సాటిదని చూడకుండా బట్టలిప్పి.. కారం చల్లి.. | 60-year-old woman's face blackened as 'punishment' in UP village | Sakshi
Sakshi News home page

సాటిదని చూడకుండా బట్టలిప్పి.. కారం చల్లి..

Published Tue, Apr 26 2016 10:01 AM | Last Updated on Sun, Sep 3 2017 10:49 PM

సాటిదని చూడకుండా బట్టలిప్పి.. కారం చల్లి..

సాటిదని చూడకుండా బట్టలిప్పి.. కారం చల్లి..

లఖింపూర్ ఖేరి: కన్న కుమారుడి ప్రేమ వ్యవహారం ఓ తల్లిని బజారుపాలు చేసింది. తన కుమారుడు ఓ యువతితో వెళ్లిపోయాడనే కారణంతో ఆ యువకుడి తల్లికి ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు నరకం చూపించారు. ఆమె వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా అందరిముందు బట్టలూడదీసి కొట్టారు. చిత్రహింసలు పెట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. లఖింపూర్ ఖేరీలో ప్రేమించుకున్న ఇద్దరు యువతీయువకులు ఆదివారం సాయంత్రం ఎవరికీ తెలియకుండా వెళ్లిపోయారు.

దీంతో బాలిక తరుపు కుటుంబ సభ్యులు, బంధువులు యువకుడి ఇంటిపై దాడికి దిగారు. 60 ఏళ్ల వయసున్న అతడి తల్లిని బయటకు లాగి తీవ్రంగా కొట్టడంతోపాటు బట్టలూడదీశారు. అనంతరం ముఖంపై, చెప్పరాని చోట్ల కారంపోసి పొర్లించి కొట్టారు. తన భార్యకు సహాయం చేయాల్సిదిగా ఆమె భర్త గ్రామస్తులను బ్రతిమాలుకున్నా ఎవరూ సాయం చేయలేదు. అదే సమయానికి పోలీసులు వచ్చి దుశ్చర్యను అడ్డుకున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఆస్పత్రిలో చికిత్స  పొందుతోందని  పోలీసు అధికారులు తెలిపారు. మొత్తం ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేయగా నిందితులు పరారీలో ఉన్నారు. వీరిలో నలుగురు మహిళలే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement