క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సమయం దగ్గరపడుతోంది. లండన్ వేదికగా జూన్ 7న ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా, భారత జట్లు తలపడనున్నాయి. కాగా ఈ మెగా ఫైనల్లో ఎవరు గెలుస్తారనే ఆంశంపై మాజీ క్రికెటర్‌లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
తాజాగా ఈ జాబితాలోకి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ చేరాడు. భారత్ కంటే ఆసీస్‌కే విజయం సాధించే ఛాన్స్‌లు ఎక్కువగా ఉన్నాయని పాంటింగ్ జోస్యం చెప్పాడు. లండన్‌లోని ఓవల్ మైదానం పరిస్థితులు ఆస్ట్రేలియా తరహాలోనే ఉంటాయని పాంటింగ్ తెలిపాడు.
"ఓవల్ పిచ్ ఆస్ట్రేలియా వికెట్ మాదిరిగానే ఉంటుంది. కాబట్టి ఆసీస్‌కు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే మ్యాచ్ భారత్‌లో జరిగితే కచ్చితంగా టీమిండియానే విజయం సాధించేది. ఆస్ట్రేలియా గెలవడం చాలా కష్టంన. అదే ఆస్ట్రేలియాలో జరిగితే ఆసీస్ ఫేవరెట్ అని చెబుతాను. ఈ ఫైనల్ ఇంగ్లండ్‌లో జరుగుతుంది కాబట్టి రెండు జట్లు కూడా తీవ్రంగా పోటీపడతాయి.
1990వ దశకం చివరలో లేదా 2000వ దశకం ప్రారంభంతో పోలిస్తే ఇప్పుడు విదేశీ గడ్డపై భారత్ అద్భుతుంగా ఆడుతోంది. వారి బ్యాటింగ్ స్కిల్స్ కూడా మెరుగయ్యాయి. గత 10-15 ఏళ్లలో భారత క్రికెట్ మంచి ఫాస్ట్‌బౌలర్లను తయారు చేసింది. వారు జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు" ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాంటింగ్ పేర్కొన్నాడు.
చదవండి: అతడే మ్యాచ్‌ను ఫినిష్ చేస్తాడని అనుకున్నా.. మేం షాక్‌లో ఉన్నాం: శాంసన్
Comments
Please login to add a commentAdd a comment