణం. పీఎఫ్, ఈఎస్ఐలు దక్కడం లేదు.. దేశంలోని ప్రధాన నగరాలలో ప్రభుత్వం నిర్ధేశించిన దినసరి కూలీ దక్కడం లేదని ప్రాజెక్ట్ హీరో ఫౌండర్ అండ్ సీఈఓ సత్యవ్యాస్ తెలిపారు. కేవలం 8.6 శాతం మంది కూలీలకు మాత్రమే ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్), 7.1% మందికి ఉద్యోగుల రాష్ట్ర బీమా (ఈఎస్ఐ) కవరేజ్‌లు అందుతున్నాయని పేర్కొన్నారు. యూపీ నుంచే వలసలెక్కువ.. ప్రస్తుతం దేశంలో 5.1 కోట్ల మంది నిర్మాణ కూలీలు ఉన్నారు. అత్యధికంగా కూలీలు ఉత్తర్‌ప్రదేశ్ నుంచి వలస వస్తున్నారు. ఇక్కడి నుంచి 42% మంది దేశంలోని వివిధ నగరాల్లోని నిర్మాణ రంగంలో పనిచేసేందుకు వస్తున్నారు. బిహార్ నుంచి 16%, పశ్చిమ బెంగాల్ నుంచి 10%, ఒడిశా నుంచి 9%, మహారాష్ట్ర నుంచి 6% కూలీలు వలస వస్తున్నారు. కరోనా తొలి దశలో నిర్మాణ రంగ కార్మికుల వెతలు, వలసలు ఇంకా కళ్లముందే కదలాడుతున్నాయి. క్రమంగా నిర్మాణ రంగం పుంజుకోవటంతో ఇప్పుడిప్పుడే కూలీలు గాడినపడుతున్నారు. ఈ విషయంలో దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్ బెటరనే చెప్పాలి. ఎందుకంటే కూలీలకు దినసరి వేతనాలు అందుతుంది ఇక్కడే కాబట్టి! నగరంలో భవన నిర్మాణ కార్మికులకు రోజుకు సగటున రూ.584 నుంచి రూ.1,035 మధ్య కూలీ గిట్టుతుంది. చిట్ట చివరి స్థానంలో నిలిచిన ఢిల్లీ–ఎన్సీఆర్లో రూ.515 నుంచి 925 మధ్య మాత్రమేనని కన్స్ట్రక్షన్ టెక్నాలజీ యాప్ ప్రాజెక్ట్ హీరో అధ్యయనంలో వెల్లడైంది. సమయానికి వేతనాలు చెల్లిస్తేనే.. గడువులోగా నిర్మాణాలను పూర్తి చేయడానికే నగర డెవలపర్లు ప్రాధాన్యం ఇస్తారు. అలా చేయాలంటే కూలీలకు, ఉద్యోగస్తులకు సమయానికి వేతనం చెల్లించాల్సి ఉంటుంది. కరోనా తొలి దశలో దేశవ్యాప్తంగా నిర్మాణ పనులు నిలిచిపోవటంతో లక్షలాది ని ర్మాణ కూలీలు పొట్టచేత పట్టు కొని సొంతూళ్లకు వెళ్లిపోయా రు. ఆ సమయంలో మా అన్ని ప్రాజెక్ట్‌లలోని 3 వేల మంది కూలీలను సుమారు 3 నెలల పాటు ఆహారం, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తదితర అవసరాలను సొంతంగా ఏర్పాటు చేశాం. – నరేంద్రకుమార్ కామరాజు, ఎండీ, ప్రణీత్ గ్రూప్ -
కన్స్ట్రక్షన్ వర్కర్స్కు నెలకి రూ.5వేలు.. సీఎం కీలక నిర్ణయం!
సాక్షి, న్యూఢిల్లీ: కాలుష్యం పెరిగిపోతున్న క్రమంలో కొత్త నిర్మాణాలు, కూల్చివేతలపై ఢిల్లీ ప్రభుత్వం నిషేదం విధించింది. దీంతో వందల మంది కార్మికులపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో కీలక నిర్ణయం తీసుకున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ప్రభుత్వ నిర్ణయంతో ప్రభావితమైన నిర్మాణ రంగ కార్మికులందరికీ ఆర్థిక సాయం అందించాలని కార్మిక శాఖ మంత్రి మనీశ్ సిసోడియాను ఆదేశించారు. ‘కాలుష్యం కారణంగా ఢిల్లీలో నిర్మాణ కార్యక్రమాలు ఆగిపోయాయి. నిషేదం తొలగించే వరకు నిర్మాణ రంగంలోని కార్మికులకు ఒక్కొక్కరికి నెలకి రూ.5వేలు ఆర్థిక సాయం అందించాలని లేబర్ మంత్రి మనీశ్ సిసోడియాను ఆదేశించాం.’అని ట్వీట్ చేశారు అరవింద్ కేజ్రీవాల్. ఎన్సీఆర్ పరిధిలో గాలి నాణ్యత పడిపోయిన క్రమంలో అక్టోబర్ 30న గాలి నాణ్యత నిర్వహణ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ప్రాంతంలో నిర్మాణ కార్యకలాపాలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. Pollution के ख़िलाफ़ लड़ाई में CM @ArvindKejriwal का बड़ा फ़ैसला‼️ 🔹Construction पर लगी रोक के मद्देनज़र Construction मज़दूर को ₹5000-₹5000 आर्थिक मदद देने का फ़ैसला लिया। 🔹 दिल्ली में निर्माण पर पाबंदियां रहने तक मज़दूरों को आर्थिक सहायता दी जाएगी। AAP की सरकार-आप के साथ। — AAP (@AamAadmiParty) November 2, 2022 ఇదీ చదవండి: ‘అప్పుడు ఆజాద్.. ఇప్పుడు గెహ్లట్.. మోదీ ప్రశంసలు ఆసక్తికరం’.. పైలట్ సంచలన వ్యాఖ్యలు -
నందిరెడ్డిగారిపల్లె ప్రత్యేకత ఏంటో తెలుసా!
కురబలకోట(అన్నమయ్య జిల్లా) : ఒక్కో ఊరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. బేల్దార్లు (తాపీ మేస్త్రీలు), భవన నిర్మాణ కార్మికులున్న ఊరుగా కురబలకోట మండలంలోని నందిరెడ్డిగారిపల్లె పెట్టింది పేరు. ఇది కష్టజీవుల ఊరు. ఏ ఇంట్లో చూసినా తాపీ, గజం కట్టి, టేపు, మూల మట్టం కన్పిస్తాయి. వీరు కూడా అంతా ముస్లిం మైనార్టీలే. 40 ఏళ్ల క్రితం తొలుత ఆ ఊరికి చెందిన షేక్ నూరాసాబ్ ఈ వృత్తికి ఆద్యులుగా చెబుతారు. ఆ తర్వాత దర్గా ఖాదర్‌వల్లీ ఈ వృత్తిని స్వీకరించడంతో అతని వద్ద మరికొందరు బేల్దార్లు, మేస్త్రీలు తయారయ్యారు. ఇలా ఒక్కరొక్కరుగా పనికి వెళుతూ మిగిలిన వారు కూడా కాలక్రమంలో బేల్దార్లు అయ్యారు. ఇప్పుడు ఆ ఊరిలో 75 శాతం మందికి ఇదే జీవనాధారం. ఈ వృత్తినే పరంపరగా సాగిస్తున్నారు. ఇంటికి ఇద్దరు ముగ్గురు కూడా బేల్దార్లు ఉన్నారు. చేతిపని కావడంతో వచ్చే ఆదాయం ఇళ్లు గడవడం ఇతర అత్యవసరాలు తీరడానికి సరిపోతోందని చెబుతున్నారు. ఉదయం ఏడు గంటలకు పనికి బయలు దేరి సాయంత్రం ఐదు గంటల వరకు పనులు చేసి తిరిగి ఇళ్లకు చేరుకుంటారు. మంగళవారం మదనపల్లె సంత కావడంతో సెలవు తీసుకుంటారు. ఈ ఊరిలో 2221 జనాభా, 621 కుటుంబాలు, 1063 మంది ఓటర్లు ఉన్నారు. 90 శాతం అక్షరాస్యత ఉంది. ఈ ఊరి తర్వాత మండలంలోని సింగన్నగారిపల్లె, పందివానిపెంట కూడా భవన నిర్మాణ కార్మికులకు పెట్టింది పేరు. మదనపల్లె, కురబలకోట పరిసర ప్రాంతాలకు వీరు పనులకు వెళతారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించి వీరికోసం వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. (క్లిక్: చదివింది ఏడో తరగతి.. నాదస్వర సాధనలో దిట్ట) యువతరం చదువులపై దృష్టి నేటి తరం చదువులపై దృష్టి సారిస్తున్నారు. ఉద్యోగాల పట్ల మక్కువ చూపుతున్నారు. ఈ వృత్తి పట్ల యువకులు విముఖత చూపుతున్నారు. ప్రభుత్వ ఉర్దూ యూపీ స్కూల్ ఉంది. ఈ ఊరిలో సచివాలయం కూడా ఉంది. వెనుకబడిన ఆ ఊరు ఇప్పుడిప్పుడే వివిధ ప్రభుత్వ పథకాలతో క్రమేణా పేదరికం నుంచి బయటపడుతోంది. భవన నిర్మాణ కార్మికులకు 55 ఏళ్లకే పింఛన్ సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా ఇళ్లు కట్టుకున్నాం. మా ఇళ్లను మేమే ఉన్నంతలో సంతోషంగా కట్టుకుంటాం. – మోదీన్ సాబ్, బేల్దారి, నందిరెడ్డిగారిపల్లె ఎన్నేళ్లయినా ఉపాధికి ఢోకాలేదు ఈ వృత్తితో ఎన్నేళ్లయినా ఉపాధికి ఢోకా లేదు. కట్టడాలు, భవన నిర్మాణాలు నిరంతరం జరుగుతుంటాయి. పని లేదన్న చింత లేదు. సీఎం జగన్ ప్రభుత్వంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ క్లినిక్ భవనాలు, జగనన్న ఇళ్లు లాంటి తదితర ఎన్నో అభివృద్ధి పనుల వల్ల రెండు చేతులా తరగని పని ఉంది. కాలానికి తగ్గట్టుగా టెక్నాలజీ వచ్చింది. యంత్రాల సాయంతో పని కూడా సులభతరంగా మారింది. తాపీనే మాకు పెట్టుబడి.. ఆపై జీవనాధారం. ఖర్చులు పోను నెలకు రూ. 20 వేలు వరకు మిగులుతుంది. – కమాల్‌సాబ్, బేల్దారి, నందిరెడ్డిగారిపల్లె అభివృద్ధి బాటపడుతోంది ఈ ఊరు దశాబ్దాలుగా పేదరికాన్ని అనుభవించింది. సచివాలయాలు రాక మునుపు సరైన రోడ్డు లేదు. వీధులు సరిగ్గా ఉండేవి కావు. ఇప్పుడు పక్కా రోడ్డు ఉంది. పక్కా ఇళ్లు మంజూరయ్యాయి. పింఛన్లు వస్తున్నాయి. వివిధ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. 31 డ్వాక్రా గ్రూపులు ఉండగా వాటి ద్వారా రూ. 3 కోట్లు టర్నోవర్ ఉంది. డబ్బుకు ప్రైవేటు వారిని ఆశ్రయించాల్సిన పనిలేదు. ఈ ఊరు మదనపల్లె పట్టణానికి సమీపంలోనే ఉంది. ఇది కూడా వీరికి కలసి వచ్చింది – సఫియా, గ్రామ కార్యదర్శి, నందిరెడ్డిగారిపల్లె నాడు రూ. రెండున్నర.. నేడు రూ.800 మేము పనిచేసే తొలి నాళ్లలో బేల్దార్లకు రోజుకు రెండున్నర రూపాయి ఇచ్చేవారు. ఇప్పుడు రూ. 700 నుంచి రూ. 800 వరకు ఉంది. గుర్తుంపు కార్డులు ఇచ్చారు. వాటి అవసరం పెద్దగా ఏర్పడ లేదు. అల్లా దయవల్ల ప్రమాదకర ఘటనల బారిన పడలేదు. సత్తువ, శక్తి ఉన్నన్నాళ్లు ఈ పని చేసుకోవచ్చు. ఎప్పటికీ డిమాండు ఉంటుంది. – హైదర్‌వల్లీ, బేల్దారి, నందిరెడ్డిగారిపల్లె -
వావ్ వాట్ ఏ టాలెంట్.. మైకెల్ జాక్సన్ స్టెప్పులతో అదరగొట్టిన కార్మికుడు
భారత్‌లో ప్రతిభావంతులకు కొదవే లేదు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. కానీ అది నిరూపించుకునేందుకు సరైన సమయం కావాలి. చాలామందిలో టన్నుల కొద్దీ టాలెంట్ ఉన్నప్పటికీ విజయం సాధించలేకపోవచ్చు. ఎన్నో కారణాల వల్ల తమలోని ప్రతిభను పక్కన పెట్టేసి చిన్నా, చితక పనులు చేస్తూ జీవించేస్తుంటారు. అయితే ఎదో ఒక సమయంలో మనలోని టాలెంట్ తప్పకుండా బయటడుతుంది. దీనికి తోడు ఇటీవల కాలంలో సోషల్ మీడియా వినియోగం పెరగడంతో మారుమూల ప్రాంతంలోని ప్రతిభ కలిగిన వ్యక్తులు కూడా ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. రాత్రికి రాత్రే పాపులారిటీ సంపాదించి నలుగురిలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. అచ్చం ఇలాగే భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి తనలోన దాగున్న డ్యాన్స్ టాలెంట్‌తో మెస్మరైజ్ చేశాడు. తోటి కార్మికులతో కలిసి వర్క్ ప్రదేశంలో పనిచేస్తుండగా డ్యాన్స్ చేసి అబ్బుర పరిచాడు. మైకెల్ జాక్సన్ వలె అద్భుత డ్యాన్స్ స్టెప్పులతో దుమ్ములేపాడు. ఎంతో కష్టమైన డ్యాన్స్ మూమ్స్ను కూడా అలవోకగా చేస్తూ అందరిని మెప్పించాడు. ఈ వీడియో పాతదే అయినప్పటికీ తాజాగా దీనిని ఓ యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. చదవండి: కొంపముంచిన డెలివరీ ఇన్స్ట్రక్షన్.. రూ.500 చిల్లర తీసుకురమ్మంటే! హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, అల్లు అర్జున్, మాధురీ దీక్షిత్, ప్రభుదేవా, రెమో డీసౌజా వంటి డ్యాన్సర్లు, హీరోలను ట్యాగ్ చేస్తూ పోస్టు చేసిన ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు అతడి ప్రతిభను ప్రశంసిస్తున్నారు. ఎంతో అద్భుతం, గొప్ప డ్యాన్సర్, ఇంత స్మూత్ డ్యాన్స్ స్టెప్పులను ఎప్పుడూ చూడలేదంటూ పొగడ్తలతో ముంచేస్తున్నారు. బాలీడు్ నటుడు షాహిద్ కపూర్ కూడా రీట్వీట్ చేస్తూ..‘చాలా బాగుంది. ప్రతిభ ఎప్పుడూ షైన్ అవుతూనే ఉంటుంది. దానిని అణచివేయలేరు. తెలివైన, ఎంతో స్ఫూర్తిదాయకం.’ అని పేర్కొన్నారు. Please,enjoy this video & respect his talent & skills of dance👍👌👌. @iHrithik @iTIGERSHROFF @aakankshalovely @RaghavJuyalOffi @alluarjun @PDdancing @shahidkapoor @MadhuriDixit @remodsouza . pic.twitter.com/XCls4DTzPv — Ajay Raturi (@AjayRaturi20) July 20, 2022 -
Viral Video: కార్మికులపై ప్రధాని మోదీ పూల వర్షం.. వారిని సన్మానించి, లంచ్ చేసి
వారణాసి : కాశీ విశ్వనాథ ఆలయ కారిడార్ నిర్మాణ రంగ కార్మికులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ పూల వర్షం కురిపించారు. కారిడార్ నిర్మాణంలో పాల్గొన్న వారిపై పూలు చల్లి సన్మానించారు. ప్రతి ఒక్క కార్మికుడిపై పూలు చల్లేందుకు ఆ ప్రాంగణమంతా తిరిగారు. ఈ సందర్భంగా కొంతమంది కార్మికులను మోదీ ఆప్యాయంగా పలకరించి, ముచ్చటించారు. కారిడార్ నిర్మాణ పనుల్లో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్జతలు తెలియజేశారు. అనంతరం వారితో గ్రూప్‌ఫోటో దిగారు. కొద్దిసేపు ముచ్చటించి వారితో లంచ్ కూడా చేశారు. కాగా ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో సోమవారం ప్రధాని మోదీ కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ కారిడార్‌ను జాతికి అంకితం చేశారు. కాశీ విశ్వనాథుడి మందిరం, కాల భైరవేశ్వరుడి ఆలయాన్ని ఆధునికీకరించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. దీని నిర్మాణ వ్యయం 339 కోట్ల రూపాయల పైమాటే. ఈ కార్యక్రమం కంటే ముందు కాశీ విశ్వనాథుడికి ప్రధాని మోదీ జలాభిషేకం చేశారు. గంగా నదిలో పుణ్య స్నానం చేసి.. ఆ నది జలంతో విశ్వనాథుడి వద్దకు వెళ్లి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు శాస్త్రోక్తంగా రుద్రాభిషేకం నిర్వహించారు. వారణాసి ఎంపీగా.. కాశీ విశ్వనాథ్ కారిడార్ పనులకు 2019 మార్చి 8న మోదీ శంకుస్థాపన చేయగా, రూ.339 కోట్లతో పూర్తయిన కాశీ విశ్వనాథ్ కారిడార్ తొలి దశ పనులను ఇవాళ మోదీ ప్రారంభించారు. కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టు కేవలం భవనాల నిర్మాణం కాదని.. భారత సనాతన సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక అని మోదీ అన్నారు. #Varanasi: PM @narendramodi honours Swacchata Mitra at the inauguration of #KashiVishwanathDham pic.twitter.com/GQi31u53K3 — DD News (@DDNewslive) December 13, 2021 -
వేతన బకాయిలు అడిగితే... చెయ్యి నరికేశాడు
రేవా: చేసిన పనికి సక్రమంగా వేతనం చెల్లించమని అడగడమే ఆ అభాగ్యుడి పాపమైంది. మధ్యప్రదేశ్‌లోని రేవ జిల్లాలోని దోల్‌మౌ గ్రామంలో గణేష్ మిశ్రా అనే మేస్త్రీ వద్ద నిర్మాణ కూలీగా పనిచేస్తున్నాడు బాధితుడు అశోక్ సాకేత్. గణేష్ సక్రమంగా వేతనాలు చెల్లించకుండా ఎంతోకొంత విదిలిస్తూ వస్తున్నాడు. దీంతో విసిగిపోయిన అశోక్ సాకేత్ శనివారం సహచర కూలీతో కలిసి వెళ్లి తమకు రావాల్సిన కూలీ బకాయిలను చెల్లించాలని గట్టిగా నిలదీశాడు. ఫలితంగా వారిమధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆవేశం పట్టలేని గణేష్ మిశ్రా, అతని మిత్ర బృందం పదునైన ఆయుధంతో దాడి చేసి అశోక్ సాకేత్ చెయ్యిని నరికివేశారు. అంతేకాకుండా తెగిపడిన చెయ్యిని దాచేసే ప్రయత్నం చేశారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుడు అశోక్‌ను రేవాలోని సంజయ్ గాంధీ మెమోరియల్ ఆసుపత్రికి తరలించారు. శస్త్రచికిత్స చేసిన డాక్టర్లు అశోక్ చెయ్యిని తిరిగి అతికించారు. అయితే అధిక రక్తస్రావం కావడం మూలంగా బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. -
దీపావళి బొనాంజా.. నిర్మాణ కార్మికులకు గుడ్ న్యూస్
చంఢీగడ్: రాష్ట్రంలోని భవన, ఇతర నిర్మాణ కార్మికులకు దీపావళి కానుక అందించనున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్ కారణంగా నిర్మాణ పనులు తగ్గటంతో వేలాది మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే వారికి ఆర్థికంగా ఆదుకోవడం కోసం ఆర్థిక సాయం అందిస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ బుధవారం ప్రకటించారు. బిల్డింగ్, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమబోర్డు(BOCW)లో రిజిస్టర్ అయిన ప్రతి కార్మికుడికి దీపావళి పండగను పురస్కరించుకొని రూ.3,100 ఆర్థిక సాయం అందిస్తామని సీఎం ట్వీటర్లో పేర్కొన్నారు. సీఎం ప్రకటనతో భవన, ఇతర నిర్మాణ కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 3.17 మంది కార్మికులు అధికారికంగా బీఓసీడబ్ల్యూలో రిజిస్టర్ అయి ఉన్నారు. అయితే ఈ ఆర్థిక సాయం నేరుగా కార్మికుల బ్యాంక్ ఖాతాలో చేరనుంది. On the eve of Diwali, My Govt. announces financial relief of Rs.3100 each for construction workers registered with BOCW Welfare Board (3.17 lakh workers across the State). A "Shagun" for workers as they have suffered immense losses in the wake of Covid Pandemic. pic.twitter.com/xpnLQRsVDt — Charanjit S Channi (@CHARANJITCHANNI) November 3, 2021 -
ఆస్ట్రేలియాలో యాంటీ వ్యాక్సిన్ నిరసన గళం
మెల్బోర్న్: ఆస్ట్రేలియా రాజధాని మెల్బోర్న్లో యాంటీ వ్యాక్సిన్ నిరసనలు చోటు చేసుకున్నాయి. నిర్మాణ రంగంలో పని చేసే వ్యక్తులు తప్పనిసరిగా ఒక్క డోసు వ్యాక్సిన్ అయినా వేయించుకోవాలని నిబంధన పెట్టింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు 1000 మందికిపైగా నిరసనకారులు రోడ్లెక్కారు. నిర్మాణకారులు ధరించే జాకెట్లు, బూట్లు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు. ప్రభుత్వం కూడా భారీ స్థాయిలో పోలీసులను రంగంలోకి దింపి నిరసనను అణచివేసే ప్రయత్నం చేసింది. దీంతో భారీ నిరసన చోటు చేసుకుంది. నిరసనకారులను అణచివేసేందుకు పోలీసులు పెప్పర్ స్ప్రేలను, రబ్బర్ బాల్ గ్రెనేడ్లను, ఫోమ్ బాటన్ రౌంట్లను ప్రయోగించారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయని విక్టోరియా రాష్ట్ర పోలీస్ చీఫ్ షేన్ పాటన్ పేర్కొన్నారు. 40 మంది నిరసనకారులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. షట్‌డౌన్ చేయడంతో.. మెల్బోర్న్ సహా పలు నగరాల్లో నిర్మాణ పనులను మంగళవారం నుంచి రెండు వారాల పాటు నిలిపివే యనున్నట్లు ప్రభుత్వం సోమవారం రాత్రి ప్రకటిం చింది. అప్పటి నుంచే నిరసన ప్రారంభమైంది. అయితే అధికారులు మాత్రం పెరుగుతున్న కోవిడ్ కేసులను తగ్గించడంతో పాటు, ఆరోగ్య కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్ ఒక డోసు తీసుకున్న వారు అక్టోబర్ 5 నుంచి పను లకు రావచ్చని ప్రభుత్వం చెప్పింది. విక్టోరియా స్టేట్‌లో గత 24 గంటల్లో 603 కొత్త కేసులు నమోదయ్యాయి. -
Jagananna Amma Vodi: ‘అమ్మ ఒడి’ పిలిచింది
సాక్షి, కామారెడ్డి (తెలంగాణ): కొన్నేళ్ల క్రితం పొట్ట చేత పట్టుకుని తెలంగాణకు వలస వచ్చిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తాపీ మేస్త్రీలు, కూలీలు, కార్మికులను ‘అమ్మ ఒడి’ పథకం ఆకర్షిస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా రంగ అభివృద్ధికి తీసుకున్న విప్లవాత్మక చర్యలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిన వారి పిల్లలను సొంతూరిలో చదివించేలా చేస్తున్నాయి. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, వైఎస్సార్, కర్నూలు, ఉభయగోదావరి జిల్లాల నుంచి వచ్చిన తాపీ మేస్త్రీలు, సెంట్రింగ్ వర్కర్లు, కూలీలు, ఇతర వృత్తులకు చెందిన వేలాది కుటుంబాలు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో పనులు చేసుకుంటున్నాయి. చాలా మంది భార్య, పిల్లలతో కలసి అద్దె ఇళ్లల్లో ఉంటూ పనులు చేసుకుని బతుకుతున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని వీరు ఇంత కాలం తాము పని చేస్తున్న చోట పిల్లలను ప్రైవేటు బడుల్లో చేర్పించి, రూ.వేలల్లో ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ‘నాడు–నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చింది. అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నే రీతిలో బడులను తీర్చిదిద్దింది. దీనికి తోడు పిల్లలను బడికి పంపితే ‘అమ్మ ఒడి’ పథకం ద్వారా తల్లి ఖాతాలో ఏడాదికి రూ.15 వేలు జమ చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న చాలా మంది మేస్త్రీలు, కూలీలు తమ పిల్లలను సొంతూళ్లకు తీసుకెళ్లి అక్కడి బడుల్లో చేర్పించారు. ఒక్క కామారెడ్డి ప్రాంతంలోనే దాదాపు 180 మంది మేస్త్రీలు, వర్కర్లు తమ పిల్లల్ని సొంతూళ్లలో చేర్పించారు. నానమ్మ దగ్గరో, అమ్మమ్మ దగ్గరో వాళ్లను ఉంచి బడులకు పంపుతున్నారు. ఫీజులు కట్టే భారం తగ్గింది మాది ప్రకాశం జిల్లా పనులూరు మండలం యాంపాడు గ్రామం. నేను, నా భార్య శ్యామల, పిల్లలతో కలసి కామారెడ్డిలో ఉంటున్నాం. నా కొడుకు బన్నీ ఇప్పుడు ఏడో తరగతి చదువుతున్నాడు. కామారెడ్డిలో ప్రైవేటు బడిలో చదివించాను. ఏడాదికి రూ.16 వేల నుంచి రూ.18 వేల ఫీజు కట్టాను. మా దగ్గర సీఎం జగన్ అమ్మ ఒడి పథకం తీసుకురావడంతో పాటు అక్కడ స్కూళ్లల్లో అన్ని సౌకర్యాలు కల్పించారు. దీంతో నా కొడుకును వెంగళాపూరం స్కూల్లో చేర్పించాను. వాళ్ల అమ్మమ్మ ఇంట్లో ఉండి రోజూ వెళ్లి వస్తున్నాడు. అమ్మ ఒడి ద్వారా రూ.15 వేలు నా భార్య ఖాతాలో జమ అయ్యాయి. ప్రైవేటులో ఫీజులు కట్టే భారం తగ్గింది. సీఎం జగన్ చేసిన మేలు మరిచిపోలేం. – గడిపూడి బ్రహ్మయ్య, తాపీ మేస్త్రి, కామారెడ్డి ఇద్దరు కూతుళ్లను చేర్పించా మాది ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలం గరుగుపాలెం గ్రామం. పిల్లల చదువులకు ఇక్కడ వేలకు వేలు ఖర్చయ్యేవి. ఏపీ సీఎం జగన్ అమ్మ ఒడి పథకం తీసుకువచ్చిన తర్వాత నా ఇద్దరు కూతుళ్లు మాలశ్రీ, మాధురిలను లింగసముద్రంలోని హాస్టల్లో చేర్పించాను. పిల్లలిద్దరు బాగా చదువుతున్నారు. ఏడాదికి రూ.15 వేలు అమ్మ ఒడి కింద ఇస్తున్నారు. పండుగల సమయంలో ఇంటికి వెళ్లినపుడు పిల్లలను కలిసి వస్తున్నాం. సీఎం జగన్ చేస్తున్న సాయం ఎంతో ఉపయోగపడుతోంది. – బుగ్గవరపు కొండయ్య, తాపీ మేస్త్రి, కామారెడ్డి చదువు విషయంలో మంచి నిర్ణయాలు మాది ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం గంగపాలెం గ్రామం. నేను, నా భార్య వెంకాయమ్మ, పిల్లలతో కలసి కామారెడ్డిలో ఉంటున్నాం. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ స్కూళ్లల్లో అన్ని సౌకర్యాలు కల్పించారు. దీంతో మా కొడుకు చంద్రమాధవ్‌ను తిమ్మారెడ్డిపాలెంలోని మోడల్ స్కూల్లో చేర్పించాను. చదువు చాలా బాగా చెబుతున్నారు. ఇప్పుడు పదో తరగతి చదువుతున్నాడు. ఇక్కడ చదివిస్తే అధికంగా ఫీజులు కట్టాల్సి వచ్చేది. సీఎం జగన్ చదువు విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. – దేవూరి వెంకట్రావ్, తాపీ మేస్త్రి, కామారెడ్డి చదువు బాగా చెబుతున్నారు మాది ప్రకాశం జిల్లా లింగారెడ్డిపల్లి. నేను.. నా భార్య, కొడుకు, కూతురుతో కలసి కామారెడ్డిలో ఉంటున్నా. ఇక్కడ ప్రైవేటు బడిలో చదివించడానికి డబ్బు బాగా ఖర్చయ్యేది. ఏపీలో అమ్మ ఒడి పథకం తీసుకువచ్చిన తర్వాత అక్కడ స్కూళ్లు మెరుగయ్యాయని తెలిసి నా కొడుకు నవదీప్‌ను తీసుకువెళ్లి మా ఊరి స్కూల్లో 2వ తరగతిలో చేర్పించా. మా అమ్మా, నాన్న దగ్గర ఉంటున్నాడు. మొన్న అమ్మ ఒడి డబ్బులు వచ్చాయి. ప్రభుత్వ స్కూల్ అయినా చదువు బాగానే చెబుతున్నారు. – సీలం లక్ష్మీనారాయణ, సెంట్రింగ్ మేస్త్రి, కామారెడ్డి స్కూళ్లు బాగు చేసి మేలు చేశారు మాది ప్రకాశం జిల్లా మండాదివారిపల్లి గ్రామం. నేను, నా భార్య సుధాహాసిని, పాప వైష్ణవితో కలసి కామారెడ్డిలో ఉంటున్నాం. మా పాపను ఇక్కడ ప్రైవేటు స్కూల్లో చదివించాను. ఏడాదికి రూ.15 వేలకు పైగా ఖర్చయ్యేవి. ఏపీలో సీఎం జగన్ స్కూళ్లు బాగు చేశారు. అమ్మ ఒడి కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తున్నారని తెలియగానే మా పాపను వాళ్ల అమ్మమ్మ ఊరు కంచర్లవారిపల్లిలోని ప్రభుత్వ బడిలో చేర్పించాను. ఇప్పుడు నాలుగో తరగతి చదువుతోంది. రూ.15 వేలు అమ్మ ఒడి డబ్బులు నా భార్య ఖాతాలో జమ అయ్యాయి. – పాలకొల్లు చిన్న వెంకటేశ్వర్లు, సెంట్రింగ్ మేస్త్రి, కామారెడ్డి -
భవన నిర్మాణ కార్మికుల బాధ్యత నిర్మాణ సంస్థలదే
సాక్షి, హైదరాబాద్: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని చూసుకోవాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థల యాజమాన్యాలపై ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కార్మికుల్లో ఆత్మవిశ్వాసం నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని, వారి సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరించాలని నిర్మాణ సంస్థలను కోరారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై గురువారం బిల్డర్స్ అసోసియేషన్‌తో ప్రగతిభవన్‌లో కేటీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రియల్ ఎస్టేట్ రంగం గణనీయంగా అభివృద్ధి చెందడంతో భవన నిర్మాణదారులకు కూడా అభివృద్ధి ఫలాలు అందాయన్నారు. లక్షలాది మంది భవన నిర్మాణరంగ కార్మికులు దేశం నలుమూలల నుంచి ఉపాధి కోసం రాష్ట్రానికి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలతో భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడకుండా బిల్డర్లు తోడ్పాటు అందించాలన్నారు. నిర్మాణ పనులు జరుగుతున్న చోట కార్మికుల బాగోగులు, వారి అవసరాలు, సమస్యలపై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి క్షేత్ర స్థాయిలో వారి పరిస్థితిని అంచనా వేయాలని సూచించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్‌రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. కార్మికులకు నిత్యావసరాలు, భోజన సదుపాయం కల్పించేందుకు వీలుగా భవన నిర్మాణ సంస్థల యాజమాన్యాలకు అనుమతులు ఇవ్వాలని డీజీపీతో పాటు సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లకు ఫోన్లో ఆదేశించారు. కార్మికులకు కనీస వసతులు కల్పించడంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్ సమన్వయంతో పని చేయాలన్నారు. సంక్షేమాన్ని అశ్రద్ధ చేస్తే కఠిన చర్యలు: కాంట్రాక్టు, రోజు వారీ కూలీలకు వేతనాలు, కూలీ డబ్బుల చెల్లింపులో నిబంధనలు అతిక్రమించే వారిపై కఠి నంగా వ్యవహరిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రూ.కోటి చొప్పున విరాళం అందజేసిన క్రెడాయ్, మీనాక్షి గ్రూప్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, డైరెక్టర్ విçశ్వజిత్, వివిధ భవన నిర్మాణ యాజమాన్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అత్యవసర సేవల కింద ఔషధాల తయారీ కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఔషధ తయారీ పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర సేవల కింద పరిగణిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఫార్మా కంపెనీలకు లాకౌ ట్ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. వివిధ ఔషధ తయారీ, బల్క్ డ్రగ్ తయారీ పరిశ్రమల యాజమాన్యాలతో గురువారం ఆయన ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆయా సంస్థల ప్రస్తుత ఔషధ తయారీ సామర్థ్యంపై ఆరా తీయడంతో పాటు, అవసరమైన మందులను పూర్తిస్థాయి సామర్థ్యంతో ఉత్పత్తి చేయాలని సూచించారు. కరోనాపై జరుగుతున్న యుద్ధంలో ఫార్మా రంగం పో షిస్తున్న పాత్రను అభినందించారు. అత్యవసరం కాని ఔషధాల ఉత్పత్తిని తగ్గించడంతో పాటు, కరోనా నియంత్రణలో ఉపయోగించే మందుల ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేయాలని కోరారు. సోడియం హైపో క్లోరేట్, బ్లీచింగ్ పౌడర్, హ్యాం డ్ శానిటైజర్లకు ప్రస్తుతం ఎక్కువ డిమాండ్ ఉందని చెప్పారు. సామాజిక బాధ్యత సీఎస్ఆర్లో భాగంగా ఫార్మా కంపెనీలు వీటిని రాష్ట్ర ప్రభుత్వానికి సరఫరా చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఫార్మా సంస్థల కార్మికులు, ఉద్యోగుల సంక్షేమంతో పాటు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
భవన నిర్మాణ కార్మికుడిగా వార్నర్.!
సిడ్నీ : బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో ఏడాది పాటు నిషేదానికి గురైన ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ భవన నిర్మాణ కార్మికుడిగా మారాడు. గత కొద్దిరోజులుగా క్రికెట్‌కు దూరమైన ఈ సన్‌రైజర్స్ మాజీ కెప్టెన్ బ్యాట్‌కు బదులు డ్రిల్మిషన్ చేతపట్టుకోని కొత్త ఉద్యోగం చేస్తున్నాడు. అయితే నిర్మాణదశలో ఉన్న తన సొంత ఇంటి కోసం వార్నర్ ఈ కొత్త అవతారమెత్తాడు. ఈ విషయాన్ని అతని భార్య క్యాండి వార్నర్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. కార్మికుడిగా డ్రిల్ మిషన్‌తో వార్నర్ పని చేస్తున్న వీడియోను షేర్ చేసింది. అంతేకాకుండా తన కూతుళ్లు ఇవిమే(3), ఇండీ రే(2)లు ఇంటి నిర్మాణాన్ని పరీక్షిస్తున్నారని, వారి ఫొటోను సైతం పోస్ట్ చేసింది. ఇక వార్నర్ ధరించిన హ్యాట్‌పై ‘ డి వార్నర్, ప్రాజెక్ట్ మేనేజర్, అప్రెంటీస్ సెలబ్రిటీ అని రాసి ఉండటం విశేషం. సిడ్నీ శివారులో బీచ్‌కు సమీపంలో ఈ భవనం నిర్మితమవుతోంది. ప్రస్తుతం తన భార్య, ఇద్దరు పిల్లలతో వార్నర్ ఇంటి నిర్మాణ పనులు చూసుకుంటున్నాడు. దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో బాల్‌ట్యాంపరింగ్‌కు యత్నించి వార్నర్, బాన్‌క్రాఫ్ట్, స్టీవ్ స్మిత్‌లు అడ్డంగా బుక్కైన విషయం తెలిసిందే. ఈ ఘటనతో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగడంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) స్మిత్, వార్నర్‌లపై ఏడాది పాటు, యువ ఆటగాడు బాన్‌క్రాఫ్ట్‌పై 9నెలలు అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా నిషేదం విధించింది. దీంతో స్మిత్, వార్నర్‌లను బీసీసీఐ ఈ సీజన్ ఐపీఎల్‌కు అనుమతించలేదు. -
కప్పు పై నుంచి పడి యువకుడి మృతి
పైకప్పు నిర్మాణ పనులు చేస్తున్న యువకుడు ప్రమాదవశాత్తు అక్కడినుంచి జారిపడి మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా చేగుంటలోని జీవిక పరిశ్రమలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చేగుంటలోని జీవిక పరిశ్రమలో పైకప్పు నిర్మాణ పనుల్లో ఉన్న ఆసీఫ్(20) ప్రమాదవశాత్తు పై నుంచి కింద పడ్డాడు. గాయపడిన ఆసీఫ్‌ను ఆస్పత్రికి తరళిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతుడు ఉత్తర్‌ప్రదేశ్ వాసిగా గుర్తించి బంధువులకు సమాచారం అందించి కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత ్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. -
కార్మికుడికి అమితాబ్ అరుదైన కానుక
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్.. ఓ భవన నిర్మాణ కార్మికుడికి అరుదైన కానుక ఇచ్చారు. తాను మూడు దశాబ్దాలుగా తీపిగుర్తుగా దాచుకున్న ఓ జాకెట్‌ను అమితాబ్ అందజేశారు. 1981లో విడుదలయిన సిల్సిలా చిత్రంలో అమితాబ్ దీన్ని ధరించారు. పేదలకు ఉచితంగా పాత దుస్తులు పంపిణీ చేస్తున్న 'క్లాత్స్ బాక్స్ ఫౌండేషన్'కు మద్దతు తెలియజేస్తూ అమితాబ్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఇద్దరు ప్రతినిధులు, అమితాబ్‌తో కలసి భవన నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి కార్మికులకు దుస్తులను పంపిణీ చేశారు. అమితాబ్ స్వయంగా తన జాకెట్‌ను కార్మికుడికి అందజేశారు. అంతేగాక తాను వాడిన చాలా దుస్తులను కార్మికులు అందజేసినట్టు అమితాబ్ ట్వీట్ చేశారు. 'క్లాత్స్ బాక్స్ ఫౌండేషన్' ప్రతినిధులు పాత బట్టలను సేకరించి వాటిని పేదలకు ముఖ్యంగా శీతాకాలంలో అందజేస్తుంటారు.