సభ్యుడు కాకపోయినా లోక్‌సభలోకి వచ్చేశాడు! | Congress, ManiShankar Aiyar, Lok Sabha, కాంగ్రెస్, లోక్‌ సభ, మణిశంకర్ అయ్యర్ | Sakshi
Sakshi News home page

సభ్యుడు కాకపోయినా లోక్‌సభలోకి వచ్చేశాడు!

Published Wed, Feb 24 2016 4:54 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

సభ్యుడు కాకపోయినా లోక్‌సభలోకి వచ్చేశాడు! - Sakshi

సభ్యుడు కాకపోయినా లోక్‌సభలోకి వచ్చేశాడు!

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ బుధవారం లోక్‌సభ చాంబర్‌లో కనిపించడం పలువురిని ఆశ్చర్యపరిచింది. ఆయన లోక్‌సభ సభ్యుడు కాదు. కాంగ్రెస్‌ నుంచి రాజ్యసభలో సభ్యుడిగా ఉన్నారు.

ప్రశ్నోత్తరాల సమయంలో లోక్‌సభ చాంబర్‌లోకి వచ్చిన అయ్యర్‌..  చివరి వరుసలో కాసేపు ఉన్నారు. ఆయన ఎందుకొచ్చారో తెలియదుకానీ లోక్‌సభ సహాయకుడితో కొంతసేపు ముచ్చటించి ఆ తర్వాత వెళ్లిపోయారు. కొన్ని నిమిషాల తర్వాత మళ్లీ చాంబర్ ఎంట్రన్స్‌ వరకు ఆయన వచ్చారు. అయితే ఈసారి లోక్‌సభ లోపలికి ప్రవేశించలేదు. అక్కడే ఉన్న లోక్‌సభ సహాయకుడితో కాసేపు మాట్లాడి.. అటు నుంచి అటే వెళ్లిపోయారు. ఇంతకు ఆయన లోక్‌సభలోకి ఎందుకొచ్చారన్న విషయం మాత్రం తెలియలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement