ఆస్ట్రేలియా జట్టు(ఫైల్ ఫోటో)
లండన్ వేదికగా జాన్ 7నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు యాషెస్ సిరీస్ కోసం 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.
ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్, ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్‌కు ఈ జట్టులో చోటు దక్కింది. గత కొంత కాలంగా వీరిందరూ టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉన్నారు. అదే విధంగా టెస్టుల్లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. ఆసీస్ సెలక్టర్లు మరోసారి అవకాశమిచ్చారు.
వార్నర్‌కు ఉన్న అనుభవం దృష్ట్యా సెలక్టర్లు మరోసారి నమ్మకం ఉంచారు. ఇక తన తల్లి మరణం కారణంగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోని చివరి రెండు టెస్ట్ మ్యాచ్‌లకు దూరమైన ఆస్ట్రేలియా రెగ్యూలర్ కెప్టెన్ పాట్ కమిన్స్ తిరిగి జట్టులోకి రానున్నాడు. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత జట్టును మే మొదటి వారంలో బీసీసీఐ ప్రకటించే ఛాన్స్ ఉంది.
డబ్ల్యూటీసీ ఫైనల్, యాషెస్ సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్, టోడిఫై మార్ష్, , మాథ్యూ రెన్షా, స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్), మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్
చదవండి: IPL 2023 SRH vs MI: నీ ఆటకు ఓ దండం రా బాబు.. వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకో పో!
Comments
Please login to add a commentAdd a comment