Viral Video: Shahid Kapoor Bowled Over By Construction Worker Dance Moves - Sakshi
Sakshi News home page

వావ్‌ వాట్‌ ఏ టాలెంట్‌.. షాహిద్‌ కపూర్‌ మెచ్చిన డ్యాన్స్‌.. వైరలవుతోన్న వీడియో

Published Wed, Jul 20 2022 5:12 PM | Last Updated on Wed, Jul 20 2022 7:53 PM

Viral Video: Shahid Kapoor Bowled Over By Construction Worker Dance Moves - Sakshi

భారత్‌లో ప్రతిభావంతులకు కొదవే లేదు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్‌ ఉంటుంది. కానీ అది నిరూపించుకునేందుకు సరైన సమయం కావాలి. చాలామందిలో టన్నుల కొద్దీ టాలెంట్‌ ఉన్నప్పటికీ విజయం సాధించలేకపోవచ్చు. ఎన్నో కారణాల వల్ల తమలోని ప్రతిభను పక్కన పెట్టేసి చిన్నా, చితక పనులు చేస్తూ  జీవించేస్తుంటారు. అయితే ఎదో ఒక సమయంలో మనలోని టాలెంట్‌ తప్పకుండా బయటడుతుంది. దీనికి తోడు ఇటీవల కాలంలో సోషల్‌ మీడియా వినియోగం పెరగడంతో మారుమూల ప్రాంతంలోని ప్రతిభ కలిగిన వ్యక్తులు కూడా ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. రాత్రికి రాత్రే పాపులారిటీ సంపాదించి నలుగురిలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు.

అచ్చం ఇలాగే భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి తనలోన దాగున్న డ్యాన్స్‌ టాలెంట్‌తో మెస్మరైజ్‌ చేశాడు. తోటి కార్మికులతో కలిసి వర్క్‌ ప్రదేశంలో పనిచేస్తుండగా డ్యాన్స్‌ చేసి అబ్బుర పరిచాడు. మైకెల్ జాక్సన్‌ వలె అద్భుత డ్యాన్స్‌ స్టెప్పులతో దుమ్ములేపాడు. ఎంతో కష్టమైన డ్యాన్స్‌ మూమ్స్‌ను కూడా అలవోకగా చేస్తూ అందరిని మెప్పించాడు. ఈ వీడియో పాతదే అయినప్పటికీ తాజాగా దీనిని ఓ యూజర్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు.
చదవండి: కొంపముంచిన డెలివరీ ఇన్‌స్ట్రక్షన్‌.. రూ.500 చిల్లర తీసుకురమ్మంటే!

హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌, అల్లు అర్జున్‌, మాధురీ దీక్షిత్‌, ప్రభుదేవా, రెమో డీసౌజా వంటి డ్యాన్సర్లు, హీరోలను ట్యాగ్‌ చేస్తూ పోస్టు చేసిన ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు అతడి ప్రతిభను ప్రశంసిస్తున్నారు. ఎంతో అద్భుతం, గొప్ప డ్యాన్సర్‌, ఇంత స్మూత్‌ డ్యాన్స్‌ స్టెప్పులను ఎప్పుడూ చూడలేదంటూ పొగడ్తలతో ముంచేస్తున్నారు. బాలీడు్‌ నటుడు షాహిద్ కపూర్ కూడా రీట్వీట్‌ చేస్తూ..‘చాలా బాగుంది. ప్రతిభ ఎప్పుడూ షైన్‌ అవుతూనే ఉంటుంది. దానిని అణచివేయలేరు. తెలివైన, ఎంతో స్ఫూర్తిదాయకం.’ అని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement