బాల్ టాంపరింగ్ ఉదంతంలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై 2018లో క్రికెట్ ఆస్ట్రేలియా రెండేళ్ల పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దాంతో పాటు అతడి కెప్టెన్సీపై జీవితకాల బ్యాన్ విధించింది. అయితే ఆ సమయంలో కెప్టెన్‌గా ఉన్న స్టీవ్ స్మిత్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా కఠిన చర్యలు తీసుకోలేదు. దాంతో అతడు మళ్లీ టీమ్ వైస్ కెప్టెన్ అయ్యి.. ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో జట్టును కూడా నడిపిస్తున్నాడు.
ఈ క్రమంలో సీఏ విధించిన కెప్టెన్సీ బ్యాన్‌పై గతేడాది నవంబర్‌లో రివ్యూ పిటిషన్‌ను వార్నర్ దాఖలు చేశాడు. ఇందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీని క్రికెట్ ఆస్ట్రేలియా నియమించింది. అయితే ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్.. కేసును బహిరంగంగా విచారణ చేపట్టాలని నిర్ణయించడంతో వార్నర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీంతో తన రివ్యూ పిటిషన్‌ను వార్నర్ ఉపసంహరించుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క్రికెట్ ఆస్ట్రేలియాపై మరోసారి కీలక వాఖ్యలు చేశాడు.
"నా పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా తీరు చాలా హాస్యాస్పదంగా ఉంది. నేను గతాన్ని మార్చిపోవాలని భావిస్తుంటే.. వారు మాత్రం ఇంకా కొనసాగించాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు. ఎవరూ జవాబుదారీగా ఉండకూడదని, ఎవరూ నిర్ణయం తీసుకోకూడదనుకొన్నారు. క్రికెట్ ఆస్ట్రేలియాలో నాయకత్వలోపం సృష్టంగా కన్పిస్తోంది. ఇదే విషయంపై నేను టెస్టు మ్యాచ్‌లు ఆడే సమయంలో పదే పదే ఫోన్ కాల్స్ వచ్చేవి.
నేను లాయర్లతో మాట్లాడడేవాడిని. అది నా ఏకాగ్రతను దెబ్బతీసింది. ఇదంతా నాకు ఆగౌరవంగా అనిపించింది. అందుకే గతాన్ని మర్చిపోవాలని భావిస్తున్నా. ఈ కథ అంతా గతేడాది ఫిబ్రవరిలో ప్రారంభమైంది. కానీ ఈ విషయంపై మాత్రం నేను తీవ్ర నిరుత్సాహానికి గురయ్యా" అని సిడ్నీ మోర్నింగ్ హెరాల్డ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వార్నర్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment