కీవ్: ఉక్రెయిన్‌ను ఆక్రమించడమే లక్ష్యంగా రష్యా బలగాలు మరింత ముందుకొచ్చాయి. రష్యన్ సేనలు కీవ్‌ను చేరుకున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఈక్రమంలో నగరంపై వైమానిక దాడులు జరిగే ప్రమాదం ఉందని... ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని ఆయన హెచ్చరికలు జారీచేశారు. నమ్ముకున్న దేశాలన్నీ తమను నట్టేట ముంచాయని నాటో సభ్య దేశాలను ఉద్దేశించి జెలెన్‌స్కీ ఓ వీడియో సందేశంలో ఆవేదన వ్యక్తం చేశారు.
క్షమాపణలు చెబుతున్నా
‘మమ్మల్ని అన్ని దేశాలు ఒంటరి చేశాయి. చాలా దేశాల ప్రధానులతో మాట్లాడాం. ఎవరూ సాయం అందించేందుకు ముందుకు రావడం లేదు. రష్యాకు అన్ని దేశాలు భయపడుతున్నాయి. 27 యూరోపియన్ దేశాలను రక్షించమని అడిగాం. నాటో దళాలను నమ్ముకున్నా ఫలితం లేదు. ఉక్రెయిన్ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నా’ అని ఆయన పేర్కొన్నారు.
(చదవండి: నా పదవీకాలంలో అత్యంత విషాద క్షణాలు!)
రష్యా టార్గెట్ అదే!
తనను చంపడమే రష్యా తొలి టార్గెట్ అని, తన కుటుంబాన్ని అంతమొందించడం రెండో టార్గెట్ అని జెలెన్‌స్కీ భావోద్వేగానికి గురయ్యారు. రష్యాతో పోరాటంలో తాము ఒంటరివారమయ్యామని ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. ఏదేమైనా తాను తన దేశాన్ని విడిచి వెళ్లనని ఆయన స్పష్టం చేశారు.
కాగా, నల్ల సముద్రంలో ఉక్రెయిన్‌కు చెందిన స్నేక్ ఐలాండ్‌ను రష్యా స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో ద్వీపంలో ఉన్న 13మంది ఉక్రెయిన్ బోర్డర్ గార్డ్స్‌ను రష్యా దళాలు చంపేసినట్టు అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. ఉక్రెయిన్ పరిపాలనా భవనాలపై రష్యా జెండాలు ఎగిరాయి.
(చదవండి: గ్యాసో లక్ష్మణా!.. యుద్ధంతో యూరప్ ఉక్కిరిబిక్కిరి)
Comments
Please login to add a commentAdd a comment