మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా రాజధాని మెల్‌బోర్న్‌లో యాంటీ వ్యాక్సిన్ నిరసనలు చోటు చేసుకున్నాయి. నిర్మాణ రంగంలో పని చేసే వ్యక్తులు తప్పనిసరిగా ఒక్క డోసు వ్యాక్సిన్ అయినా వేయించుకోవాలని నిబంధన పెట్టింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు 1000 మందికిపైగా నిరసనకారులు రోడ్లెక్కారు. నిర్మాణకారులు ధరించే జాకెట్లు, బూట్లు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు. ప్రభుత్వం కూడా భారీ స్థాయిలో పోలీసులను రంగంలోకి దింపి నిరసనను అణచివేసే ప్రయత్నం చేసింది.
దీంతో భారీ నిరసన చోటు చేసుకుంది. నిరసనకారులను అణచివేసేందుకు పోలీసులు పెప్పర్ స్ప్రేలను, రబ్బర్ బాల్ గ్రెనేడ్లను, ఫోమ్ బాటన్ రౌంట్లను ప్రయోగించారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయని విక్టోరియా రాష్ట్ర పోలీస్ చీఫ్ షేన్ పాటన్ పేర్కొన్నారు. 40 మంది నిరసనకారులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
షట్‌డౌన్ చేయడంతో..
మెల్‌బోర్న్ సహా పలు నగరాల్లో నిర్మాణ పనులను మంగళవారం నుంచి రెండు వారాల పాటు నిలిపివే యనున్నట్లు ప్రభుత్వం సోమవారం రాత్రి ప్రకటిం చింది. అప్పటి నుంచే నిరసన ప్రారంభమైంది. అయితే అధికారులు మాత్రం పెరుగుతున్న కోవిడ్ కేసులను తగ్గించడంతో పాటు, ఆరోగ్య కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్ ఒక డోసు తీసుకున్న వారు అక్టోబర్ 5 నుంచి పను లకు రావచ్చని ప్రభుత్వం చెప్పింది. విక్టోరియా స్టేట్‌లో గత 24 గంటల్లో 603 కొత్త కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment