కార్మికుడికి అమితాబ్ అరుదైన కానుక | Amitabh Bachchan Donates Iconic Jacket to Construction Worker | Sakshi
Sakshi News home page

కార్మికుడికి అమితాబ్ అరుదైన కానుక

Published Mon, Nov 23 2015 4:59 PM | Last Updated on Sun, Sep 3 2017 12:54 PM

కార్మికుడికి అమితాబ్ అరుదైన కానుక

కార్మికుడికి అమితాబ్ అరుదైన కానుక

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్.. ఓ భవన నిర్మాణ కార్మికుడికి అరుదైన కానుక ఇచ్చారు. తాను మూడు దశాబ్దాలుగా తీపిగుర్తుగా దాచుకున్న ఓ జాకెట్ను అమితాబ్ అందజేశారు. 1981లో విడుదలయిన సిల్సిలా చిత్రంలో అమితాబ్ దీన్ని ధరించారు.

పేదలకు ఉచితంగా పాత దుస్తులు పంపిణీ చేస్తున్న 'క్లాత్స్ బాక్స్ ఫౌండేషన్'కు మద్దతు తెలియజేస్తూ అమితాబ్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఇద్దరు ప్రతినిధులు, అమితాబ్తో కలసి భవన నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి కార్మికులకు దుస్తులను పంపిణీ చేశారు. అమితాబ్ స్వయంగా తన జాకెట్ను కార్మికుడికి అందజేశారు. అంతేగాక తాను వాడిన చాలా దుస్తులను కార్మికులు అందజేసినట్టు అమితాబ్ ట్వీట్ చేశారు. 'క్లాత్స్ బాక్స్ ఫౌండేషన్' ప్రతినిధులు పాత బట్టలను సేకరించి వాటిని పేదలకు ముఖ్యంగా శీతాకాలంలో అందజేస్తుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement