సాక్షి, న్యూఢిల్లీ : తనను తక్కువస్థాయి వ్యక్తి అంటూ విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్‌కు ప్రధాని నరేంద్రమోదీ గట్టి కౌంటర్ ఇచ్చారు. గుజరాత్ ఎన్నికల్లో ఈ మాటలకు త్వరలోనే మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. అది మొగలాయి ఆలోచన విధానం తప్ప మరొకటి కాదని విమర్శించారు. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో మోదీని విమర్శించిన మణిశంకర్ 'ఈయన(నరేంద్రమోదీ) తక్కువ స్థాయి మనిషి. ఆయనకు సంస్కారం లేదు.. ఈ సమయంలో ఆయన ఎందుకు ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తున్నారు?' అని అన్నారు.
ఈ మాటలకు ఎన్నికల ప్రచారంలో ఉన్న మోదీ స్పందిస్తూ 'గొప్ప గొప్ప విద్యాసంస్థల్లో చదివి, దౌత్యవేత్తగా, కేబినెట్ మంత్రిగా కూడా విధులు నిర్వర్తించిన కాంగ్రెస్ పార్టీ నేత మోదీ కిందిస్థాయి సంస్కారం లేని వ్యక్తి అన్నారు. ఇది అవమానించడం మాత్రమే కాదు.. ఆయన మొగలాయి మైండ్‌సెట్ కూడా. ఆయన అన్న మాటలకు నేను ఇంతకంటే ఏమీ చెప్పలేని..అది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం.. వారికి వారి భాష ఉంటే మన పని మనకు ఉంది. బ్యాలెట్ బాక్స్‌లలో ప్రజలు వారికి సమాధానం చెబుతారు. వారు మూల్యం చెల్లించుకుంటారు' అని మోదీ అన్నారు. ఇప్పటికే మోదీకి మణిశంకర్ అయ్యర్ క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే.
I have nothing to say on a ‘wise’ Congress leader calling me ’Neech'. This is the Congress mindset. They have their language and we have our work. People will answer them through the ballot box. https://t.co/2McoZnaoar pic.twitter.com/icGqAphUzy
— Narendra Modi (@narendramodi) December 7, 2017
Comments
Please login to add a commentAdd a comment