
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మరో పది రోజుల్లో ప్రారంభం కానుంది. జూన్ 7 నుంచి లండన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఇకడబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఇరు జట్లనుంచి అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు.
తన ఎంచుకున్న జట్టులో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, ఉస్మాన్ ఖవాజాలకు పాంటింగ్ అవకాశం ఇచ్చాడు. అదే విధంగా ఫస్ట్‌డౌన్‌లో ఆసీస్ టాప్‌ఆర్డర్ బ్యాటర్ మార్నస్ లాబుషేన్‌కు చోటిచ్చాడు. ఇక సెకెండ్ డౌన్‌లో విరాట్ కోహ్లి ఛాన్స్ దక్కింది. అదే విధంగా వరుసగా నాలుగు ఐదు స్ధానాల్లో స్టీవ్ స్మిత్, రవీంద్ర జడేజా ఎంపికయ్యారు. తన జట్టులో వికెట్ కీపరగా అలెక్స్ కారీకు ప్లేస్ దక్కింది.
బౌలర్ల కోటాలో పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లయాన్, మహ్మద్ షమీకు అవకాశం దక్కింది. అయితే ఈ జట్టులో ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు చోటు దక్కకపోవడం కావడం గమనార్హం. ఇక తన ఎంచుకున్న ఈ ఉమ్మడి జట్టుకు రోహిత్ శర్మను కెప్టెన్‌గా పాంటింగ్ ఎంచుకున్నాడు.
రికీ పాంటింగ్ ఎంచుకున్న కంబైన్డ్ ప్లేయింగ్ ఎలెవన్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, రవీంద్ర జడేజా, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, మహ్మద్ షమీ
చదవండి: ODI WC 2023: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్, వేదికలు.. వివరాల వెల్లడి ఆరోజే: జై షా కీలక ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment