ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అదరగొడుతున్నాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో కూడా మార్ష్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఈ క్రమంలో మార్ష్‌కు ప్రమోషన్ ఇవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
2024 ఏడాది గాను మార్స్‌కు టాప్ సెంట్రాల్ కాంట్రక్ట్ ఇచ్చి భారీగా అతడి జీతాన్ని పెంచాలని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. మార్ష్ ప్రస్తుతం క్రికెట్ ఆస్ట్రేలియా సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో మిడిల్ టైర్‌లో ఉన్నాడు. అయితే టాప్ టైర్‌లో ఉన్న ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా సెంట్రల్ కాంట్రాక్ట్‌ను వదులకోవడంతో.. మార్ష్ ప్రమోషన్ దాదాపు ఖాయమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఒక వేళ అతడు టాప్ టైర్ కాంట్రాక్ట్‌కు ప్రమోషన్ పొందితే.. అతడు 5 లక్షల యూఎస్ డాలర్ల నుంచి 8 లక్షల యూఎస్ డాలర్ల వరకు వార్షిక వేతనం పొందే అవకాశముంది. అంటే భారత కరెన్సీలో సూమారు రూ. 4 కోట్ల నుంచి 7 కోట్ల వరకు అందనుంది. కాగా ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టులో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ అత్యధిక వేతనాన్ని పొందుతున్నాడు. అతడికి జీతం రూపంలో క్రికెట్ ఆస్ట్రేలియా 2 మిలియన్ డాలర్లు( భారత కరెన్సీలో రూ.16 కోట్లు) చెల్లిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment