రేపు డీఈఓ కార్యాలయ ముట్టడి | deo office invasion tomorrow | Sakshi
Sakshi News home page

రేపు డీఈఓ కార్యాలయ ముట్టడి

Published Mon, Jun 19 2017 11:41 PM | Last Updated on Tue, Sep 5 2017 1:59 PM

deo office invasion tomorrow

అనంతపురం ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయులకు గుదిబండగా మారిన వెబ్‌కౌన్సెలింగ్, పర్ఫార్మెన్స్ పాయింట్లు, రేషలైజేషన్ కు వ్యతిరేకంగా రాష్ట్ర ఫ్యాప్టో, జాక్టో పిలుపుమేరకు ఈ బుధవారం తలపెట్టిన డీఈఓ ఆఫీస్‌ ముట్టడిని జయప్రదం చేయాలని  నాయకులు ఓ సంయుక్త ప్రకటనలో పిలుపునిచ్చారు.  పర్ఫార్మెన్స్ పాయింట్లకు సంబంధించి చాలా అంశాల్లో స్పష్టత లేదని,  ఇప్పటిదాకా ఖాళీల సంఖ్య, వివరాలపై ఉపాధ్యాయులకు అవగాహన రాలేదని పేర్కొన్నారు.  ప్ర భుత్వ తీరుకు నిరసనగా బుధవారం 9 గంటలకు ఆర్ట్స్‌ కళాశాల నుంచి డీఈఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కార్యాలయాన్ని దిగ్భందిస్తామని వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement