ఆధునిక కాలంలో అమెజాన్ అలెక్సా, యాపిల్ హే సిరి వంటి వాయిస్ అసిస్ట్ సర్వీకులు ఎక్కువ వాడుకలో ఉన్నాయి. అయితే అలెక్సా త్వరలో కొన్ని డివైజ్‌లలో పనిచేయదని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
అమెజాన్ అలెక్సా సర్వీసుకు సంబంధించి సెర్చ్ ఇంజిన్ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇది గూగుల్ నెస్ట్ కిట్‌పై పనిచేయదని సమాచారం. రేపటి నుంచి (2023 సెప్టెంబర్ 29) గూగుల్ లెగసీ నెస్ట్ కిట్ ద్వారా అలెక్సా సేవలు నిలిచిపోతున్నాయి. అయితే ఈ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండాలంటే కొత్త Google Nest స్కిల్‌ని యాక్టివేట్ చేసుకోవచ్చు.
- ముందుగా మీ మొబైల్‌లోని అలెక్సా యాప్ ఓపెన్ చేసి, ట్యాప్ మరి మీద క్లిక్ చేయాలి.
- తరువాత స్కిల్ అండ్ గేమ్స్ సెలక్ట్ చేసుకుని, ఫైండ్ యువర్ స్కిల్స్ ఎంచుకోవాలి.
- ఫైండ్ నెస్ట్ అలెక్సా స్కిల్ సెలక్ట్ చేసి డిసేబుల్ చేయాలి.
* అలెక్సా యాప్‌లో ఉన్న నెస్ట్ డివైజెస్ అన్నీ రిమూవ్ చేయాలి.
- గూగుల్ హోమ్ యాప్‌లో న్యూ గూగుల్ నెస్ట్ అలెక్సా స్కిల్ ప్రారంభించడానికి, ముందుగా యాప్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి + గుర్తు మీద ట్యాప్ చేయాలి.
- అందులో సర్వీస్ ఎంచుకుని అందులో అమెజాన్ అలెక్సా స్కిల్ సెలక్ట్ చేసుకోవాలి.
- ఆ తరువాత అలెక్సా యాప్ ఓపెన్ చేసి యాక్టివేట్ చేసుకోవాలి.
- అమెజాన్ ఎకో స్పీకర్ లేదా డిస్‌ప్లేను కలిగి ఉన్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
Comments
Please login to add a commentAdd a comment