WC 2023- Aus Vs Ned- David Warner Century: నెదర్లాండ్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ప్రపంచకప్-2023లో వరుసగా రెండో శతకంతో అదరగొట్టాడు. తద్వారా అంతర్జాతీయ వన్డే కెరీర్‌లో 22వ సెంచరీ సాధించిన వార్నర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
తక్కువ ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించిన మూడో బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ రికార్డులు బద్దలు కొట్టాడు.
సచిన్‌తో పాటుగా.. పాంటింగ్ రికార్డు బ్రేక్
అంతేకాదు.. నెదర్లాండ్స్‌పై శతకంతో మరో రెండు అరుదైన ఘనతలు కూడా వార్నర్ తన ఖాతాలో వేసుకున్నాడు. వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ రికార్డు సమం చేయడంతో పాటు ఆసీస్ లెజెండ్ రిక్కీ పాంటింగ్‌ను అధిగమించాడు.
అదే విధంగా.. వరల్డ్‌కప్ హిస్టరీలో వరుస శతకాలు బాదిన నాలుగో ఆస్ట్రేలియా బ్యాటర్‌గానూ చరిత్ర లిఖించాడు. కాగా ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో నెదర్లాండ్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
ఈ క్రమంలో మిచెల్ మార్ష్‌ను 9 పరుగులకే డచ్ బౌలర్ వాన్ బీక్ ఆరంభంలోనే దెబ్బ కొట్టినప్పటికీ మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొత్తంగా 93 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 104 పరుగులు సాధించాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ 71, మార్నస్ లబుషేన్ 62 పరుగులతో అదరగొట్టారు.
నెదర్లాండ్స్‌తో మ్యాచ్ సందర్భంగా వార్నర్ రికార్డులు ఇవే
తక్కువ ఇన్నింగ్స్‌లోనే వన్డేల్లో 22 సెంచరీలు చేసిన క్రికెటర్లు
►126 - హషీమ్ ఆమ్లా
►143 - విరాట్ కోహ్లి
►153 - డేవిడ్ వార్నర్*
►186 - ఏబీ డివిలియర్స్
►188 - రోహిత్ శర్మ
వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక శతకాలు బాదిన బ్యాటర్లు
►7 - రోహిత్ శర్మ
►6 - సచిన్ టెండూల్కర్
►6 - డేవిడ్ వార్నర్*
►5 - రికీ పాంటింగ్
►5 - కుమార సంగక్కర
వరల్డ్‌కప్ టోర్నీలో వరుస సెంచరీలు సాధించిన ఆస్ట్రేలియా బ్యాటర్లు
►2 - మార్క్ వా (1996)
►2 - రికీ పాంటింగ్ (2003-07)
►2 - మాథ్యూ హేడెన్ (2007)
►2 - డేవిడ్ వార్నర్ (2023)*.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment