డేవిడ్ వార్నర్( క్యాండీ వార్నర్ ఇన్‌స్టాగ్రమ్ నుంచి)
సిడ్నీ : బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో ఏడాది పాటు నిషేదానికి గురైన ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ భవన నిర్మాణ కార్మికుడిగా మారాడు. గత కొద్దిరోజులుగా క్రికెట్‌కు దూరమైన ఈ సన్‌రైజర్స్ మాజీ కెప్టెన్ బ్యాట్‌కు బదులు డ్రిల్‌మిషన్ చేతపట్టుకోని కొత్త ఉద్యోగం చేస్తున్నాడు. అయితే నిర్మాణదశలో ఉన్న తన సొంత ఇంటి కోసం వార్నర్ ఈ కొత్త అవతారమెత్తాడు. ఈ విషయాన్ని అతని భార్య క్యాండి వార్నర్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. కార్మికుడిగా డ్రిల్ మిషన్‌తో వార్నర్ పని చేస్తున్న వీడియోను షేర్ చేసింది. అంతేకాకుండా తన కూతుళ్లు ఇవిమే(3), ఇండీ రే(2)లు ఇంటి నిర్మాణాన్ని పరీక్షిస్తున్నారని, వారి ఫొటోను సైతం పోస్ట్ చేసింది. ఇక వార్నర్ ధరించిన హ్యాట్‌పై ‘ డి వార్నర్, ప్రాజెక్ట్ మేనేజర్, అప్రెంటీస్ సెలబ్రిటీ అని రాసి ఉండటం విశేషం. సిడ్నీ శివారులో బీచ్‌కు సమీపంలో ఈ భవనం నిర్మితమవుతోంది. ప్రస్తుతం తన భార్య, ఇద్దరు పిల్లలతో వార్నర్ ఇంటి నిర్మాణ పనులు చూసుకుంటున్నాడు.
దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో బాల్‌ట్యాంపరింగ్‌కు యత్నించి వార్నర్, బాన్‌క్రాఫ్ట్, స్టీవ్ స్మిత్‌లు అడ్డంగా బుక్కైన విషయం తెలిసిందే. ఈ ఘటనతో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగడంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) స్మిత్, వార్నర్‌లపై ఏడాది పాటు, యువ ఆటగాడు బాన్‌క్రాఫ్ట్‌పై 9నెలలు అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా నిషేదం విధించింది. దీంతో స్మిత్, వార్నర్‌లను బీసీసీఐ ఈ సీజన్ ఐపీఎల్‌కు అనుమతించలేదు.
Comments
Please login to add a commentAdd a comment