ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు! | Bathukamma Celebrated With Gaiety In Melbourne | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు!

Published Tue, Oct 24 2023 1:30 PM | Last Updated on Tue, Oct 24 2023 1:51 PM

Bathukamma Celebrated With Gaiety In Melbourne  - Sakshi

ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదో వార్షికోత్సవ బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో వెస్ట్‌ గేట్‌ స్పోర్ట్స్ సెంటర్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన తేలు విజయగారు బతుకమ్మ ఆట పాటలతో అందర్నీ అల్లరించారు.

ఈ కార్యక్రమం గత పది సంవత్సరాలుగా ఎంతో విజయవంతంగా నడిపిస్తున్నామని ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ బైరెడ్డి అన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ముందు తరాలకు అందించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బైరెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అవ్వడానికి ముఖ్య కారణము కమిటీ కార్యవర్గ సభ్యులు స్పాన్సర్స్, వాలంటీర్స్ అని అనిల్ బైరెడ్డి తెలిపారు. ఇకముందు కూడా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను మన ఆటపాటలను ముందు తరాల వారికి అందించే విధంగా కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మినిస్టర్స్ కౌన్సిల్ మేయర్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఏటీఏఐ కార్యవర్గ సభ్యులు కిరణ్ పాల్వాయి, ఫణికుమార్ , వంశీ కొట్టాల, రవి దామర, మహేష్ రెడ్డి ,శ్రీనివాస్ కర్ర, కిషోర్ యానం, మధుపైల, రఘు కోట్ల,దీపక్ హరి, కృష్ణ ఒడియాల, పుల్లారెడ్డి బద్దం, రాజవర్ధన్ రెడ్డి, మహేష్ బద్దం ,అమరేందర్ రెడ్డి, ప్రవీణ్ దేశం, సతీష్ పటి, శ్యాం లింగంపల్లి తదితరులు పాల్గొన్నారు.

(చదవండి: అబుదాబిలో బతుకమ్మ సంబరాలు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement