- పత్తి చెట్లు ధ్వంసం
- బోరున విలపించిన కౌలు రైతు
ఖబరస్థాన్ స్థలం ఆక్రమణ
Published Sun, Aug 28 2016 12:03 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
ఉప్పరపల్లి(చెన్నారావుపేట) : మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలోని ఖబరస్థాన్ స్థలంను ఓ రైతు ఆక్రమించాడు. అంతేగాక ఆ స్థలంలో పత్తి చేను వేసుకున్న కౌలు రైతు పంటను ధ్వంసం చేసిన సంఘటన శనివారం జరిగింది. గ్రామానికి చెందిన ముస్లింలకు గ్రామశివారులోని సర్వే నంబర్ 234/ఆ లో ఎకరం 30 గుంటల భూమి ఉంది. అందులోని 10 గుంటల భూమిలో సమాధులు ఉన్నాయి. మిగిలిన ఎకరం 20 గుంటల భూమిని ముస్లింల అభివృద్ధికి గ్రామానికి చెందిన మహ్మద్ రాజమహ్మద్‌కు కౌలుకు ఇచ్చారు. అతడు అందులో పత్తి సాగు చేశాడు. శుక్రవారం గ్రామానికి చెందిన మహ్మద్ మహబూబ్(80) అనారోగ్యంతో మృతిచెందాడు. అతడిని సమాధి చేయడానికి తీసుకెళ్తుండగా ఇదే గ్రామానికి చెందిన కుక్కల రాజాలు తన భూమిలో నుంచి శవాన్ని తీసుకెళ్లద్దంటూ అడ్డుకున్నాడు. రాజాలు భూమికి ఆనుకొని ఖబరస్థా¯Œæకు వెళ్లే దారి ఉంది. రాజాలు దారిని ఆక్రమించుకొని ఖబరస్థాన్‌కు వెళ్లడానికి దారి లేదన్నాడు. దీంతో అతడితో వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం శవాన్ని ముస్లింలు సమాధి చేశారు. దీన్ని దృష్టిలో పెట్టకొని రాజాలు శుక్రవారం రాత్రి ఖబరస్థాన్‌లో సాగు చేస్తున్న పత్తి మొక్కలను ధ్వంసం చేశాడని బాధిత రైతు మహ్మద్ రాజమహ్మద్ వాపోయాడు. తమకు న్యాయం చేయాలని కోరుతూ పోలీస్‌స్టేçÙన్‌లో, ఆర్డీఓ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు కౌలు రైతు రాజమహ్మద్, పెద్దలు ఖాదర్, మౌలానా, రహిమోద్దిన్, యాకూబ్‌పాషా, షరీఫ్, తదితరులు తెలిపారు.
Advertisement
Advertisement