ManiShankar Aiyar
-
మరోసారి మణిశంకర్ అయ్యర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. స్పందించిన కాంగ్రెస్
ఢిల్లీ: కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి మణిశంకర్ అయ్యార్ చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదం అయ్యాయి. ఆయన మంగళవారం ఫారన్ కారెస్పండెంట్స్ క్లబ్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ‘‘1962 అక్టోబర్‌లో చైనా భారత్‌పై దండయాత్ర చేసింది’’ అని అన్నారు. ఆ సమయంలో తాను ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)కు తిరస్కరించబడిన విషయాన్ని కూడా పంచుకున్నారు.‘‘ఐఎఫ్ఎస్ పరీక్షలు లండన్‌లో ప్రారంభమయ్యాయి. అందులోనే పాస్ అయ్యాను. కానీ అడ్మిషన్ లేటర్ అందలేదు. దాంతో నేను నాకు జాయినింగ్ లెటర్ అందలేదని విదేశీ వ్యవహారాల శాఖకు తెలియజేశా. నేను అన్ని సర్వీసులకు తిరస్కరించబడినట్లు నాకు టెలిగ్రామ్ అందింది. అయితే నేను చైనా కోసం నిధులు సేకరించానని కొందరు నాపై ఆరోపణలు చేశారు. నాకు డిన్నర్ చేయడానికే ఆ రోజుల్లో డబ్బు లేదు. నేను ఎలా చైనాకు నిధులు సేకరిస్తాను?’’ అని అయ్యర్ వివరించారు.Mani Shankar Aiyar, speaking at the FCC, during launch of a book called Nehru’s First Recruits, refers to Chinese invasion in 1962 as ‘alleged’. This is a brazen attempt at revisionism.Nehru gave up India’s claim on permanent seat at the UNSC in favour of the Chinese, Rahul… pic.twitter.com/Z7T0tUgJiD— Amit Malviya (मोदी का परिवार) (@amitmalviya) May 28, 2024 అయితే.. భారత్‌పై చైనా దండయాత్ర చేసిందని అయ్యర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇటువంటి రెచ్చగొట్టె వ్యాఖ్యలు చేయటంపై మండిపడ్డారు. మణిశంకర్ వ్యాఖ్యలపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా తీవ్రంగా ఖండిచారు. 1962లో చైనా భారత దండెత్తినట్లు వ్యాఖ్యలు చేయటం.. ఈ సమయంలో రెచ్చగొట్టే ప్రయత్నమేనని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ చైనా అనుకూలంగా వ్యవహరించిందని ఘాటుగా విమర్శలు చేశారు. చైనా కాంగ్రెస్‌ను ప్రేమిస్తుందా? అని ప్రశ్నించారు.Mr. Mani Shankar Aiyar has subequently apologised unreservedly for using the term "alleged invasion" mistakenkly. Allowances must be made for his age. The INC distances itself from his original phraseology.The Chinese invasion of India that began on October 20 1962 was for… https://t.co/74oXfL1Ur2— Jairam Ramesh (@Jairam_Ramesh) May 28, 2024 అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తం కావటంలో కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆయన చేసిన వ్యాఖ్యలకు పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ‘ఎక్స్’లో తెలిపారు. ‘‘భారత్‌పై చైనా దండయాత్ర అనే మాట పొరపాటు అన్నానని అయ్యర్ క్షమాపణలు చెప్పారు. ఆయన వయసును బట్టి మనం స్వాగతించాలి. ఆయన చేసిన వ్యాఖ్యలకు పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. అక్టోబరు20, 1962న ప్రారంభమైన భారతదేశంపై చైనా దండయాత్ర నిజమే. మే, 2020లో లడాఖ్‌లో చైనా చొరబాట్లు కూడా జరిగాయి. ఇందులో 20 మంది భారత సైనికులు కూడా అమరులయ్యారు. భారత్ చర్చలను చైనా బలహీనపరుస్తోందని జూన్ 19, 2020న ప్రధాని మోదీనే బహిరంగంగా తెలిపారు. దేప్సాంగ్, డెమ్చోక్లో పాటు 2000 చదరపు కిలో మీటర్ల భూభాగం సైతం భారత సైన్యానికి అధీనంలో లేదు’ అని జైరాం రమేష్ మండిపడ్డారు. -
నామ్‌దార్‌కు ఇద్దరు బ్యాట్స్‌మెన్
దేవ్‌గఢ్ (జార్ఖండ్) / పాలిగంజ్ (బిహార్)/తాకి (పశ్చిమబెంగాల్): లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోనున్న నేపథ్యంలో నామ్‌దార్‌కు బాసటగా నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు బ్యాట్స్మన్లను బరిలోకి దింపిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎన్నికల్లో పేలవమైన ప్రదర్శనకు బాధ్యత వహించే పనిని ఆ పార్టీ మణిశంకర్ అయ్యర్, శామ్ పిట్రోడాలకు అప్పగించిందని విమర్శించారు. బుధవారం జార్ఖండ్‌లోని దేవ్‌గఢ్, బిహార్‌లోని పాటలీపుత్ర, పశ్చిమబెంగాల్లోని తాకి ఎన్నికల సభల్లో ఆయన మాట్లాడారు. ‘1984లో సిక్కుల ఊచకోతపై ‘అయ్యిందేదో అయిపోయింది’ అని ఒకరంటారు. ఇంకొకరు గుజరాత్ ఎన్నికల్లో నన్ను దూషించిన తర్వాత ఇన్నాళ్లూ తెరవెనుక ఉండి.. ఇప్పుడు మళ్లీ నాపై దాడికి (నీచ్ ఆద్మీ అంటూ) దిగుతున్నారు’ అని పిట్రోడా, అయ్యర్‌లను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. మే 23న ఏం జరగబోతోందనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ అని సభకు భారీ సంఖ్యలో హాజరైన ప్రజలనుద్దేశించి ప్రధాని అన్నారు. కాంగ్రెస్‌కు ఈ విషయం బాగా తెలుసని, అందుకే ఫలితాలను ఎదుర్కొనేందుకు సంసిద్ధమవుతోందని చెప్పారు. ఓటమిని ఎవరి తలపై రుద్దాలా అనే ఆలోచనలో పడిందన్నారు. నామ్‌దార్ కారణంగా ఓటమి పాలయ్యామని కాంగ్రెస్ ఎప్పుడూ చెప్పుకోదని, అది రాజవంశ సూత్రాలకు విరుద్ధమని విమర్శించారు. కేవలం ఐదో విడత ఎన్నికల తర్వాత మాత్రమే ఆ కుటుంబానికి చెందిన సమీప సభ్యులిద్దరూ సొంతగా బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టారని ఎద్దేవాచేశారు. బరిలోకి దిగకుండానే మ్యాచ్ ఆడే సాహసం కెప్టెన్‌ను అడక్కుండా వారు చేయరన్నారు. నిందను మోసేందుకు కాంగ్రెస్ నేతలు క్యూ కడుతున్నారన్నారు. ఉగ్రవాదులు, నక్సలైట్లు, వారి మద్దతుతారులను ప్రోత్సహించేలా రాజద్రోహ చట్టాన్ని నీరు గార్చాలని కాంగ్రెస్ ప్రయత్నించిందన్నారు. కానీ బీజేపీ అందుకు అనుమతించదని, తమ ప్రభుత్వం ఉగ్రవాదుల స్థావరాల్లోకి వెళ్లి మరీ దాడి చేసిందని చెప్పారు. భూతాలను తరిమినట్టు వారిని తరిమి కొట్టాలన్నారు. సైన్యానికి ఈ మేరకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చామన్నారు. దేశ భద్రత ఒక అంశమే కాదని మహా కల్తీ కూటమి నేతలంటున్నారని మోదీ ఆరోపించారు. లెక్కలేనన్ని ఉగ్రదాడుల్లో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నప్పుడు అది ఒక అంశంగా కాకుండా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఢిల్లీలో కూర్చున్నవారికి గిరిజనుల బాధలు పట్టవన్నారు. ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉండబోతున్నాయంటూ.. ఈసారి బిహార్‌కు తాజా అభివృద్ధి గంగ (వికాస్ కీ గంగ)ను తీసుకువస్తానని ప్రధాని అన్నారు. అయితే మరింత గొప్ప విజయం లభించేలా చివరి విడత పోలింగ్ ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం గూండాస్వామ్యంగా మారింది పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యం గూండాస్వామ్యంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అన్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బెంగాల్ రాష్ట్రంలో ఆత్యయిక స్థితిని సృష్టించారనీ, ప్రతీ దాన్ని నాశనం చేయడానికి ఆమె ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మోదీ ధ్వజమెత్తారు. ప్రజల ధైర్యం, నిశ్చయాలే ఆమె ‘తీవ్ర బాధాకరమైన పాలన’ నుంచి విముక్తి కల్పిస్తాయని మోదీ అన్నారు. ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు జిల్లాల్లో మోదీ బుధవారం ప్రచారం నిర్వహించారు. బెంగాల్‌లోని 42 సీట్లలో తమ పార్టీయే అధిక సీట్లు గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. -
నాటి మాటలు మరిచిన రాష్ట్రపతి కోవింద్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాజ్యాంగపరంగా తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించి నలుగురు సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేసిన విషయం తెల్సిందే. వారు వరుసగా రామ్ షాకల్, రాకేష్ సిన్హా, రఘునాథ్ మహాపాత్ర, సోనాల్ మాన్‌సింగ్‌లు. వారిలో రామ్ షాకల్ను ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రజా ప్రతినిథి అని, ప్రముఖుడని పేర్కొన్నారు. ఆయన యూపీలోని రోబర్ట్స్ గంజ్ నుంచి మూడుసార్లు పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం కూడా వహించారు. రాజ్యాంగంలోని 80వ అధికరంణంలోని మూడవ క్లాజ్ ప్రకారం సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, కళలు, సామాజిక సేవా రంగాలకు చెందిన ప్రముఖులను మాత్రమే రాష్ట్రపతి నేరుగా రాజ్యసభకు నామినేట్ చేయవచ్చు. ఈ రంగాలకు చెందిన ప్రముఖులు రాజకీయాల్లోకి రావడానికి గానీ, ఎన్నికల్లో పోటీ చేయడానికిగానీ ఇష్టపడరని, అలాంటి రంగాలకు చెందిన ప్రముఖుల సేవలను కూడా పార్లమెంట్ ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో నాడు రాజ్యాంగంలో ఈ నిబంధన తీసుకొచ్చారు. అయితే మన రాష్ట్రపతి కోవింద్ యూపీకి చెందిన రాజకీయ నాయకుడినే రాజ్యసభకు నామినేట్ చేశారు. రాష్ట్రపతి ఇలా రాజ్యాంగం అధికరణంకు విరుద్ధంగా రాజ్యసభకు నామినేట్ చేయడం ఇదే మొదటి సారి కాదు. 2016, ఏప్రిల్ నెలలో బీజేపీ నాయకులు సుబ్రమణియన్ స్వామి, నవజోత్ సింగ్ సిద్ధూ (ప్రస్తుతం కాంగ్రెస్) ఇలాగే నియమితులయ్యారు. గతంలో జగ్మోహన్ సింగ్, భూపిందర్ సింగ్ మాన్, ప్రకాష్ అంబేడ్కర్, గులాం రసూల్ ఖాన్లు ఇలాగే దొంగదారిన రాజ్యసభలో ప్రవేశించారు. ఇక్కడ విచిత్రమేమిటంటే 2009లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం హయాంలో రాజ్యసభకు కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ నామినేషన్‌ను అప్పుడు బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న రామ్‌నాథ్ కోవింద్ స్వయంగా వ్యతిరేకించారు. మణిశంకర్ అయ్యర్ సాహిత్యం రంగం పరిధిలోకి వచ్చినప్పటికీ ‘ఓ కాంగ్రెస్ నాయకుడిని ఇలా నామినేట్ చేయడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం. అన్ని రాజకీయ సంప్రదాయాలను కాలరాయడమే. ఇది కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తన అధికారాలను పూర్తిగా దుర్వినియోగం చేయడమే’ అని కోవింద్ ఘాటుగా విమర్శించారు. మరి ఇప్పుడు తాను చేసిందేమిటీ? ఒకరు చేస్తే తప్పు, తాను చేస్తే తప్పుకాదా? ద్వంద్వ రాజకీయాలంటే ఇదే కదా! -
గుజరాత్ ఫలితాలపై అయ్యర్ మౌనం
సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ ఓటమికి కారణమయ్యారన్న అపవాదు మూటగట్టుకున్న పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ మౌనం దాల్చారు. గుజరాత్ ఫలితాలపై స్పందించాలని మీడియా పట్టుబట్టినా ఎలాంటి వ్యాఖ్యలూ చేయని మణిశంకర్ నో కామెంట్ అంటూ సున్నితంగా తిరస్కరించి వార్తాపత్రికను చదవడంలో మునిగిపోయారు. మోదీపై తన వ్యాఖ్యలు పెనుదుమారం రేపడంతో మౌనంగా ఉండటమే మేలని అయ్యర్ భావిస్తున్నారు. అంతకుముందు గుజరాత్ ఎన్నికల ప్రచార పర్వంలో ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ ఆయనను నీచుడంటూ సంభోధించడం వివాదాస్పదమైంది. ప్రధానిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ అయ్యర్‌ను సస్పెండ్ చేసింది. గుజరాత్ ఎన్నికల్లో అయ్యర్ వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను దెబ్బతీసాయని స్వయంగా ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానించడం గమనార్హం. అయ్యర్ వ్యాఖ్యలతో గుజరాత్లో తమ కొంప మునిగిందని పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ వాపోయారు. పార్టీ శ్రేణుల నుంచి దాడి పెరగడంతో మౌనంగా ఉండటమే మేలని మణిశంకర్ అయ్యర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. -
ఎంతకు దిగజారావు మోదీ..!
ముంబై: అత్యంత నాటకీయంగా వ్యవహరిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్ ఎన్నికల ప్రచారాన్ని అథమస్థాయికి దిగజార్చారని బీజేపీ కలహాల మిత్రపక్షం శివసేన విరుచుకుపడింది. ప్రధాని మోదీ అభివృద్ధిని ప్రస్తావించేందుకు బదులు.. మొఘల్ కాలపు సమాధులను తవ్వుతున్నారని విమర్శించింది. 'ఇదే కారణంతో కాంగ్రెస్ పార్టీని గుజరాత్ ప్రజలు 22 ఏళ్లపాటు తిరస్కరించారు. ప్రధాని మోదీ తన సొంత రాష్ట్రంలో అభివృద్ధి, ప్రగతి అంశాలను పక్కనబెట్టి.. 'నువ్వెంత-నేనెంత' స్థాయికి దిగజారారు' అని శివసేన అధికార ప్రతిన 'సామ్నా' తన సంపాదకీయంలో విరుచుకుపడింది. మోదీ ప్రచారంలో ఊరికే భావోద్వేగానికి లోనువుతున్నారని, అతి దురుసుతనం ప్రదర్శిస్తున్నారని, ఇంత అట్టడుగుస్థాయి ప్రచార ఎత్తుగడలకు బీజేపీ దిగాల్సిన అవసరమేముందని శివసేన ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఒక్క రాహుల్ గాంధీని ఓడించడానికి ప్రధాని, బీజేపీ చీఫ్ అమిత్ షా, కేబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రి,అగ్రనేతలు అంతా తీవ్రంగా ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. రాజకీయ నిరుద్యోగి అయిన కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ మోదీని ఉద్దేశించి చేసిన 'నీచ్' వ్యాఖ్యలను చేశారని, ఈ వ్యాఖ్యల విషయంలో మోదీ అతిగా స్పందించారని శివసేన విమర్శించింది. అయ్యర్ ఈ వ్యాఖ్యల ద్వారా తననే కాదు.. గుజరాత్ ప్రజలను కూడా అవమానించారని మోదీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టింది. 'మోదీ జాతీయ నాయకుడిగా కంటే ప్రాంతీయ నాయకుడిగానే తనను తాను భావించుకుంటున్నారు. ఆయన ప్రజలందరి గౌరవ ప్రతిష్టల కోసం, హిందూ దేశ ప్రతిష్ట కోసం నిలబడాలని మేం కోరుకుంటున్నాం. కానీ, ఆయన ఇప్పటికీ గుజరాతీ భావనలోనే ఇరుక్కుపోయారు' అని సామ్నా మండిపడింది. 'ఆయన జాతీయ నాయకుడి కన్నా ప్రాంతీయ నాయకుడిగానే చెప్పుకుంటున్నారు. కానీ ఎవరైనా ప్రాంతీయ ఆత్మగౌరవం గురించి మాట్లాడితే.. జాతీయవాదం కత్తితో వారి గొంతులను వెంటనే నొక్కేస్తున్నారు' అని పేర్కొంది. గుజరాత్ ఎన్నికల్లో పాక్ జోక్యం చేసుకుంటుందన్న ప్రధాని వ్యాఖ్యలను సైతం శివసేన తప్పుబట్టింది. గుజరాత్ ప్రచారం భావోద్వేగ ప్రసంగాలు, కన్నీళ్లు, శివతాండవాలతో అత్యంత నాటకీయంగా మారిందని.. ప్రధాని మోదీ దేశ ప్రజలే నా కుటుంబం అన్న వ్యాఖ్యలను ఉటంకిస్తూ పేర్కొంది. -
‘గెలుపు కోసం దిగజారారు’
సాక్షి,న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు పతాక స్ధాయికి చేరాయి. గెలుపు కోసం బీజేపీ, కాంగ్రెస్‌లు తీవ్ర పదజాలంతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరం విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్‌తో కుట్రకు తెరలేపారంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్‌లపై ఆరోపణలు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పాక్ హైకమిషనర్‌తో మణిశంకర్ అయ్యర్, సీనియర్ కాంగ్రెస్ నేత హమిద్ అన్సారీలు రహస్యంగా భేటీ అయ్యారని ప్రధాని వ్యాఖ్యానించడంపై చిదంబరం మండిపడ్డారు.గుజరాత్లో గత రెండు రోజులుగా బీజేపీ చేస్తున్న ప్రచారం దిగజారిందని, ఎన్నికల్లో గెలుపు కోసం ఓ రాజకీయ పార్టీ ఎంతకైనా తెగిస్తుందా అని చిదంబరం ట్వీట్ చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం మాజీ ప్రధాని, మాజీ ఉపరాష్ర్టపతిలను వివాదంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందా అంటూ ప్రశ్నించారు. ప్రధాని నీచరాజకీయాలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను తప్పుపట్టిన కాంగ్రెస్ పార్టీ సైతం అయ్యర్‌పై వేటువేసింది. దీంతో ఈ వివాదాన్ని బీజేపీ తమకు అనుకూలంగా మలుచుకుని గుజరాత్ ప్రచార సభల్లో లేవనెత్తుతోంది. పాక్ హైకమిషనర్‌తో కాంగ్రెస్ నేతల రహస్య మంతనాలంటూ ప్రచారంలో ఊదరగొడుతోంది. -
సోనియాను కూడా వదిలిపెట్టని వివాదాస్పదుడు
సాక్షి, న్యూఢిల్లీ : వివాదాలకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్. అనవసరంగా ఎదుటివారి మీద నోరు పారేసుకోవడం పార్టీని ఇరుకున పెట్టడం ఆయనకు మొదటి నుంచి అలవాటే. ఈసారి సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ‘నీచ్ ఆద్మీ’ ( నీచమైన మనిషి అనే అర్థంకన్నా నీచ, అంటే తక్కువ జాతికి లేదా కులానికి చెందిన వ్యక్తి అనే అర్థం ఎక్కువ వస్తుంది) సంబోధించడం కొత్త వివాదాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్నే కోల్పోయారు. పార్టీ అధ్యక్షుడు కాబోతున్న రాహుల్ గాంధీ ఆయన వ్యాఖ్యలను తప్పు పట్టడంతో పార్టీ అధిష్టానం ఆయనపై చర్య తీసుకుంది. వాస్తవానికి ఇలాంటి విషయంలో ఆయనపై పార్టీ అధిష్టానం ఎప్పుడో చర్య తీసుకోవాల్సిందీ. 2014లో కూడా మణిశంకర్ అయ్యర్ బీజేపీ పార్టీ తరఫున ప్రధాన మంత్రి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నరేంద్ర మోదీని ఉద్దేశించి ‘ఛాయ్‌వాలా’ అనే సంబోంధించారు. మోదీ గెలిచే అవకాశం లేనందున ఆయన కోసం ‘ఛాయ్’ అమ్ముకునే చోటును మాత్రం వెతికి పెడతామని కూడా వ్యాఖ్యానించారు. నాడు, నేడు కూడా అయ్యర్ వ్యాఖ్యలను మోదీ విజయవంతంగా తిప్పికొట్టడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టారు. మణిశంకర్ అయ్యర్ విమర్శలు విపక్ష పార్టీ నాయకులపైనే కాదు, సొంత పార్టీ నాయకులపై కూడా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. ముఖ్యంగా తనకంటే తక్కువ మేథావులనుకున్న వారిని ఎక్కువ హేళన చేసేవారు. గాంధీ కుటుంబం విధేయుడు, మాజీ మంత్రి కే. నట్వర్ సింగ్ ఓసారి సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ సందర్శకుల పుస్తకంలో ‘నేను ఇంత వాడిని అవడానికి ఈ కాలేజీయే కారణం’ అని రాశాడట. దాని కిందనే ‘ఎందుకు కాలేజేని నిందిస్తాం?’ అని మణిశంకర్ అయ్యర్ రాశారని చెబుతారు. మణిశంకర్ అయ్యర్ కూడా అదే కాలేజీలో చదువుకున్నారు. మాజీ కాంగ్రెస్ మంత్రి అజయ్ మేకన్ ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని తప్పుపడుతూ ఆయన సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చదువుకోలేదుకదా! అని కూడా వ్యాఖ్యానించారు. ఓసారి తన ఇంటి పక్కనే ఉండే తన ‘ఐఎఫ్ఎస్’ సహచరుడి గురించి అయ్యర్ ప్రస్తావిస్తూ ‘నా నుంచి రక్షించుకునేందుకు నీవు చాలా ఎల్తైన ప్రహరీ గోడను కట్టుకున్నావు. నెనెప్పుడైనా వెన్నుపోటే పొడుస్తానని తెలియదు పాపం!’ అని వ్యాఖ్యానించారు. అయ్యర్ క్రీడల మంత్రిగా ఉన్నప్పుడు తన కాంగ్రెస్ ప్రభుత్వాన్నే విమర్శించి ఇరుకున పెట్టారు. కామన్వెల్త్ క్రీడలను ప్రారంభించాల్సిన ఆయన క్రీడలకు వ్యతిరేకంగా రాజ్‌ఘాట్ వద్ద ధర్నాకు దిగుతానని హెచ్చరించారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను ప్రోత్సహించడంలో మన్మోహన్ సింగ్ అనుసరిస్తున్న ఆర్థిక పంథాను అయ్యర్ తప్పు పట్టారు. అంతేకాకుండా ఆయన ఆర్థిక విధానాలు వామపక్షాల తీవ్రవాదాన్ని నిర్మూలించేవిగా ఉన్నాయంటూ దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలతో లక్ష శాతం ఏకీభవిస్తున్నానని చెప్పారు. పాకిస్థాన్ పట్ల కాంగ్రెస్ వైఖరిని కూడా ఆయన ఎప్పుడూ తప్పుపట్టేవారు. ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కూడా విడిచిపెట్టకుండా విమర్శనాస్త్రాలను సంధించారు. కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ఏ పదవి దక్కనప్పుడు ‘కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులు కావాలంటే రెండు అర్హతలు ఉండాలి. ఒకటి డిగ్రీ ఉండకూడదు. రెండూ బైపాస్ సర్జరీ అయ్యుండాలి. ఈ రెండింటిలోనూ నేను అర్హుడిని కాను’ అని అన్నారు. సోషల్ గ్యాదరింగ్‌లలో అతి«థులు ఇబ్బందిపడేలా సోనియా గాంధీని తాను ఎలా విమర్శించేదో ఆయనే పలుసార్లు చెప్పుకున్నారు. ‘నేను ఓసారి అలా విమర్శిస్తుంటే పక్క గదిలో నుంచి మనీ!...నేనిక్కడున్నాను. అంటూ బాగా పరిచయం ఉన్న గొంతు (సోనియా) వినిపించగానే అంతటితో ఆపేసేవాణ్ని’ అని చెప్పారు. ఈ వ్యాఖ్యలను ఓ హిందీ పత్రిక ‘మణి హై కీ మాన్తా నహీ’ పేరిట ప్రచురించింది. నిజం చెప్పాలంటే మణిశంకర్ అయ్యర్ ఆషామాషీ వ్యక్తి కాదు. ప్రతిష్టాకరమైన డూన్స్ స్కూల్, సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చదివి కేంబ్రిడ్జి యూనివర్శిటీ నుంచి డిగ్రీ పొందారు. ఐఎఫ్ఎస్ పూర్తిచేసి దౌత్యవేత్తగా విజయవంతంగా పనిచేశారు. 1980 దశకంలో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతర్జాతీయ సంబంధాల నుంచి స్థానిక పంచాయితీ రాజకీయాల వరకు అన్ని అంశాలు క్షుణ్నంగా తెలిసిన వ్యక్తి. మంచి వక్త. టీవీ మీడియాలో పాపులర్. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో పెట్రోలియం, క్రీడలు, పంచాయతీ రాజ్ శాఖా మంత్రిగా రాణించారు. సోనియా గాంధీ స్పీచ్ రైటర్‌గా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అయినాగానీ ఇతరులను తూలనాడుటలో సమతౌల్యం ఉండేది కాదు. -
మణిశంకర్ అయ్యర్ సస్పెన్షన్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై ‘నీచ జాతికి చెందిన వ్యక్తి’ అంటూ వ్యాఖ్యలు చేసిన మాజీ కేంద్ర మంత్రి మణిశంకర్ అయ్యర్‌ను కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. మోదీపై చేసిన ఈ పరుష వ్యాఖ్యలు గుజరాత్ ఎన్నికల్లో పెను ప్రభావం చూపనున్న నేపథ్యంలో నష్ట నివారణ చర్యల్లో భాగంగానే క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. రాజకీయ దుమారం రేగటంతో అయ్యర్ క్షమాపణ చెప్పినప్పటికీ ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దుచేసింది. షోకాజ్ నోటీసులూ జారీచేసింది. అయ్యర్ వ్యాఖ్యలను సమర్థించబోమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులెవరూ ఇలాంటి పరుష పదాలను వినియోగించకూడదని ఆయన కోరారు. అంతకుముందు, ఢిల్లీలో అంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రాన్ని ప్రారంభించిన మోదీ.. రాజ్యాంగ నిర్మాత దేశానికి చేసిన సేవలను చెరిపేసేందుకు గత ప్రభుత్వాలు ప్రయత్నించాయని వ్యాఖ్యానించారు. దీనిపై మణిశంకర్ అయ్యర్ స్పందిస్తూ.. ‘మోదీ నీచమైన జాతికి చెందిన వ్యక్తి, ఆయనకు సభ్యత లేదు’ అని తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలు గుజరాత్ ఎన్నికల సమయంలో తీవ్ర దుమారం రేపాయి. దీనిపై ప్రధాని అదే స్థాయిలో స్పందించారు. ఈ వ్యాఖ్యలు గుజరాతీలకు జరిగిన అవమానమని, కాంగ్రెస్ నేతల మొఘల్ ఆలోచనకు ఇది ప్రతిరూపమని సూరత్ అన్నారు. ఎన్నికల్లో బీజేపీకి ఓటేయటం ద్వారా కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. అసలేం జరిగింది? గురువారం ఢిల్లీలో అంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రాన్ని మోదీ ప్రారంభించారు. అంబేడ్కర్ పేరుతో ఓట్లు అడుగుతున్న కొన్ని పార్టీలు అంబేడ్కర్∙సేవలను చెరిపివేసేందుకు ప్రయత్నించాయని పరోక్షంగా కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. ‘అంబేడ్కర్ సిద్ధాంతాలను కొందరు అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. జాతి నిర్మాణానికి ఆయన చేసిన సేవలను చెరిపివేయాలని చూశారు. కానీ ప్రజల మనసుల్లో అంబేడ్కర్ ఆదర్శాలు అలాగే నిలిచి ఉన్నాయి’ అని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక 2015లో ఈ కేంద్రానికి శంకుస్థాపన చేశారని.. 23 ఏళ్లుగా గత ప్రభుత్వాలు ఈ అంశంపై ఆలోచిస్తూనే ఉన్నాయని విమర్శించారు. మోదీ వ్యాఖ్యలపై అయ్యర్ తీవ్రంగా స్పందించారు. ‘ఆ వేదిక ద్వారా ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ప్రధానికేముంది?. ఆయన చాలా నీచమైన వాడు (బహుత్ నీచే కిస్మ్కీ ఆద్మీ హై) నీచమైన మనిషి. కొంచమైనా సభ్యత లేదు’ అని తీవ్రంగా మండిపడ్డారు. విభేదించిన కాంగ్రెస్ అయ్యర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధానికి అయ్యర్ క్షమాపణ చెప్పాలని పార్టీ పరంగా, తాను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నట్లు రాహుల్‌గాంధీ చెప్పారు. ‘బీజేపీ, ప్రధాని తరచుగా కాంగ్రెస్ పార్టీపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై ఇలాంటి భాషను వాడటం కాంగ్రెస్ సంస్కృతి కాదు. అయినా, మణిశంకర్ అయ్యర్ ఉపయోగించిన భాష, పదాల తీవ్రతను నేను సమర్థించను. తన వ్యాఖ్యలపై అయ్యర్ క్షమాపణలు చెప్పాలని భావిస్తున్నా’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అయ్యర్ క్షమాపణ.. మోదీపై తను చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపటంతో అయ్యర్ స్పందించారు. తన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు. మోదీ కులం నీచమైనదని చెప్పాలన్నది తన ఉద్దేశం కాదని.. తనకు హిందీ సరిగా రాని కారణంగా ఆ పదాన్ని వాడాల్సి వచ్చిందన్నారు. ‘నీచ్కు హిందీలో చాలా అర్థాలున్నాయని చెప్పారు. ఒకవేళ మోదీ నా వ్యాఖ్యలను నీచజాతిగా భావించి ఉన్నట్లయితే క్షమాపణలు చెబుతున్నా. ఇలా జాతి గురించి తప్పుగా మాట్లాడటం నా సంస్కృతి కాదు. నా వ్యాఖ్యలు గుజరాత్లో పార్టీకి నష్టం చేస్తాయని భావిస్తున్నందునే క్షమాపణలు కోరుతున్నా’ అని అయ్యర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీపై, అంబేడ్కర్‌పై దారుణమైన వ్యాఖ్యలు చేసినందుకే తను మోదీపై చేసిన వ్యాఖ్యల్లో ‘నీచ’ పదాన్ని వాడానన్నారు. అయితే, రెండ్రోజుల్లో గుజరాత్ తొలిదశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అయ్యర్‌ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. షోకాజ్ నోటీసులు జారీచేసింది. ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దుచేస్తున్నట్లు ప్రకటించింది. గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన అయ్యర్‌పై వేటు వేయటం ద్వారా గుజరాత్లో కొంతకాలంగా చేస్తూవస్తున్న సోషల్ ఇంజనీరింగ్ నీటిపాలు కాకుండా చూసుకుంటోంది. ‘మాజీ ప్రధానులైన నెహ్రూ, ఇందిరలను మోదీ అవమానిస్తున్నారు. అయినా.. దీనిపై అదే భాషలో ప్రతిస్పందించటం మా పార్టీ సంస్కృతి కాదు’ అని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా తెలిపారు. గుజరాతీలకే అవమానం: మోదీ అయ్యర్ వ్యాఖ్యలపై మోదీ స్పందించారు. సూరత్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. ‘మణిశంకర్ అయ్యర్ నన్ను నీచజాతికి చెందినవాడినన్నారు. నన్ను నీచుడినన్నారు. ఇది గుజరాత్‌కే అవమానం. ఆ మాటకొస్తే యావద్భారతానికే అవమానం. మంచి దుస్తులు ధరించే వారిని చూసి ఓర్వలేదు. ఇది మొఘల్‌ల ఆలోచనాధోరణికి ప్రతీక. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటువేసి కాంగ్రెస్‌కు సరైన సమాధానం ఇవ్వండి’ అని అన్నారు. తనను మృత్యు బెహారీ అని జైలుకు పంపిస్తామని విమర్శలు చేశారని గతంలో కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. ‘అతను (అయ్యర్) సంపన్న కుటుంబం నుంచి వచ్చి ఉండొచ్చు. వర్సిటీల్లో చాలా డిగ్రీలు పొంది ఉండొచ్చు. దౌత్యవేత్తగా, కేంద్ర మంత్రిగా పనిచేసుండొచ్చు. కానీ ఇంతలా ఓ వ్యక్తిని అవమానించాలా? కులం పేరుతో మాపై వివక్ష చూపుతారు. ‘మురికినీళ్లలో పురుగు’ (గందీ నాలీకా కీడా), గాడిద, నీచుడంటూ చులకన చేస్తారు’ అని మోదీ పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు అయ్యర్ వ్యాఖ్యలపై స్పందించకూడదని మోదీ పేర్కొన్నారు. ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ బాబా సాహెబ్ (అంబేడ్కర్) కన్నా భోలే బాబాపైనే ఎక్కువ ఆసక్తిని కనబరుస్తోందని పరోక్షంగా రాహుల్‌పై విమర్శలు చేశారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా అయ్యర్ వ్యాఖ్యలను ఖండించారు. ‘యమరాజు, మృత్యుబెహారీ, రావణుడు, మురికి నీళ్లలో పురుగు, కోతి, రెబీస్ బాధితుడు, వైరస్, భస్మాసురుడు, గూండా.. వంటి పదాలను ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేతలు తరచూ వాడుతున్నారు. అయినా వారంతా బాగుండాలని మేం కోరుకుంటాం’ అని షా పేర్కొన్నారు. -
కాంగ్రెస్‌కు మోదీ తాజా వార్నింగ్
సాక్షి, న్యూఢిల్లీ : తనను తక్కువస్థాయి వ్యక్తి అంటూ విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్‌కు ప్రధాని నరేంద్రమోదీ గట్టి కౌంటర్ ఇచ్చారు. గుజరాత్ ఎన్నికల్లో ఈ మాటలకు త్వరలోనే మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. అది మొగలాయి ఆలోచన విధానం తప్ప మరొకటి కాదని విమర్శించారు. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో మోదీని విమర్శించిన మణిశంకర్ 'ఈయన(నరేంద్రమోదీ) తక్కువ స్థాయి మనిషి. ఆయనకు సంస్కారం లేదు.. ఈ సమయంలో ఆయన ఎందుకు ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తున్నారు?' అని అన్నారు. ఈ మాటలకు ఎన్నికల ప్రచారంలో ఉన్న మోదీ స్పందిస్తూ 'గొప్ప గొప్ప విద్యాసంస్థల్లో చదివి, దౌత్యవేత్తగా, కేబినెట్ మంత్రిగా కూడా విధులు నిర్వర్తించిన కాంగ్రెస్ పార్టీ నేత మోదీ కిందిస్థాయి సంస్కారం లేని వ్యక్తి అన్నారు. ఇది అవమానించడం మాత్రమే కాదు.. ఆయన మొగలాయి మైండ్‌సెట్ కూడా. ఆయన అన్న మాటలకు నేను ఇంతకంటే ఏమీ చెప్పలేని..అది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం.. వారికి వారి భాష ఉంటే మన పని మనకు ఉంది. బ్యాలెట్ బాక్స్‌లలో ప్రజలు వారికి సమాధానం చెబుతారు. వారు మూల్యం చెల్లించుకుంటారు' అని మోదీ అన్నారు. ఇప్పటికే మోదీకి మణిశంకర్ అయ్యర్ క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. I have nothing to say on a ‘wise’ Congress leader calling me ’Neech'. This is the Congress mindset. They have their language and we have our work. People will answer them through the ballot box. https://t.co/2McoZnaoar pic.twitter.com/icGqAphUzy — Narendra Modi (@narendramodi) December 7, 2017 -
సభ్యుడు కాకపోయినా లోక్‌సభలోకి వచ్చేశాడు!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ బుధవారం లోక్‌సభ చాంబర్లో కనిపించడం పలువురిని ఆశ్చర్యపరిచింది. ఆయన లోక్‌సభ సభ్యుడు కాదు. కాంగ్రెస్ నుంచి రాజ్యసభలో సభ్యుడిగా ఉన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో లోక్‌సభ చాంబర్లోకి వచ్చిన అయ్యర్.. చివరి వరుసలో కాసేపు ఉన్నారు. ఆయన ఎందుకొచ్చారో తెలియదుకానీ లోక్‌సభ సహాయకుడితో కొంతసేపు ముచ్చటించి ఆ తర్వాత వెళ్లిపోయారు. కొన్ని నిమిషాల తర్వాత మళ్లీ చాంబర్ ఎంట్రన్స్ వరకు ఆయన వచ్చారు. అయితే ఈసారి లోక్‌సభ లోపలికి ప్రవేశించలేదు. అక్కడే ఉన్న లోక్‌సభ సహాయకుడితో కాసేపు మాట్లాడి.. అటు నుంచి అటే వెళ్లిపోయారు. ఇంతకు ఆయన లోక్‌సభలోకి ఎందుకొచ్చారన్న విషయం మాత్రం తెలియలేదు.