ఓ విద్యార్థికి బట్టలు ఊడదీయించి పూర్తి నగ్నంగా నిలబెట్టారు. మరో అబ్బాయి లోదుస్తులు లేకుండా చొక్కాలు విప్పిన షర్ట్పై అతని పక్కనే కనిపించాడు. వీరిద్దరినీ స్కూల్లోకి రానివ్వకుండా డోర్ ముందు నిలబెట్టారు. ఎవరైనా అటుగా వెళితే ఈ అబ్బాయిలు ఇద్దరూ సిగ్గుతో మొహం కనిపించకుండా చేతులు అడ్డుపెట్టుకున్నారు. ఇంతకీ వీరు చేసిన నేరం ఏంటో తెలుసా? హోం వర్క్ చేయకపోవడమే. ఇంత చిన్న తప్పుకు స్కూల్ టీచర్ వారిపట్ల పైశాచికంగా ప్రవర్తించింది. ముంబై శివారు ప్రాంతం మలడ్లోని కోచింగ్ సెంటర్లో ఈ ఘటన జరిగింది. ఎన్జీవోకు చెందని ఓ సభ్యుడు ఈ ఘటనను వీడియో తీయడంతో పెద్ద దుమారం రేగింది.
విద్యార్థులకు శిక్ష వేసిన టీచర్పై కఠిన చర్యలు తీసుకోవాలని వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు వయసు 8, 9 ఏళ్లు. వీళ్లను నగ్నంగా నిలబెట్టిన టీచర్ సరోజా నాయర్, కోచింగ్ సెంటర్ యజమాని గణేశ్ నాయర్పై కేసు నమోదు చేశారు. వీరిద్దరూ బంధువులు అవుతారు. కాగా పోలీసులు వీరిని ఇంకా అరెస్ట్ చేయలేదు. పిల్లలను అరగంట పాటు స్కూల్ బయట నిలబెట్టారని, తాము వెళ్లే సరికి వారు ఏడుస్తూ ఉన్నారని ఎన్జీవో ప్రతినిధులు చెప్పారు.
హోం వర్క్ చేయలేదని బట్టలు విప్పించింది
Published Sun, Mar 13 2016 6:03 PM | Last Updated on Sun, Sep 3 2017 7:40 PM
Advertisement
Advertisement